E-Paper
Advertisement

Samsung Galaxy S26+: శాంసంగ్ నుంచి నెక్ట్స్ లెవల్ ఫోన్ ‘గెలాక్సీ S26 ప్లస్’ వచ్చేస్తోంది.. ఐఫోన్‌కు చెక్ పెట్టడం ఖాయమా?

Samsung Galaxy S26+: శాంసంగ్ నుంచి నెక్ట్స్ లెవల్ ఫోన్ ‘గెలాక్సీ S26 ప్లస్’ వచ్చేస్తోంది.. ఐఫోన్‌కు చెక్ పెట్టడం ఖాయమా?
Advertisement

Samsung Galaxy S26+: శాంసంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘Samsung Galaxy S26’ సిరీస్ ఫిబ్రవరిలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో Galaxy S26, S26+, Ultra మోడల్స్ రానున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అధికారికంగా లాంచ్ కాకముందే Galaxy S26+ గీక్‌బెంచ్ వెబ్‌సైట్లో ప్రత్యక్షమై సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వెలువడ్డ లీక్స్ ఆధారంగా ఈ ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కద్దాం రండి..

సరికొత్త ఎగ్జినోస్ చిప్‌సెట్..

ఈసారి శాంసంగ్ తను సొంతంగా తయారు చేసిన ఎగ్జినోస్ 2600 చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో అమర్చనుంది. ఇది అత్యాధునిక 2nm GAA ప్రాసెస్‌పై రూపొందించబడింది. సాధారణంగా ప్రాసెస్ సైజ్ తగ్గేకొద్దీ ఫోన్ వేగం పెరగడమే కాకుండా బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది. ఆక్టా‌కోర్ సామర్థ్యంతో వస్తున్న ఈ చిప్‌సెట్‌లో ప్రధాన కోర్ 3.80GHz స్పీడ్‌తో పనిచేస్తుంది. దీంతో గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసే యూజర్లకు ఈ ఫోన్ మెరుగైన పనితీరును అందిస్తుంది.

Advertisement

Also Read: ఈ ఒక్క ట్రిక్ వాడితే.. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 10పై రూ.12వేల డిస్కౌంట్ పక్కా!

గేమ్ లవర్స్‌కు పండగే:

విజువల్స్, గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్‌లో Xclipse 960 GPUని అమర్చారు. ఇది హైఎండ్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్స్ ఆడేవారికి మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇకపోతే మెమరీ పరంగా చూసుకుంటే.. గీక్‌బెంచ్ డేటా ప్రకారం దీనిలో 10.64GB RAM ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మార్కెట్లోకి వచ్చేసరికి దీనిని 12GB RAM వేరియంట్‌గా శాంసంగ్ ప్రమోట్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ సాఫ్ట్‌వేర్:

Advertisement

గెలాక్సీ S26+ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతోంది. దీంతోపాటు శాంసంగ్ సొంత లేయర్ One UI 8.5 జత కానుంది. ఈ కాంబినేషన్ వల్ల యూజర్ ఇంటర్‌ఫేస్ ముందు కంటే చాలా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ఫీచర్లు, మెరుగైన సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు సరికొత్త స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా శాంసంగ్ ఈ మార్పులు చేస్తోంది.

గీక్‌బెంచ్ స్కోర్లు ఏం చెబుతున్నాయంటే?

గీక్‌బెంచ్ 6.5.0 టెస్టులో Samsung Galaxy S26+ ఫోన్ 24,964 పాయింట్ల స్కోరును దక్కించుకుంది. దీంతో శాంసంగ్ తన పాత మోడల్స్ కంటే పర్ఫార్మెన్స్ పరంగా గణనీయమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేవలం నెంబర్లు మాత్రమే కాకుండా.. వాస్తవ వినియోగంలో కూడా ఈ ఫోన్ రికార్డు స్థాయి వేగాన్ని చూపిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: మార్కెట్లోకి Poco X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×