
Viveka second wife: వైఎస్ వివేకానందరెడ్డికి పెళ్లైంది. కూతురు ఉంది. ఆ కూతురుకు కూడా పిల్లలు ఉన్నారు. అలాంటి లేటు వయసులో లేటెస్ట్‌గా షమీమ్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు వివేకా. ఆ తర్వాత ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓ పిల్లాడినీ కన్నాడు. చాన్నాళ్లూ గప్‌చుప్‌గా సాగింది యవ్వారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్థానికులకు మాత్రమే తెలుసు వారి విషయం. వివేకా హత్య కేసు విచారణతో ఆ మేటర్ ఇప్పుడు కలకలంగా మారింది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపణలతో అందరి దృష్టీ వివేకా రెండో భార్యపై పడింది. గతంలోనే ఆమెను ప్రశ్నించింది సీబీఐ. అప్పుడు షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ స్టేట్‌మెంట్లో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వివేకాతో ప్రేమ, పెళ్లి, సంతానం అంశాలతో పాటు వైఎస్ కుటుంబ గొడవలూ వెలుగుచూశాయి. వివేకా చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా తనతో మాట్లాడాడని చెప్పింది షమీమ్. షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్లో ఉన్న వివరాలివే…
వివేకాతో ప్రేమ, పెళ్లి గురించి..
2005లో డాక్టర్ రెడ్డీస్‌లో ఉద్యోగం కోసం షమీమ్‌కు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి. ఉద్యోగానికి సెలక్ట్ కాకపోవడంతో డాక్టర్ రెడ్డీస్ కార్యాలయానికి నేరుగా వెళ్లిన వివేకా.. అక్కడి సిబ్బందితో మాట్లాడి షమీమ్‌కు ఉద్యోగం ఇప్పించారని చెప్పారు షమీమ్. అప్పటి నుంచి తనకు, వివేకాకు మధ్య పరిచయం పెరిగిందని.. తరచూ ఫోన్లలో మాట్లాడుకునేవారమని చెప్పారు. 2007లో తనను పెళ్లి చేసుకుంటానంటూ వివేకా నుంచి ప్రతిపాదన వచ్చిందని.. ఐతే.. మొదట్లో పెళ్లికి తాను అంగీకరించలేదన్నారు షమీమ్. దీంతో తన భార్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని.. తనను పట్టించుకునే వాళ్లు లేరంటూ కన్వీన్స్ చేశారని చెప్పారు. అక్టోబర్ 3, 2010న హైదరాబాద్‌లో తనను పెళ్లి చేసుకున్నారని.. పెళ్లికి ముందు షాపింగ్‌కోసం మూడున్నర లక్షలు తనకు ఇచ్చారన్నారు. పెళ్లి కోసం మహమ్మద్ అక్బర్‌గా ఆయన తన పేరు మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.
ఇంట్లో గొడవల గురించి..
తనను పెళ్లి చేసుకున్న తర్వాత వివేకాకు కలిసి వచ్చిందని చెప్పారు షమీమ్. మంత్రి పదవి రావడంతో అంతా తన వల్లేనని వివేకా చెప్పేవారని.. పెళ్లి తర్వాత షమీమ్ బావ బాషాను వివేకా తన పీఏగా పెట్టుకున్నారని తెలిపారు. పెళ్లి విషయం గన్‌మెన్, డ్రైవర్ ద్వారా తెలుసుకున్న సునీత బావ శివ ప్రకాష్ రెడ్డి.. తనను, తన బావను బెదిరించారన్నారు. వివేకాను వదలకపోతే అంతుచూస్తామని శివప్రకాష్ రెడ్డి బెదిరించారని ఆరోపించారు. షమీమ్‌ను బెదిరించినందుకు శివప్రకాష్‌రెడ్డిని కాలర్ పట్టుకుని వివేకా నిలదీశారని.. మరోసారి షమీమ్ జోలికి వెళ్తే అంతు చూస్తానంటూ శిప్రకాష్ రెడ్డికి వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిపారు. తనతో వివేకాకున్న బంధం గురించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి కూడా తెలుసన్న షమీమ్.. మీడియాతో జాగ్రత్తంటూ రాజశేఖర్‌రెడ్డి చెప్పినట్లు వివేకా తనకు చెప్పారన్నారు.
సీక్రెట్ సంసారం.. ఎడబాటు..
వివేకా ఎంపీగా ఉన్న సమయంలో ఎక్కడున్నా ప్రతీ రోజూ ఫోన్ చేసేవారని.. వైఎస్సార్ చనిపోయాక వద్దన్నా పులివెందులలో విజయమ్మపై వివేకా పోటీ చేశారని చెప్పారు షమీమ్. 2011లో మకాంను వనస్థలిపురానికి మార్చారని.. గన్‌మెన్ లేకుండా తన దగ్గరకు వివేకా ఒక్కరే వచ్చేవారన్నారు. 2013 నుంచి వివేకా కుటుంబ సభ్యుల నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని.. చాలాసార్లు సునీత తనను బెదిరించిందని తెలిపారు. తన దగ్గరకు రాకుండా వివేకాను కట్టడి చేశారని.. ఎడబాటు తట్టుకోలేక వివేకా మద్యానికి బానిసయ్యారని వివరించారు. వైఎస్ జగన్ అరెస్ట్ అయిన తర్వాత మళ్లీ వివేకా తనకు దగ్గరయ్యారని.. తనను బాధపెట్టడం వల్లే తన కుటుంబంలో కష్టాలు వచ్చాయని వివేకా చెప్పారని తెలిపారు. తనను కూడా తన భార్యగానే చూడాలంటూ ఎర్రగంగిరెడ్డి, డాక్టర్ బాద్‌షాకు చెప్పారని.. వివేకా దగ్గర తనకెప్పుడు వయస్సులో తేడా కనిపించలేదన్నారామె.
కొడుకు గురించి..
ఇక 2014లో కూకట్‌పల్లిలో మరో ఇంటికి తను మార్చారని.. ఆగస్టు 28, 2015న షెహన్‌షాకు జన్మనిచ్చానని చెప్పారు షమీమ్. మీడియా భయంతో కొడుకును చూడడానికి వివేకా రాలేదన్నారు. ఇంటికి వెళ్లాక మాత్రం కొడుకును చూసి వివేకా మురిసిపోయారని.. తమ పెళ్లి విషయంలో కుటుంబాన్ని ఒప్పించే బాధ్యత సుధీకర్‌రెడ్డికి వివేకా అప్పగించారని చెప్పారు. ప్రతి నెలా ఇంటి అద్దె కట్టడంతో పాటు తన ఖర్చులకు 30 వేలు వివేకా ఇచ్చేవారని.. 2011లో తనను మరోసారి పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్‌రెడ్డి తనకు వెన్నుపోటు పొడిచారని వివేకా ఆవేదన వ్యక్తం చేశారని.. వీళ్ల చర్యలతో వైఎస్ కుటుంబ పరువు పోతోందని వివేకా బాధపడేవారన్నారు. ఎన్నికల్లో ఓటమితో వివేకా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.
షమీమ్‌కు వివేకా ఇచ్చిన హామీలు..
ఇక సౌభాగ్యమ్మకు రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డికి మధ్య ఆర్థిక తగాదాలు ఉన్నాయని చెప్పారు షమీమ్. తన కొడుకు షెహన్‌షాకు 4 ఎకరాల భూమిని వివేకా ఇస్తానని చెప్పారని.. వివేకా ఇస్తానన్న భూమిలో బైరైటీస్ గనులు ఉండేవన్నారు. ఆ భూమిని సౌభాగ్యమ్మ తన పేరుపైకి రాయించుకున్నారని తెలిపారు. 2018లో వివేకా గుండెకు స్టంట్ వేశారని.. ఆ ఆపరేషన్ తర్వాత తనను మరో పెళ్లి చేసుకోమని చెప్పారన్నారు. మరో వివాహం చేసుకోవడానికి తాను నిరాకరించానని.. రాజకీయాల్లోకి తనను రావాలంటూ వివేకా కోరారని చెప్పారు. బెంగళూరు ల్యాండ్ డీల్ ద్వారా దాదాపు రూ.8 కోట్లు వస్తాయని వివేకా చనిపోవడానికి ముందు చెప్పారని షమీమ్ వెల్లడించారు. ఆ 8 కోట్లతో తనకు కడపలోగానీ, హైదరాబాద్‌లో గానీ ఇల్లు కొనిస్తానని చెప్పారని వివరించారు. కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో పాటు, కొడుకు పేరిట వ్యవసాయ భూమి కొంటానన్నారని.. కొడుకు షెహన్ షాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చేర్చాలనుకున్నారని చెప్పారు.
వివేకాకు సునీత చెక్…
మార్చి 14, 2019 మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు వివేకా చివరిగా తనకు కాల్ చేశారని చెప్పారు షమీమ్. వివేకాను కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టారన్న షమీమ్.. వివేకా చెక్‌పవర్‌ను కుటుంబ సభ్యులు తొలగించారని తెలిపారు. చాలా కంపెనీల నుంచి డైరెక్టర్‌గా వివేకాను సునీత తొలగించారని.. వైఎస్ వివేకా చుట్టూ తన మనుషులనే శివప్రకాష్ రెడ్డి పెట్టారని చెప్పుకొచ్చారు. వారి ద్వారా వివేకా కదలికలను శివప్రకాష్‌రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకునే వారని.. ఎర్ర గంగిరెడ్డి కూడా శివ ప్రకాష్ రెడ్డి మనిషేనని వెల్లడించారు. వైఎస్ వివేకా మరణంతో నష్టపోయింది తానొక్కదాన్నేనని.. తాను, తన కొడుకు అనాథలమైపోయామన్న ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ కోడలిని.. అయినా…
వైఎస్ కుటుంబానికి కోడలినైనా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు షమీమ్. వ్యాపారాల్లో 25 శాతం వాటాను తన సోదరుడికి ఇస్తానని వివేకా హామీ ఇచ్చారని చెప్పారు. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి, శివప్రకాష్ రెడ్డి బాగా క్లోజ్ అయ్యారని.. వాళ్లిద్దరూ ఎందుకు దగ్గరయ్యారో తెలియడం లేదని వివేకా తనతో చెప్పారన్నారు. సౌభాగ్యమ్మ అనారోగ్యంతో చనిపోతే వివేకా రాజకీయ వారసత్వం తనకే వచ్చేదని చెప్పుకొచ్చారు షమీమ్.
ODI World Cup 2023: ఆ ఒక్కటి అధిగమిస్తే కప్పు ఇండియాదే.. రికీ పాంటింగ్ జోస్యం!