Samsung Galaxy J15 Prime 5G: భారత స్మార్ట్‌ఫోన్ లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ పై పోటీ ప్రతి రోజూ వేగంగా పెరుగుతుండటం గమనించవచ్చు. ప్రతి కంపెనీ పెద్ద పెద్ద సంఖ్యలతో, ఆకర్షణీయ ప్రకటనలతో ప్రజల ముందుకు వస్తోంది. కానీ నిజానికి యూజర్ కోరేది రోజువారీ వాడకంలో సౌకర్యం, బలమైన నిర్మాణం, లాంగ్-టర్మ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్, ఇంకా నమ్మకంగా పనిచేసే ఫోన్‌నే. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని శామ్‌సంగ్ నేడు తన కొత్త మోడల్ శామ్‌సంగ్ గెలాక్సీ జి15 ప్రైమ్ 5జిను భారత మార్కెట్ కోసం సిద్ధం చేసింది. బయటికి పెద్ద హంగామా లేకుండా, సైలెంట్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఫోన్ క్వాలిటీపై దృష్టి పెట్టిన ఈ మోడల్ ఇప్పుడు అన్ని టెక్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
డిజైన్ పరంగా క్లాసిల్
డిజైన్ పరంగా ఈ మోడల్‌ను అత్యంత శ్రద్ధతో రూపొందించినట్లు తెలుస్తోంది. చేతిలోకి తీసుకున్న క్షణంలోనే క్లాసిక్ శామ్‌సంగ్ టచ్ స్పష్టంగా అనిపిస్తుంది. ఫోన్ పై నుండి క్రింది వరకు క్లీన్ డిజైన్, మ్యాట్ బ్యాక్ ఫినిషింగ్‌తో కలిపి, దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది. మీరు రోజంతా మీ చేతిలో పట్టుకున్నప్పటికీ బరువుగా అనిపించదు. ఎందుకంటే ఇది చేతిలో పట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా స్మూత్‌గా డిజైన్ చేశారు. దీనిని రోజువారీ ఉపయోగం కోసం సరైన మోడల్‌గా నిలబెడుతోంది. ఫోన్‌కు ఇచ్చిన ప్రత్యేక స్క్రీన్ ప్రొటెక్టీవ్ లేయర్ కారణంగా, చిన్న గీతలు కూడా ప్రభావం తగ్గించే రక్షణ ఈ మోడల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
120హెచ్‌జెడ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్
డిస్‌ప్లే సెక్షన్‌లో 120హెచ్‌జెడ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్ ఇవ్వడం ద్వారా శామ్‌సంగ్ మరోసారి తన స్కిల్ చూపించింది. రిఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల స్క్రీన్‌పై మూమెంట్స్ క్లారిటీగా కాకుండా.. కలర్స్, వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్‌ను కళ్లకు ఎటువంటి అలసట లేకుండా, ఎంతో హాయిగా మార్చుతాయి. ఈ డిస్‌ప్లే కలర్ డెప్త్, లైటింగ్ కారనంగా కూడా మార్కెట్లో ఉన్న అనేక మోడల్స్ కంటే క్వాటీగా ఉందని రివ్యూల్లో ఇప్పటికే వినిపిస్తోంది. ముఖ్యంగా ఎండలో కూడా వీడియోలు స్పష్టంగా కనిపిస్తాయి, దీంతో ఈఫోన్ యూజర్లకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.
6ఎన్‌ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 6ఎన్‌ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో నిర్మించిన ఈ మోడల్ రోజువారీ పనుల్లో ఎక్కడా లాగ్ లేకుండా స్పందిస్తుంది. అనేక అప్లికేషన్లు ఒకేసారి ఓపెన్ చేసి మార్చుకుంటూ వాడితేనే ఒక ఫోన్ అసలు సామర్థ్యం తెలుస్తుంది. ఆ పరంగా చూసుకుంటే ఈ మోడల్ చాలా స్థిరంగా పనిచేస్తుంది. నేటి యువత సోషల్ మీడియా, రీల్స్, స్టడీ యాప్స్, గేమింగ్, ఇంకా ఆన్‌లైన్ మీటింగ్స్ అన్నీ కలిపి ఒకే డివైస్ ద్వారా నడిచే విధంగా రూపొందించారు.
256జీబి ఆప్షన్లు
మెమరీ వేరియంట్ల విషయంలో 6జీబి ప్లస్ 128జీబి ఇంకా 8జీబి ప్లస్ 256జీబి ఆప్షన్లు అందించడంతో పాటు, ర్యామ్ ప్లస్ సపోర్ట్ కూడా కలిపింది. హెవీ ఫైల్స్, వీడియోలు, ప్రాజెక్టులు నిల్వ చేసినా స్థలం కొరత రాకుండా మైక్రో ఎస్‌డీ ద్వారా 1టిబి వరకూ విస్తరించుకునే అవకాశం ఇవ్వడం, ఈ ఫోన్‌ను విద్యార్థులు, మీడియా విభాగాల్లో పనిచేసేవారికి మంచి ఎంపికగా నిలబెడుతోంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారంగా లాంచ్
సాఫ్ట్‌వేర్ పరంగా శామ్‌సంగ్ ఇచ్చిన నమ్మకం ఈ మోడల్‌లో కూడా కొనసాగుతోంది. 1యుఐ అనుభవం చాలా సహజంగా ఉంటుంది. బటన్లు, మెనూలు, ఏనిమేషన్లు అన్నీ సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి. ఈ మోడల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా లాంచ్ అవుతుండటం, 4 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్లు ఇంకా 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ రక్షణ ఇవ్వబోతున్నట్లు కంపెనీ ప్రకటించడం యూజర్లలో నమ్మకాన్ని మరింత ఇంట్రెస్ట్ పెంచింది. ఫోన్ వాడే కాలం పెరిగే కొద్దీ పనితీరు తగ్గిపోకుండా కంపెనీ దీనిని రూపొందించింది.
సాఫ్ట్ కనెక్టివిటీ అనుభవం
కనెక్టివిటీ విభాగంలో 5జీ సపోర్ట్ తో పాటు డ్యూయల్ సిం, వైఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సి వంటి మోడరన్ స్టాండర్డ్స్ అందుబాటులో ఉండటం వల్ల డేటా ట్రాన్స్‌ఫర్ లో ఆలస్యం లేకుండా స్థిరమైన నెట్‌వర్క్ అనుభవం లభిస్తుంది. ఆడియో విభాగంలో డాల్బీ ఆట్మాస్ చేరడం ద్వారా సంగీతం వినడం, సినిమా చూడటం మరింత క్లారిటీగా అనిపించేలా రూపొందించారు.
డేటా భద్రత పరంగా సేఫ్
భద్రత అంశంలో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ కూడా వేగంగా పనిచేస్తాయి. శామ్‌సంగ్ వాలెట్, సెక్యూర్ ఫోల్డర్, నాక్స్ రక్షణ కలిపి డేటా భద్రత పట్ల ఎలాంటి ఆందోళన లేకుండా చూసుకున్నాయి. ముఖ్యంగా ప్రొఫెషనల్ డేటా సేఫ్టీ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ప్రాధాన్యం మరింతగా పెరుగుతున్నట్లు టెక్ వర్గాలు పేర్కొన్నాయి.
ధర – లాంచింగ్ వివరాలు
భారత మార్కెట్‌లో శామ్‌సంగ్ జనవరి రెండో వారం 2026లో అధికారికంగా విడుదల కానుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లాంచ్ తర్వాత వెంటనే ఆర్డర్ బుకింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే 6జీబి ప్లస్ 128జీబి వేరియంట్ దాదాపు రూ 16,999 ఉంటుందని టెక్ వర్గాల్లో టాక్. అలాగే 8జీబి ప్లస్ 256జీబి వేరియంట్ రూ 19,499 ప్రాంతంలో ఉండవచ్చని సమాచారం. ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆన్‌లైన్ స్టోర్స్‌తో పాటు శామ్‌సంగ్ అధికారిక స్టోర్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.