E-Paper
Advertisement

ఎలక్ట్రీషియన్ అవసరం లేదు.. ఇంట్లోనే ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయండిలా !

ఎలక్ట్రీషియన్ అవసరం లేదు.. ఇంట్లోనే ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయండిలా !

How to clean AC filter at home: ఎండలు మండిపోతున్నప్పుడు ఏసీ ఆన్ చేస్తే.. చల్లటి గాలి రాకపోతే ఎంత చిరాగ్గా ఉంటుందో కదా.. చాలా మంది ఏసీ కూలింగ్ తగ్గగానే గ్యాస్ అయిపోయిందేమో అని కంగారు పడి మెకానిక్‌ని పిలుస్తారు. కానీ.. 90% ఇళ్లలో ఏసీ కూలింగ్ తగ్గడానికి అసలు కారణం ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోవడమే. ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా.. క్లీన్ చేయకపోతే గాలి సరిగ్గా రాదు. పైగా కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే రూపాయి ఖర్చు లేకుండా.. మీ ఇంట్లోనే కేవలం 5 మార్గాల్లో ఏసీ ఫిల్టర్‌ను క్లీన్ చేసి, కూలింగ్‌ను ఇన్‌స్టంట్‌గా ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయడానికి 5 సులువైన మార్గాలు :

1. పవర్ ఆఫ్ చేసి, ఫ్రంట్ ప్యానెల్  :
ఏసీ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన అతి విషయం సేఫ్టీ. ముందుగా ఏసీకి సంబంధించిన మెయిన్ పవర్ స్విచ్ లేదా ఎంసిబిని పూర్తిగా ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఏసీ ఇండోర్ యూనిట్ కి ఇరు వైపులా ఉన్న లాక్స్‌ని పట్టుకుని పైకి లాగితే ఫ్రంట్ ప్యానెల్ సులభంగా తెరుచుకుంటుంది. లోపల మీకు నెట్ లాంటి మెష్ స్ట్రక్చర్‌తో రెండు ఫిల్టర్లు కనిపిస్తాయి. వాటిని చాలా జాగ్రత్తగా.. కిందకి లేదా పైకి స్లైడ్ చేస్తూ బయటకు తీయాలి. ఈ సమయంలో ఫిల్టర్లపై ఉన్న దుమ్ము గదిలో పడకుండా నెమ్మదిగా హ్యాండిల్ చేయడం మంచిది.

2. నార్మల్ వాటర్ వాష్ ట్రిక్:
సన్నటి దుమ్ము మాత్రమే ఉంటే.. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ బాత్రూమ్ లేదా సింక్ వద్దకు వెళ్లి నార్మల్ రన్నింగ్ వాటర్ కింద ఫిల్టర్లను ఉంచాలి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే.. నీటి ధారను ఫిల్టర్ ముందు భాగం నుంచి కాకుండా.. వెనక వైపు నుంచి వేయాలి. ఇలా చేయడం వల్ల ఫిల్టర్ రంధ్రాలలో.. ఇరుక్కుపోయిన దుమ్ము చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఫిల్టర్లు దెబ్బతినే.. అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి గట్టి బ్రష్‌లు లేదా స్క్రబ్బర్లు వాడకూడదు.

3. డిష్ వాషింగ్ లిక్విడ్ లేదా షాంపూ వాష్ :
కొన్ని సార్లు కిచెన్‌కి దగ్గరగా ఉన్న రూమ్స్ లోని ఏసీ ఫిల్టర్లకు కేవలం దుమ్ము మాత్రమే కాకుండా.. జిడ్డు లేదా మురికి కూడా పడుతుంది. అలాంటి జిడ్డు కేవలం నీటితో వదిలిపోదు. దీని కోసం ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ లేదా మైల్డ్ షాంపూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఏసీ ఫిల్టర్లను ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక మెత్తటి క్లాత్ తో లేదా మీ చేతి వేళ్లతో సాఫ్ట్‌గా రుద్దితే జిడ్డు, మురికి మొత్తం వదిలిపోయి ఫిల్టర్లు సరికొత్తగా మారిపోతాయి.

4. వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించడం:
మీకు ఫిల్టర్లను నీటితో తడపడం ఇష్టం లేకపోతే.. లేదా ఏసీ ఇండోర్ యూనిట్ చుట్టూ వాటర్ పడకూడదు అనుకుంటే.. వాక్యూమ్ క్లీనర్ బెస్ట్ ఆప్షన్. మీ ఇంట్లో ఉండే వాక్యూమ్ క్లీనర్‌కు సాఫ్ట్ బ్రష్ అటాచ్‌మెంట్ తగిలించి..లో పవర్ మోడ్‌లో ఫిల్టర్లపై ఉన్న దుమ్మును క్లీన్ చేయవచ్చు. ఈ పద్ధతిలో కేవలం రెండు నిమిషాల్లోనే.. పని అయిపోతుంది. అయితే.. వాక్యూమ్ క్లీనర్ ప్రెజర్ ఎక్కువగా ఉంటే ఫిల్టర్ నెట్ చిరిగిపోయే.. ప్రమాదం ఉంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి.

5. పర్ఫెక్ట్ డ్రైయింగ్, రీ-ఇన్‌స్టాలేషన్:
ఫిల్టర్లను వాష్ చేసిన తర్వాత చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. వాటిని వెంటనే.. తీసుకెళ్లి ఎండలో ఆరబెట్టడం. డైరెక్ట్ ఎండ తగలితే.. ప్లాస్టిక్ లేదా నైలాన్‌తో తయారయ్యే ఈ ఫిల్టర్లు వంగిపోతాయి లేదా పాడైపోతాయి. అందుకే వాటిని ఇంట్లోనే ఫ్యాన్ కింద లేదా నీడలో పూర్తిగా ఆరనివ్వాలి. ఫిల్టర్లపై ఒక్క నీటి చుక్క కూడా లేకుండా పూర్తిగా డ్రై అయిన తర్వాతే.. వాటిని మళ్లీ ఏసీ ఇండోర్ యూనిట్‌లో మునుపటిలాగే జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత ఫ్రంట్ ప్యానెల్ మూసేసి.. ఏసీ ఆన్ చేసుకుంటే చాలు.

ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో.. అయి ఫిల్టర్ క్లీన్ చేసిన వెంటనే.. మీ ఏసీ ఎయిర్ ఫ్లో విపరీతంగా పెరుగుతుంది. ఏసీ మోటార్‌పై లోడ్ తగ్గడం. వల్ల గది కేవలం 5 నిమిషాల్లోనే.. ఐస్‌లా చల్ల బడిపోతుంది. అలాగే మీ నెల వారీ కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గుతుంది. ఎండా కాలంలో ఏసీని ఎక్కువగా వాడతాం కాబట్టి.. ప్రతి 15 రోజులకు ఒక సారి ఈ విధంగా హోమ్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఏసీ లైఫ్ పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మీ ఏసీ ఫిల్టర్ చెక్ చేసి ఈ టిప్స్ ట్రై చేయండి.

Related News

పాత ఫ్యాన్ మార్చే టైమ్ వచ్చేసింది! కరెంట్ బిల్లును 65% తగ్గించే ఫ్యాన్స్!

కరెంట్ బిల్లు తక్కువ.. కూలింగ్ ఎక్కువ! బెడ్‌రూమ్‌ని కాశ్మీర్ చేసే లేటెస్ట్ ఏసీలు!

మిక్సీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫాస్ట్ మోడల్స్ పై ఓ లుక్కేయండి!

రూ.8,999 నుంచే స్మార్ట్‌‌ఫోన్లు.. Amazon Saleలో ఏఐ ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్లు!

యూజర్లకు షాకిచ్చిన షియోమీ.. భారత్‌లో పెరిగిన Xiaomi Pad 8 ధరలు, కొత్త రేట్లు ఇవే!

బస్ స్టాప్‌లలో ఇక ఏసీ ఫీలింగ్.. సరికొత్త టెర్రాకోట టెక్నాలజీ వచ్చిందోచ్!

డేగ కళ్లతో రక్షణ కల్పించే AI కెమెరాలు.. మనుషులు, వాహనాలను ఇట్టే గుర్తించే స్మార్ట్ టెక్నాలజీ!

Big Stories

×