E-Paper
Advertisement

Galaxy Book 6: శాంసంగ్ ప్రీమియం ల్యాప్‌టాప్ లాంచ్.. పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పాటు సూపర్ ఫీచర్స్

Galaxy Book 6: శాంసంగ్ ప్రీమియం ల్యాప్‌టాప్ లాంచ్.. పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పాటు సూపర్ ఫీచర్స్
Advertisement

Galaxy Book 6 Laptop| కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ బుక్ 6 సిరీస్‌ ల్యాప్‌టాప్స్ యూకే మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ బుక్ 6, గెలాక్సీ బుక్ 6 ప్రో, గెలాక్సీ బుక్ 6 అల్ట్రా మోడల్స్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. అన్నీ లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లు కలిగి ఉన్నాయి. ప్రొఫెషనల్స్, క్రియేటర్లు, స్టూడెంట్స్‌కు బలమైన పెర్ఫామెన్స్ కావాలనుకునేవారిని టార్గెట్ చేసింది. ప్రీమియం డిస్‌ప్లేలు, ఫాస్ట్ ప్రాసెసర్లు, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌పై దృష్టి పెట్టింది.

గెలాక్సీ బుక్ 6 సిరీస్ ధరలు

గెలాక్సీ బుక్ 6 అల్ట్రా ధర 2,999 బ్రిటన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3,69,000). గెలాక్సీ బుక్ 6 ప్రో 16 ఇంచ్ మోడల్ ధర £1,499, 14 ఇంచ్ మోడల్ £1,399. గెలాక్సీ బుక్ 6 14 ఇంచ్ మోడల్ ధర £949, 16 ఇంచ్ మోడల్ £1,049. 16 ఇంచ్ టచ్‌స్క్రీన్ వేరియంట్ £1,099. అన్ని మోడల్స్ గ్రే కలర్‌లోనే లభిస్తాయి. ప్రీ-ఆర్డర్లు ఫిబ్రవరి 25 నుంచి, అధికారిక సేల్స్ మార్చి 11 నుంచి ప్రారంభమవుతాయి.

గెలాక్సీ బుక్ 6 అల్ట్రా ఫీచర్లు

Advertisement

ఈ మోడల్ ల్యాప్‌టాప్‌లో 16 ఇంచ్ AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. రెజల్యూషన్ 2880 x 1800 పిక్సెల్స్. పీక్ బ్రైట్‌నెస్ 1000 నిట్స్. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ 3 ఈవో ప్రాసెసర్‌తో వస్తుంది. ఇంటెల్ NPU AI టాస్క్‌లకు ఉపయోగపడుతుంది. NVIDIA GeForce 5070 డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉంది. 64GB వరకు LPDDR5x RAM, 1TB SSD స్టోరేజ్ సపోర్ట్ ఉంది. Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. 2MP 1080p వెబ్‌క్యామ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉన్నాయి. 80.20Wh బ్యాటరీ, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, థండర్‌బోల్ట్ 4, HDMI 2.1 పోర్ట్‌లు ఉన్నాయి. బరువు 1.89 కిలోలు, మందం 15.4mm.

గెలాక్సీ బుక్ 6 ప్రో ఫీచర్లు

16 ఇంచ్ వరకు AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో బెటర్ విజిబిలిటీ ఇస్తుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా X7 సిరీస్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇంటెల్ Arc ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, ఇంటెల్ NPU ఉన్నాయి. 16 ఇంచ్ మోడల్ RAM అప్‌గ్రేడ్ సపోర్ట్ చేస్తుంది. 14 ఇంచ్ మోడల్‌లో రామ్ అప్‌గ్రేడ్ లేదు. 16 ఇంచ్‌లో 78.07Wh బ్యాటరీ, 14 ఇంచ్‌లో 67.18Wh బ్యాటరీ ఉంది. బరువు 1.59 కిలోలు (16 ఇంచ్), 1.24 కిలోలు (14 ఇంచ్).

Advertisement

Also Read: మీ ఫోన్‌లో ఓటీపీ మెసేజ్‌లు కనిపించడం లేదా? ఇలా చేయండి

గెలాక్సీ బుక్ 6 ఫీచర్లు

16 ఇంచ్ IPS టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. WUXGA రెజల్యూషన్, 350 నిట్స్ బ్రైట్‌నెస్. 64GB వరకు LPDDR5x RAM, 1TB SSD స్టోరేజ్ సపోర్ట్ ఉంది. Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ GPU, ఇంటెల్ NPU ఉన్నాయి. 1080p వెబ్‌క్యామ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉన్నాయి. Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, థండర్‌బోల్ట్ 4, HDMI 2.1 పోర్ట్‌లు ఉన్నాయి. నాన్-టచ్ మోడల్ మందం 14.9mm, టచ్‌స్క్రీన్ మోడల్ 16.8mm.

శాంసంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ ప్రీమియం పెర్ఫామెన్స్, ఆధునిక డిజైన్‌పై దృష్టి పెట్టింది. ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, క్రియేటివ్ యూజర్లకు సరిపోతాయి. అల్ట్రా మోడల్ హెవీ వర్క్‌లోడ్, గేమింగ్‌కు బెస్ట్. ప్రో మోడల్ పవర్, పోర్టబిలిటీ బ్యాలెన్స్ చేస్తుంది. బేస్ మోడల్ తక్కువ ధరలో బలమైన ఫీచర్లు ఇస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×