E-Paper
Advertisement

జాన్వీ కపూర్‌కు మద్దతుగా ఆషికా రంగనాథ్.. ‘సినిమా వ్యవస్థను నిందించండి’

జాన్వీ కపూర్‌కు మద్దతుగా ఆషికా రంగనాథ్.. ‘సినిమా వ్యవస్థను నిందించండి’
Advertisement

Peddi controversy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో జూన్ 4న విడుదలైన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ చిత్రంలో కథానాయిక జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టర్‌ను మితిమీరిన గ్లామరైజేషన్ చేయడం, ఆమె శరీర భాగాలపై అనవసరమైన క్లోజప్ షాట్స్ పెట్టడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే కేవలం డబ్బు కోసమే జాన్వీ ఇలాంటి పాత్రలను ఒప్పుకుందంటూ నేరుగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

Read also-బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ.236 కోట్లకు పైగా వసూళ్లు!

Advertisement

ఈ నేపథ్యంలో, కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక సుదీర్ఘమైన, ఘాటైన పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ తప్పులో హీరోయిన్ల పాత్ర ఏమీ ఉండదని, ఇందుకు సినిమా వ్యవస్థే కారణమని ఆమె స్పష్టం చేశారు.

మేకర్స్‌దే తప్పు, నటీమణులది కాదు: “ఈ విషయంలో దయచేసి నటీమణిని నిందించడం ఆపండి. తప్పు ఆమెది కాదు, ఈ సినిమా వ్యవస్థది. ఇప్పటికీ ఇలాంటివి చూపిస్తేనే సినిమాలు అమ్ముడుపోతాయని మరియు ప్రేక్షకులు చూస్తారని నమ్ముతున్న మేకర్స్ (దర్శక, నిర్మాతలు, రచయితలు) దే అసలు తప్పు.” అని ఆషికా అభిప్రాయపడ్డారు.

Advertisement

అవకాశాల పరిమితి: నటీమణులు ఎప్పుడూ తమకు లభించే అవకాశాల పరిధిలోనే పని చేస్తారని ఆమె గుర్తు చేశారు. పెద్ద సినిమాల్లో భాగం కావడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలని, మార్కెట్‌లో తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారని, అది వారి కెరీర్ స్ట్రాటజీలో భాగమని పేర్కొన్నారు.

రైటింగ్ మరియు మేకింగ్ ఛాయిస్: కమర్షియల్ సినిమాల్లో కేవలం హీరోల ఎలివేషన్ కోసం, గ్లామర్ యాడ్ చేయడం కోసమే హీరోయిన్ పాత్రలను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ సినిమాలో మహిళా పాత్రలను సరిగ్గా రాయకపోతే లేదా తప్పుగా ప్రెజెంట్ చేస్తే, ఆ బాధ్యత పూర్తిగా స్క్రిప్ట్ రాసే రైటర్స్, సినిమా తీసే దర్శకులదే తప్ప, ఆ పాత్రల్లో నటించిన మహిళలది కాదని ఆషికా స్పష్టం చేశారు. గ్లామర్ అంటే స్త్రీ సౌందర్యాన్ని అత్యంత హుందాగా, గౌరవప్రదంగా చూపించడమే తప్ప వల్గారిటీ (అశ్లీలత) కాదని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మద్దతుగా నిలుస్తున్న ఇతర నటీమణులు:
ఈ వివాదంలో కేవలం ఆషికా రంగనాథ్ మాత్రమే కాకుండా, టాలీవుడ్ నటి డింపుల్ హయాతి కూడా జాన్వీకి మద్దతుగా నిలిచారు. హీరోయిన్ల పాత్రలు రాయబడుతున్న విధానంపై ఇండస్ట్రీలో చర్చ జరగడం మంచిదేనని, పాత్ర డిజైనింగ్ లో లోపాలు ఉంటే నటీమణులను బ్లేమ్ చేయడం సరికాదని ఆమె కూడా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Read also-Lakshmi Rai : అబ్బా.. చీరలో వయ్యారాలను వలకబోస్తున్న లక్ష్మీ రాయ్..

దర్శకుడి క్షమాపణ – సీన్ల ఎడిటింగ్

‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్, జాన్వీ కపూర్ అనుమతి లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకునే సన్నివేశం కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. నెటిజన్లు దీనిని ‘అసాల్ట్’ (దాడి) గా అభివర్ణిస్తూ విమర్శించడంతో, దర్శకుడు బుచ్చిబాబు సన అధికారిక క్షమాపణలు చెప్పారు. సినిమా ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని, ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ వివాదాస్పద సన్నివేశాలను ఎడిట్ (మార్పులు) చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు, జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మంచుందా కూడా స్పందిస్తూ, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఈ షాట్స్‌పై జాన్వీ స్వయంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, అయితే దర్శకుడు ఆమె హద్దులను గౌరవించకుండా ఫైనల్ కట్‌లో అలాగే ఉంచేశారని సంచలన నిజాలు బయటపెట్టారు. ఈ వివాదాల మధ్యనే శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రల్లో నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 190 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది.

Related News

యష్ ‘టాక్సిక్’ షాకింగ్ అప్‌డేట్..వీళ్ళు మాత్రం థియేటర్లకి రాకండి!

బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజి వైద్యబృందం!

చేతికి కట్టుతో కనిపించిన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్!

ఏంటీ..ఒడిస్సీ కి ఇండియాలో వంద కోట్లా ?

కొత్త ప్రాజెక్టుతో కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే?

గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న రవితేజ వారసుడు.. తొలి సినిమా రిలీజ్ డేట్ లాక్!

“నా గురువే నా రైడర్”.. కీరవాణితో రాహుల్ సిప్లిగంజ్ ‘ఫుల్ సర్కిల్’ మోమెంట్!

బాలయ్య బాబు హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. క్లారిటీ వచ్చేసింది!

Big Stories

Advertisement
×