E-Paper
Advertisement

Hyderabad: ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. స్పాట్‌లోనే వాళ్లిద్దరినీ ఉతికి ఆరేసిన భార్య

Hyderabad: ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. స్పాట్‌లోనే వాళ్లిద్దరినీ ఉతికి ఆరేసిన భార్య
Advertisement

Hyderabad: నేటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు అత్యంత వేగంగా దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు నూరేళ్ల పంటగా భావించే వివాహ బంధం.. నేడు క్షణికమైన శారీరక వాంఛల కోసం, కొత్త దనం కోరుకునే మోజు కోసం బలి అయిపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారైనా, పెద్దలు కుదిర్చిన సంబంధమైనా… కొన్నాళ్లకే ఒకరిపై ఒకరికి విరక్తి కలగడం లేదా మూడో వ్యక్తి ప్రవేశంతో పచ్చని సంసారంలో చిచ్చు మొదలవుతోంది. అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌కు చెందని బాబు అనే వ్యక్తి  లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్ విభాగంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి 2010లో జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మరడంతో పెద్దలను ఒప్పించి వివాహా చేసుకున్నారు. పెళ్లయన కొత్తలో వీరి సంసారం సాఫిగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత బాబు ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య జ్యోతిని మానసికంగా, శారీరకగా వేధించడం ప్రారంభించాడని భార్య ఆరోపించింది.

Advertisement

భర్త తనపై చూపుతున్న నిర్లక్ష్యానికి కారణం మరో మహిళ అని జ్యోతికి అనుమానం కలిగింది. దీంతో బాాబు పద్దతి మార్చుకోవాలని చాలాసార్లు చెప్పి చూసింది. అలా చెప్పిన ప్రతీసారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే బాబు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఒక ఇంట్లో మరో మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు జ్యోతికి పక్కా సమాచారం అందింది. దీంతో ఈ  విషయాన్ని వెంటనే జ్యోతి తన బంధువులతో కలిసి సదరు ఇంటిపై దాడి చేసింది. అక్కడ తన భర్త బాబు మరో మహిళతో కలిసి ఉండడాన్ని చూసి షాక్ అయ్యింది. ఆవేశం హద్దులు దాటడంతో జ్యోతి, ఆమె బంధువులు బాబుకు దేహశుద్ధి చేశారు. నిలదీసిన క్రమంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితురాలు జ్యోతి ఫిర్యాదుతో నిందితుడు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను మోసం చేసి మరో మహిళతో ఉంటున్న భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్యోతి పోలీసులను కోరింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

ALSO READ: Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×