E-Paper
Advertisement

Medak Shocking Incident: ఛీ ఛీ నువ్వు అసలు తండ్రివేనా.. తాగుడికి డబ్బు లేదని.. 2 నెలల శిశువుని..

Medak Shocking Incident: ఛీ ఛీ నువ్వు అసలు తండ్రివేనా.. తాగుడికి డబ్బు లేదని.. 2 నెలల శిశువుని..
Advertisement

Medak Shocking Incident: చిన్నారులు తమ తండ్రిని సూపర్ హీరోగా భావిస్తుంటారు. ఎంతటి కష్టం వచ్చినా నాన్న ఉన్నారన్న ధైర్యంతో హ్యాపీగా జీవిస్తుంటారు. అటు తండ్రి సైతం తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. బిడ్డలకు అవసరాలను తీర్చేందుకు ఎంతటి కష్టానికైనా సిద్ధపడుతుంటారు. అలాంటిది ఓ తండ్రి.. తన బిడ్డ విషయంలో కర్కసంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే?

మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగుడుకు డబ్బులు లేక మహిపాల్ అనే వ్యక్తి తన శిశువును విక్రయించాడు. మగశిశువును రూ.1.70 లక్షలకు ఇచ్చేశాడు. అయితే ఇందుకు తల్లి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌లోని మాత శిశు సంరక్షణ ఆస్పత్రిలో గత నెల 10న హవేలీ ఘనపూర్ మండలం లింగసానిపల్లి తాండాకు చెందిన మంజుల మగశిశువుకు జన్మనిచ్చింది.

సహజీవనం చేస్తూ..

Advertisement

వారం రోజుల తర్వాత కామారెడ్డికి చెందిన దంపతులకు రూ. లక్షా 70 వేల కు ఆ దంపతులు బిడ్డను ఇచ్చివేశారు. అయితే మహిపాల్, మంజుల నిజమైన భార్య భర్తలు కారని తెలుస్తోంది. వారిద్దరు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. మెుదటి భార్యకు విడాకులు ఇచ్చి.. మంజులతో మహిపాల్ ఉంటున్నాడు. మద్యానికి బానిస అయిన నేపథ్యంలో డబ్బు కోసం శిశువును విక్రయించాలని అతడు నిర్ణయించుకున్నాడు.

Also Read: Tirumala Controversy: ఏపీ రాజకీయ రచ్చతో.. అల్లాడుతున్న తిరుమల వెంకన్న.. కలికాలం అంటే ఇదే!

ప్రశ్నించిన వారిపై ఆగ్రహం

Advertisement

అయితే బిడ్డ గురించి చుట్టుపక్కల వారు, బంధువులు ఆరా తీయగా.. వారిపై మహిపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమాధానం ఇవ్వకపోగా.. చాలా దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు విషయం తెలుసుకున్న అధికారులు.. బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరినీ సఖి కేంద్రానికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి.. బిడ్డను వారి వద్దకు చేర్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read: Portable AC Offers: అమేజింగ్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా పోర్టబుల్ ఏసీలు.. భలే ఛాన్సులే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×