Samsung Galaxy S24 Ultra 5G: తక్కువ ధరకే ప్రత్యేక ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రత్యేక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ మీద ఏకంగా రూ.45 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు ఆల్-రౌండర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఇంత కంటే మంచి అవకాశం రాదు. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ఆఫర్ల మీద ఓ లుక్కేద్దాం రండి..
ఈ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G మొబైల్ రూ.1,34,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం దీని ధర శాంసంగ్ స్టోర్‌లలో సుమారు రూ.1,09,999. ఈ ఫోన్ 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్, డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది.
Also Read: ఏందిరా నాయనా ఇది కలా నిజమా.. ఐఫోన్ 16 ప్రోపై రూ.14వేలు తగ్గించేశారు!
ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్డ్ ద్వారా కేవలం రూ.89,997 ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని మీరు పొందవచ్చు. అంటే.. ఫోన్ లాంచ్ ధర నుండి రూ.45,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందచ్చు. అలాగే ఈ ఫోన్ మీద సంస్థ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ వెసులుబాటు ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్‌బీఐ కార్డులను ఉపయోగించి రూ.4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ధర కేవలం రూ.85,997 మాత్రమే.
ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.8-అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. దీనిలో ఆండ్రినో 750 GPU కూడా ఉండటం వలన గేమింగ్, భారీ టాస్క్‌ల సమయంలోనూ ఈ ఫోన్ మృదువైన పనితీరును అందిస్తుంది.
Also Read: అత్యుత్తమ బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మీ నార్జో 5G స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.10999 మాత్రమే!