E-Paper
Advertisement

Smart Watch:- మానసిక వ్యాధిని పసిగట్టే స్మార్ట్ వాచ్..

Smart Watch:- మానసిక వ్యాధిని పసిగట్టే స్మార్ట్ వాచ్..
Advertisement

Smart Watch:- ఇప్పటికే మనం రోజూ ఉపయోగించే ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఆరోగ్యంలో వచ్చే మార్పులను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంటాయి. మన జేబులో ఉండే స్మార్ట్ ఫోన్, చేతికి ఉండే స్మార్ట్ వాచ్.. ఇలా అన్ని పరికరాలు ఎప్పటికప్పుడు మన ఆరోగ్యంతో పాటు గుండె చప్పుడులో, పల్స్ రేటులో వచ్చే మార్పులను కనిపెడుతూనే ఉంటాయి. తాజాగా మానసిక సమస్యను కూడా ఈ స్మార్ట్ వాచ్‌లు కనిపెట్టగలుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

పార్కిన్సన్స్ అనేది ఒక భయంకరమైన మానసిక సమస్యగా వ్యాప్తి చెందుతోంది. దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ లేకపోవడం బాధాకరం. అంతే కాకుండా పార్కిన్సన్స్‌ను ముందుగానే గుర్తించే మార్గాలు కూడా లేవు. అందుకే శాస్త్రవేత్తలు ఈ మానసిక సమస్య గురించి వీలైనంత తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా స్మార్ట్ వాచ్‌తో పార్కిన్సన్స్ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చని వారు చెప్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి మరెన్నో టెక్నాలజీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని వారు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

ముందుగా ఒక ఆరోగ్య సమస్య అనేది ఎలా మొదలవుతుందో తెలిస్తే.. దానికి చికిత్స కూడా అంతే మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలను కనుక్కునే పనిలోపడ్డారు. మరోవైపు స్టార్టింగ్ స్టేజ్‌లోనే పార్కిన్సన్స్‌ను కనిపెడితే ఆ తర్వాత జరిగే పరిణామాల నుండి పేషెంట్లను కాపాడవచ్చు అనే ఉద్దేశ్యంతో కూడా వారు ముందుకెళ్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ టెక్నాలజీ దానికి ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ అనేది వేగంగా పెరుగుతున్న మెదడు వ్యాధిగా స్టడీలో తేలింది. గత దశాబ్దంతో ఈ వ్యాధిని ట్రీట్ చేయడం కోసం ఎన్నో చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అవేవి అంత మెరుగ్గా పేషెంట్లను ట్రీట్ చేయలేకపోతున్నాయి. అంతే కాకుండా ఈ వ్యాధి అందరు పేషెంట్లపై ఒకేలాగా ప్రభావం చూపించకపోవడం కూడా శాస్త్రవేత్తలకు ఇబ్బందిగా మారింది. దీంతో పాటు ఈ వ్యాధిని కనిపెట్టడం కోసం తయారైన టూల్స్ కూడా ఔట్‌డేటెడ్ అయిపోయాయి. అందుకే రోజువారీ జీవితాల్లో మనుషులు ఉపయోగించే స్మార్ట్ వాచ్‌తోనే దీనిని కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

2015లో పలువురు శాస్త్రవేత్తలు కలిసి పార్కిన్సన్‌ను కనిపెట్టడం కోసం ఒక కొత్త యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. అదే ఎమ్‌పవర్. ఇది పార్కిన్సన్స్ సోకిన పేషెంట్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో కరెక్ట్‌గా కనిపెడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాప్ లాంచ్ తర్వాత స్మార్ట్ వాచ్ టెక్నాలజీపై వారు దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్‌పై పరిశోధనలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. కానీ ఇది పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×