E-Paper
Advertisement

Smartphone Cyberdeck: కేవలం స్మార్ట్‌ఫోన్‌తో ఆల్‌-ఇన్-వన్ సైబర్ డెక్ కంప్యూటర్.. వైరల్ అవుతన్న కొత్త టెక్నిక్.. ఎలా చేయాలంటే

Smartphone Cyberdeck: కేవలం స్మార్ట్‌ఫోన్‌తో ఆల్‌-ఇన్-వన్ సైబర్ డెక్ కంప్యూటర్.. వైరల్ అవుతన్న కొత్త టెక్నిక్.. ఎలా చేయాలంటే
Advertisement

Smartphone DIY Cyberdeck| మానవుని మేధస్సు ఎన్నో సాంకేతిక విజయాలు సాధించింది. టెక్నాలజీని అర్థం చేసుకుంటే ఎన్నో అనూహ్య వస్తువులు స‌‌ృష్టించవచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలే కానవసరం లేదు. దీనికి తాజా ఉదాహరణగా ఒకటి రెడ్డిట్ సోషల్ మీడియాలో ఒక అడ్వాన్స్ సైబర్ డెక్ నిలిచింది. ఈ సైబర్ డెక్‌ని కేవలం స్మార్ట్ ఫోన్ ఆధారంగా తయారు చేశారు. ఈ కొత్త డిజైన్ 1980ల మినీ కంప్యూటర్ల నుంచి ప్రేరణ పొందింది. ఒక టెక్ ఎంథూసియాస్ట్ దీన్ని తన రోజువారీ ఉపయోగం కోసం తయారు చేశాడు. మిగతావాళ్లు కూడా నేర్చుకోవడానికి ఈ యూజర్ దీన్ని ఎలా తయారు చేయాలో ఆన్‌లైన్‌లో వివరాలు షేర్ చేశాడు. దీన్ని తయారు చేయడానికి ఎలాంటి ల్యాబ్, కంపెనీ లేదా రీసెర్చ్ సంస్థ నుంచి సాయం తీసుకోలేదు.

సిస్టమ్ మొత్తం స్మార్ట్‌ఫోన్‌పైనే నడుస్తుంది

ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ఆసక్తికరమైన భాగం దాని కోర్. సైబర్‌డెక్ మెయిన్ కంప్యూటర్ బ్రెయిన్‌గా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంది. లోపల వేరే ఏ సిపియు లేదా సాంప్రదాయ కంప్యూటర్ లేదు. ఫోన్ ప్రాసెసింగ్, యాప్స్, మీడియా, కనెక్టివిటీ పనులన్నీ చేస్తుంది. ఈ విధానంతో సైబర్‌డెక్ చిన్నదిగా, శక్తివంతంగా, సమర్థవంతంగా ఉంటుంది.

పాత కంప్యూటర్ల నుంచి ప్రేరణ

Advertisement

దీన్ని తయారు చేసిన HTLL_OFFICIAL యూజర్ రెడ్డిట్‌లో ప్రాజెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ వివరించాడు. ముందుగా అతడు Atari Portfolioను ఆధునిక సైబర్‌డెక్‌గా మార్చాలనుకున్నాడు. తర్వాత అది విలువైన కలెక్టర్ ఐటెమ్‌ను డ్యామేజ్ చేస్తుందని తెలుసుకున్నాడు. అప్‌గ్రేడ్ చేసినా లోపల స్మార్ట్‌ఫోన్ అవసరమని అర్థమైంది. ఆ ఆలోచనతో మరింత స్మార్ట్ డిజైన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. స్మార్ట్‌ఫోన్‌నే సిస్టమ్ ఫౌండేషన్ గా మార్చేశాడు.

డిజైన్, టెస్టింగ్ కోసం మూడు నెలలు

నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఈ కాలంలో మూడు వేర్వేరు వెర్షన్లు తయారు చేశాడు. ప్రతి వెర్షన్‌లో ఉపయోగం, లేఅవుట్, ఇంటర్నల్ కనెక్షన్లు మెరుగుపరిచాడు. ముఖ్య లక్ష్యం సింపుల్‌గా ఉంది. ఒక పోర్టబుల్ సిస్టమ్‌లో అనేక టూల్స్ ఉండాలని కోరుకున్నాడు.

ఒకే డివైస్‌లో అన్నీ ప్యాక్

Advertisement

ఈ సైబర్‌డెక్ అనేక డివైస్‌లను ఒక్కటిగా కలిపింది. స్మార్ట్‌ఫోన్, కీబోర్డ్, యూఎస్‌బీ హబ్, స్పీకర్లు, బ్యాటరీ ఉన్నాయి. అవసరమైతే చిన్న బూమ్‌బాక్స్‌లా కూడా పనిచేస్తుంది. అన్నీ కాంపాక్ట్, ప్రాక్టికల్ షెల్‌లో ఫిట్ అయ్యాయి.

క్లామ్‌షెల్ డిజైన్ సౌకర్యం 

సైబర్‌డెక్ క్లామ్‌షెల్ స్టైల్ డిజైన్‌తో ఉంది. ల్యాప్‌టాప్‌లా ఓపెన్ అవుతుంది, రవాణా కోసం సురక్షితంగా ఇది ఫోల్డ్ అవుతుంది. హింజ్ స్క్రీన్‌ను 180 డిగ్రీలు ఫ్లాట్‌గా ఓపెన్ చేస్తుంది. వివిధ ఉపయోగాల్లో సౌకర్యంగా ఉంటుంది.

మాగ్నెటిక్ ఫోన్ మౌంటింగ్ సిస్టమ్

స్మార్ట్‌ఫోన్ మాగ్నెటిక్ టైప్-సి కనెక్టర్‌తో అనుసంధానమవుతుంది. ఫోన్ త్వరగా ఇన్‌స్టాల్, రిమూవ్ చేయవచ్చు. కనెక్ట్ అయ్యాక అన్ని యాక్సెసరీలు ఆటోమాటిక్‌గా పెయిర్ అవుతాయి. కీబోర్డ్, హబ్, ఆడియో సిస్టమ్స్ వెంటనే యాక్టివేట్ అవుతాయి.

కీబోర్డ్, హబ్, బ్యాటరీ సెటప్

డిటాచబుల్ వైర్‌లెస్ QWERTY కీబోర్డ్ ఉంది. కీబోర్డ్‌లో బిల్ట్-ఇన్ టచ్‌ప్యాడ్ కూడా ఉంది. మాగ్నెటిక్ హోల్‌స్టర్‌తో స్టోరేజ్‌లో సురక్షితంగా ఉంచవచ్చు. ఇంటర్నల్ టైప్-సి యూఎస్‌బీ హబ్ ఉంది. ఎక్స్‌ట్రా యాక్సెసరీలు అడ్ చేయవచ్చు. 10,000mAh బ్యాటరీ మొత్తం సిస్టమ్‌కు పవర్ ఇస్తుంది. ఫోన్, కీబోర్డ్ రెండింటినీ చార్జ్ చేస్తుంది.

Also Read: మెటా రేబ్యాన్ గ్లాసెస్ రివ్యూ.. స్మార్ట్‌గ్లాసెస్ రావడంతో ఫోన్ కెమెరా అవసరం లేదా?

బలమైన ఆడియో, స్టేబుల్ డిజైన్

ఆడియో ఈ బిల్డ్‌లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రెండు 5W స్పీకర్లు ఉన్నాయి. బ్లూటూత్ యాంప్లిఫైయర్ ద్వారా కనెక్ట్ అవుతాయి. సౌండ్ లౌడ్‌గా, క్లియర్‌గా ఉంటుంది, మీడియా ప్లేబ్యాక్‌కు అనువుగా ఉంటుంది. మాగ్నెటిక్ ఫ్లిప్-అవుట్ ఫీట్ డెస్క్‌పై స్టెబిలిటీ ఇస్తాయి. క్యారీ హ్యాండిల్ తో దీన్ని ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు.

ప్రాక్టికల్ ఉపయోగం ఎక్స్‌పెరిమెంట్ కంటే ఎక్కువ

ఈ సైబర్‌డెక్ ఎక్స్‌పెరిమెంటల్ కంటే ప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. గేమింగ్, మూవీస్ చూడటం, లైట్ కంప్యూటింగ్ పనులు చేయవచ్చు. కీబోర్డ్, స్పీకర్లు రోజువారీ ఉపయోగాన్ని మెరుగుపరుస్తాయి. స్మార్ట్‌ఫోన్లు సాంప్రదాయ కంప్యూటర్లను రీప్లేస్ చేయగలవని ఈ డిజైన్ నిరూపిస్తుంది. సృజనాత్మకత, ఓపిక, స్మార్ట్ ఇంజినీరింగ్‌ను హైలైట్ చేస్తుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×