E-Paper
Advertisement

Bigg Boss 9 Promo : గట్టిగా తోస్తే అక్కడ ఉంటావు, తనుజ కి ఇచ్చి పడేసిన పవన్

Bigg Boss 9 Promo : గట్టిగా తోస్తే అక్కడ ఉంటావు, తనుజ కి ఇచ్చి పడేసిన పవన్
Advertisement

Bigg Boss 9 Promo : తెలుగు బిగ్ బాస్ సీజన్9, 12 వారాలు పూర్తిచేసుకుని 13వ వారంలోకి ఎంటర్ అయిపోయింది. అయితే ఈ సీజన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మొదలైన ఈ సీజన్ కొన్నిచోట్ల అలానే అనిపించింది. కానీ మరి కొన్నిచోట్ల అసలు ఏముంది రొటీన్ గేమ్స్ తప్ప, ఒకరికి సపోర్ట్ చేయడం తప్ప ఏమీ ఆసక్తిగా లేదు అని కూడా అనిపించింది.

మొత్తానికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ తనుజాకి సపోర్ట్ చేస్తుంది అని విపరీతమైన కామెంట్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సపోర్ట్ కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసమే ఇమ్మానుయేల్ మరియు తనుజను వాడుకున్నారు అని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు కళ్యాణ్ ను విన్నర్ చేయటానికి బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తుంది అని కొంతమంది వాదన.

గట్టిగా తోస్తే అక్కడ ఉంటావు

Advertisement

ఫైనలిస్ట్ అవ్వడానికి హౌస్ లో ఒక టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ తనుజ, పవన్, భరణి మధ్య జరిగింది. వీళ్ళు ముగ్గురికి కొన్ని రకాల ఫ్లవర్స్ కేటాయించారు. అయితే ఎవరికి కేటాయించిన వాళ్ళ కలర్ ఫ్లవర్స్ ను వెళ్లి మట్టికుండలో పాతాలి. అయితే ఇంకొకరు వాళ్ళ ఫ్లవర్స్ను పాత కుండా ఆపొచ్చు.

మొత్తానికి ఈ టాస్క్ జరుగుతున్న టైంలో ఒకరి మీద ఒకరు తోసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రోమోలో కూడా అది బాగా హైలైట్ అయింది. ముఖ్యంగా పవన్ తనుజను తోస్తున్నట్లు కనిపిస్తుంది. అలానే భరణి మరియు తనుజను పవన్ ఒక్కడే ఆపాడు.

Advertisement

అయితే ఎందుకురా తోస్తున్నావు అసలు ఏమైంది అంటూ తనుజ అరవడం మొదలుపెట్టింది. నేను గట్టిగా చూస్తే నువ్వు అక్కడ ఉంటావు అంటూ రివర్స్ అటాక్ చేశాడు పవన్. మొత్తానికి ఈ టాస్క్ కొద్దిపాటి ఆసక్తిని కలిగించింది. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుంది అని ఈ టాస్క్ చూస్తే అర్థమవుతుంది.

ఫైనల్ లో ఎవరు చేరుతారు 

అయితే ఈ టాస్క్ చూసిన తర్వాత ఫైనలిస్ట్ ఎవరు అవుతారు అనే ఆసక్తి అందరికీ నెలకొంది. మొత్తానికి టాప్ ఫైవ్ లో ఉండబోయే వాళ్ళ పేర్లలో తనూజ, ఇమాన్యుల్, కళ్యాణ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే చదరంగం కాదు రణరంగం కాబట్టి మధ్యలో ఏమైనా బిగ్ బాస్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.

బిగ్బాస్ సీజన్ మొదలైనప్పుడు కొంతమందికి ఫేవరెట్ అనుకున్న కంటెస్టెంట్ ల మీద ఒపీనియన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సుమన్ శెట్టి మీద ఒకప్పుడు చాలామందికి విపరీతమైన ప్రేమ ఉండేది. అది ఇప్పుడు కొద్దిగా తగ్గింది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు కళ్యాణ్ టైటిల్ కొట్టబోతున్నాడు అని ఆల్రెడీ పాజిటివ్ పోస్టులు కూడా స్టార్ట్ అయిపోయాయి.

Also Read: The Goat Movie: హీరో సుధీర్‌పై కేసు పెట్టాం.. గోట్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×