E-Paper
Advertisement

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!
Advertisement

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ప్రపంచ వ్యాప్తంగా ఆన్​లైన్ సేల్ మార్కెట్​లో స్మార్ట్ ఫోన్లకు ఉండే గిరాకీ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారత మార్కెట్లో మరింత డిమాండ్ ఎక్కువ. అందుకే ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను విడుదల చేసి వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. అయితే వీటిలో శాంసంగ్​ డివైజ్​లకు ప్రత్యేక ఫ్యాన్​ బేస్​ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఎందుకంటే ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఆకర్షణీయమైన డిజైన్‌తో సూపర్ ఫీచర్స్​తో తమ లేటెస్ట్​ స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేస్తుంటుంది. అలా ఇప్పుడు రీసెంట్​గా విడుదలైన శాంసంగ్​ గెలాక్సీ ఎస్ ​24 ఎఫ్​ఈకు మార్కెట్​లో మంచి డిమాండ్ ​ ఉంది. అయితే అంతకుముందే గతేడాది శాంసంగ్​ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ లాంఛ్​ అయింది. దీంతో చాలా మంది ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్​? అని శాంసంగ్ ప్రియులు, వినియోగదారుల్లో చిన్న గందరగోళం​ నెలకొంది. అందుకే మన కథనంలో ఈ స్మార్ట్ ఫోన్లను కంపేర్ చేసి, ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఎందులో ఎక్కువ ఉన్నాయి? వంటి వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం. తద్వారా ఏది కొనాలో ఎంచక్కా ఓ స్పష్టతకు రావొచ్చు.

Advertisement

ALSO READ : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Samsung Galaxy S 24 FE VS Samsung Galaxy S 23 FE

Advertisement

డిస్​ప్లే, డివైస్​ ఎలా ఉందంటే? – మొదటగా ఈ రెండు స్మార్ట్​ ఫోన్ల డిజైన్​, డిస్ ప్లే గురించి తెలుసుకుందాం. శాంసంగ్​ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్​ఈ, గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ గ్లాస్ రియర్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్​ డిజైన్​తో వచ్చాయి. అయితే గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ బాక్సీ డిజైన్, కర్వ్డ్ ఎడ్జెస్​తో ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్ 24లాగా ఉంటుంది. ఇక ఈ రెండు స్మార్ట్​ ఫోన్లు ఐపీ 68 రేటింగ్​ను కలిగి ఉన్నాయి.

గెలాక్సీ ఎస్ 24 ఎఫ్​ఈ 6.69 అంగుళాల​ డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్​ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో వచ్చింది. ఇక గతేడాది విడుదలైన గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ 6.4 అంగుళాల​ డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్​ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో వచ్చింది.

కెమెరా ఫీచర్స్ ఇవే​ – Galaxy S 24 FE, Galaxy S 23 FE.. రెండు కూడా ట్రిపుల్ కెమెరా సెటప్​తో లాంఛ్ అయ్యాయి. కెమెరా మంచి క్వాలిటీతో పని చేస్తుంది. వీటిలో వెనకవైపు 50 మెగా పిక్సెల్ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో మెయిన్ కెమెరా ఉంది. 8 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండటం విశేషం. 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా కూడా ఇచ్చారు. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ రెండు స్మార్ట్ ​ఫోన్స్​ 10 మెగా పిక్సెల్ పంచ్ ​హోల్​ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

బ్యాటరీ, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? ​- బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈలో 4,700 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండగా, ఎస్ ​23 ఎఫ్​ఈలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ 25 వాట్ ఛార్జ్​ను సపోర్ట్ చేస్తాయి.

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల పనితీరును, స్పెసిఫికేషన్లను పోల్చినప్పుడు గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈలో 8 GB ర్యామ్, 256 GB వరకు స్టోరేజ్​ ఉంది. అలానే ఎక్సినోస్ 2400ఈ ఎస్ఓసీ ఉంది. బెస్ట్ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్​ కోసం ఎక్స్​క్లిప్స్​ 940 GPUను ఇచ్చారు. గెలాక్సీ ఎస్ 23 ఎఫ్​ఈ 8 GB ర్యామ్ – 256 GB స్టోరేజ్​తో పని చేస్తుంది. ఎక్సినోస్ 2200 ఎస్ఓసితో పాటు ఎక్స్​క్లిప్స్​ 920 జీపీయూను అమర్చారు.

ధర ఎంత ఉందంటే? – శాంసంగ్ Galaxy S 24 FE 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.59,999గా ఉంది. శాంసంగ్ Galaxy S 23 FE ప్రారంభ ధర రూ.54,999గా నిర్ణయించారు. మొత్తానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మంచిగా పని చేస్తాయని చెప్పొచ్చు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×