E-Paper
Advertisement

Samantha -Raj : వామ్మో..సమంత వెడ్డింగ్ రింగ్ ధర అన్ని కోట్లా..? ప్రత్యేకత ఏంటంటే..?

Samantha -Raj  : వామ్మో..సమంత వెడ్డింగ్ రింగ్ ధర అన్ని కోట్లా..? ప్రత్యేకత ఏంటంటే..?
Advertisement

Samantha -Raj : టాలీవుడ్ హీరోయిన్ సమంత రీసెంట్గా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్‌లో లింగభైరవ ఆలయంలో సోమవారం ఉదయం వీళ్లిద్దరు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు.. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు, అత్యంత సన్నిహితులు ఈ పెళ్లికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. పెళ్లికన్నా ముందు సమంత – రాజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి సంగతి తెలిసిందే.. ఆ ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అందులో సామ్ ఎంగేజ్మెంట్ రింగ్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ రింగ్ ప్రత్యేకత, ధర ఎన్ని కోట్లో ఒకసారి తెలుసుకుందాం..

సామ్ వెడ్డింగ్ రింగ్ ధర ఎన్ని కోట్లంటే..?

హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరు నిన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి జరగడానికి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పింక్ డ్రెస్సులో ఉన్న ఆ ఫోటోలో ఆమె ఉంగరపు వేలికి అదే ఉంగరం ఉంది.. అయితే వీరి ఎంగేజ్మెంట్ కూడా అప్పుడే అయి ఉంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఆ రింగు ప్రత్యేకతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ రింగ్ ధర దాదాపుగా 2 కోట్లు ఉంటుందని ప్రముఖ జువెలరీ ఎక్స్పర్ట్ ప్రియాంష్ తెలిపారు. రింగు మధ్యలో ఉన్న రెండు క్యారెట్ల డైమండ్ చుట్టూ 8 పోర్టయిట్ కట్ పెటల్ డైమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన డిజైన్ ఉన్న రింగుని కొంతమంది నిపుణులు మాత్రమే తయారు చేస్తారని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రింగు ఖరీదును విన్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Advertisement

Also Read :సంజనతో ఇమ్మానుయేల్ పోటీ.. పంతం నీదా, నాదా..ఫైనలిస్ట్ లోకి వెళ్ళేది ఎవరు..?

అప్పుడే హింట్ ఇచ్చారా..? 

సమంత, నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని రకాల కారణాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. అయితే ఆ పెళ్లి సమయంలో ఉంగరాన్ని సమంత తన దగ్గరే ఉంచుకుంది. పెళ్లి డ్రెస్ ని కూడా ఆమె దగ్గరే ఉంచుకుంది.. ఆ తర్వాత సమంత నాగచైతన్య ఇద్దరు కెరియర్ పై ఫోకస్ పెట్టారు. సమంతకు మయూసైటిస్ అనే అరుదైన వ్యాధి రావడంతో ఆమె సినిమాలకు దూరమయ్యారు. అయితే గత ఏడాది నాగచైతన్య హీరోయిన్ శోభితాను పెళ్లి చేసుకున్నారు.. సమంత మాత్రం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉండేది.. ఆమె కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసింది. అయితే ఆమె చేసిన వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీరిద్దరూ ఎక్కడ స్పందించలేదు కానీ వీరిద్దరి ఫోటోలు మాత్రం నిత్యం వైరల్ అయ్యాయి.. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. సమంత అప్పుడే రింగు ఫోటోని షేర్ చేసి ఇంటి ఇచ్చింది కానీ దాన్ని ఎవరు పెద్దగా కనుక్కోలేక పోయారు.. ఇక నిన్న సడన్గా ఇద్దరు పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక సమంత పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా? నిర్మాతగా బిజీ అవుతుందా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×