E-Paper
Advertisement

Battery Tips: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలా?.. ఈ సెట్టింగ్స్ మారిస్తే సరిపోతుంది..

Battery Tips: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలా?.. ఈ సెట్టింగ్స్ మారిస్తే సరిపోతుంది..
Advertisement

Battery Tips: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. కానీ, ఎంత ఖరీదైన ఫోన్ కొన్నా.. రోజు గడవక ముందే బ్యాటరీ అయిపోవడం చాలా మందిని వేధిస్తున్న సమస్య. పదే పదే ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ లైఫ్ కాలక్రమేణా తగ్గిపోతుంది. అయితే, మీ ఫోన్‌లోని కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా బ్యాటరీని ఎక్కువ సేపు కాపాడుకోవచ్చు. అవేంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Read also-Cooler Tips: కూలర్ మీ ఇంట్లో అక్కడ పెడితే పొరపాటే?.. వాడేటప్పుడు ఈ పనులు అస్సలు చేయకండి..

ఆటో బ్రైట్‌నెస్‌ను ఆఫ్ చేయండి..

Advertisement

ఫోన్ బ్యాటరీని అత్యధికంగా ఖర్చు చేసేది డిస్‌ప్లే మాత్రమే. చాలా మంది ‘Adaptive Brightness’ ఆన్ చేస్తారు, కానీ ఇది సెన్సార్లను నిరంతరం వాడుతూ బ్యాటరీని ఖర్చు చేస్తుంది. బ్రైట్‌నెస్‌ను మాన్యువల్‌గా మీకు కావాల్సిన స్థాయిలో ఉంచుకుంటే సెన్సార్ల వాడకం తగ్గి బ్యాటరీలో చార్జింగ్ ఆదా అవుతుంది.

డార్క్ మోడ్ ఆన్ చేయండి..

మీ ఫోన్ లో AMOLED లేదా OLED స్క్రీన్ ఉంటే, వెంటనే ‘Dark Mode’ ఆన్ చేసుకోండి. ఈ స్క్రీన్లలో నలుపు రంగు ఉన్న చోట పిక్సెల్స్ పూర్తిగా ఆరిపోతాయి. దీనివల్ల దాదాపు 30% వరకు బ్యాటరీ ఆదా అవుతుంది.

స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తగ్గించండి

Advertisement

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లు 90Hz లేదా 120Hz రిఫ్రెష్ (Refresh Rate) రేట్‌తో వస్తున్నాయి. ఇది ఫోన్ వాడేటప్పుడు స్మూత్‌గా అనిపించినా, బ్యాటరీని విపరీతంగా తాగుతుంది. అలాంటప్పుడు.. సెట్టింగ్స్‌లో డిస్‌ప్లే విభాగంలోకి వెళ్లి రిఫ్రెష్ రేట్‌ను Standard (60Hz) కు మార్చండి.

Read also-Ola Champion Mahotsav: పొట్టి కప్ కొట్టిన భారత్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఓలా!

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్..

మనం వాడకపోయినా కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ డేటాను, పవర్‌ను వాడుకుంటాయి. వాటిని ఏం చేయాలి అంటే.. ‘Battery’ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఏ యాప్స్ ఎక్కువ బ్యాటరీ వాడుతున్నాయో చూసి, వాటిని ‘Restrict’ లేదా ‘Optimize’ చేయండి. దీంతో బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది.

లొకేషన్ ఆఫ్ చేయండి

చాలా యాప్స్‌కు మీ లొకేషన్ (GPS) అవసరం ఉండదు. అయినా అవి నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఆఫ్ చేయడమే బెటర్. వాటిని ఆఫ్ చేయడానికి లొకేషన్ పర్మిషన్స్‌లో “Only while using the app” ఆప్షన్ ఎంచుకోండి. అలాగే వైఫై, బ్లూటూత్ సెట్టింగ్స్‌లో ఉండే ‘Scanning’ ఆప్షన్లను డిసేబుల్ చేయండి.

వైబ్రేషన్

టైప్ చేసేటప్పుడు వచ్చే వైబ్రేషన్ (Haptic Feedback) వినడానికి బాగుంటుంది కానీ, లోపల ఉన్న మోటార్ పని చేయడానికి ఎక్కువ పవర్ కావాలి. దీంతో కీబోర్డ్ వైబ్రేషన్ మరియు సిస్టమ్ వైబ్రేషన్లను ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది.

పుష్ నోటిఫికేషన్లు ఆపేయండి

అవసరం లేని షాపింగ్ యాప్స్, గేమ్స్ నుండి వచ్చే నోటిఫికేషన్ల వల్ల ఫోన్ స్క్రీన్ మాటిమాటికీ వెలుగుతుంది. దీంతో బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను ‘Block’ చేయండి. పైన చెప్పిన సెట్టింగ్స్‌తో పాటు, బ్యాటరీ 20% కంటే తగ్గకుండా చూసుకోవడం, ఒరిజినల్ ఛార్జర్ వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా కాలం పాటు మెరుగ్గా ఉంటుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×