E-Paper
Advertisement

No Battery Smartwatch: బ్యాటరీ లేకుండా నడిచే స్మార్ట్‌వాచ్.. ఎలా పని చేస్తుందంటే

No Battery Smartwatch: బ్యాటరీ లేకుండా నడిచే స్మార్ట్‌వాచ్.. ఎలా పని చేస్తుందంటే
Advertisement

No Battery Smartwatch| ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లను అందరూ ఇష్టపడుతున్నారు. అందుకే టెక్ కంపెనీలు స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్‌లో కొత్త కొత్త స్మార్ట్‌వాచ్‌ మోడల్స్ లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ కేటగిరిలో ఓ సరికొత్త టెక్నాలజీ వాచ్ రాబోతోంది. పరిశోధకులు బ్యాటరీ లేని స్మార్ట్ డివైస్‌లను తయారు చేస్తున్నారు. ఈ వాచ్‌లు థర్మల్ ఎలెక్ట్రిక్ ఎనర్జీతో పనిచేస్తాయి. అంటే మన శరీర వేడితోనే నడుస్తాయి.

ఈ కొత్త ఆవిష్కరణ వేరబుల్ టెక్నాలజీని పూర్తిగా మార్చేస్తుంది. ఇకపై స్మార్ట్‌వాచ్‌లను రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ పరిశోధన కొససాగుతోంది ఈ పరిశోధనలో బ్యాటరీ అవసరం లేకుండా స్వయం-శక్తి పొందే వేరబుల్ డివైస్‌లు తయారు చేయడమే లక్ష్యం.

శరీర వేడి ఎలా శక్తిని ఇస్తుంది

Advertisement

కొత్త టెక్నాలజీలో థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈ జనరేటర్లు శరీర వేడిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. శరీరం నుంచి వచ్చే వేడిని పట్టుకుని విద్యుత్‌గా మారుస్తాయి. డివైస్ ధరించినంత కాలం ఇది నిరంతరం జరుగుతుంది. దీంతో స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు బ్యాటరీ లేకుండానే పనిచేస్తాయి.

ప్రారంభ దశలో సమస్యలు

మొదటి వెర్షన్‌లలో చాలా సమస్యలు ఉన్నాయి. డివైస్‌లు కాగితం లాంటి సన్నగా ఉండేవి. వేడి సులభంగా బయటికి పోయేది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉండేది. తర్వాత 3D పిల్లర్ స్ట్రక్చర్లు ఉపయోగించారు. ఈ స్ట్రక్చర్లు పనితీరును మెరుగుపరిచాయి కానీ డివైస్‌లు మందం పెరిగింది. అందుకే ఈ సమస్యకు మరో పరిష్కారం అవసరమైంది.

ఫ్లాట్ డిజైన్‌ ఆవిష్కరణ

Advertisement

పరిశోధకులు కొత్త ఫ్లాట్ డిజైన్ తయారు చేశారు. ఇవి అధిక కెపాసిటీ గల థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లు. వీటిని ప్సూడోట్రాన్స్‌వర్స్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లు అంటారు. వేడి బయటికి పోకుండా అడ్డుకుంటాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫర్ కెపాసిటీ చాలా పెరిగింది.

అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, స్ట్రక్చర్

డివైస్‌లో సిలికాన్ బేస్ ఉపయోగించారు. ఇది వేడిని బయటికి పోకుండా బ్లాక్ చేస్తుంది. రాగి నానోపార్టికల్స్ కూడా జోడించారు. ఇవి వేడి ప్రవాహాన్ని సరిగ్గా నడిపిస్తాయి. డివైస్‌లో హాట్, కోల్డ్ జోన్లు ఏర్పాటు చేశారు. వీటితో విద్యుత్ ప్రవాహం సమర్థవంతంగా జరుగుతుంది. వేడి, కరెంట్ ఆప్టిమైజ్డ్ యాంగిల్స్‌లో ప్రవహిస్తాయి.

ఫ్లెక్సిబుల్, సులభమైన తయారీ

ఇంక్-బేస్డ్ ప్రింటింగ్ ప్రాసెస్‌తో తయారు చేస్తారు. ఇది సులభం, తక్కువ ఖర్చుతో జరుగుతుంది. డివైస్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. వేరబుల్ ప్రొడక్ట్స్‌కు సరిపోతుంది. వివిధ ఆకారాలు, సైజుల్లో తయారు చేయవచ్చు.

వేరబుల్ డివైస్‌లలో ఉపయోగం

ఈ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లకు పవర్ ఇస్తుంది. ఇతర వేరబుల్ గాడ్జెట్లకు కూడా వర్తిస్తుంది. శరీర వేడితో నిరంతరం నడుస్తాయి. ఛార్జింగ్ అవసరం తగ్గుతుంది. ఎకో-ఫ్రెండ్లీ టెక్నాలజీగా మారుతుంది.

Also Read: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

కొత్త టెక్నాలజీతో భవిష్యత్ స్మార్ట్‌వాచ్లు

స్వయం-శక్తి వేరబుల్స్ త్వరలో సాధారణమవుతాయి. వేరబుల్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేస్తాయి. డివైస్ కెపాసిటీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగవుతాయి. బ్యాటరీల వల్ల వచ్చే ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గుతుంది. మాస్ ప్రొడక్షన్‌కు మరిన్ని టెస్టింగ్‌లు అవసరం. కానీ పరిశోధనలో ఇప్పటివరకు పురోగతి ఆశాజనకంగా ఉంది.

బ్యాటరీ లేని స్మార్ట్‌వాచ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శరీర వేడితో నడిచే స్మార్ట్‌వాచ్‌లు ఈ ఆవిష్కరణ వేరబుల్ టెక్నాలజీకి అనూహ్య మార్పు తీసుకొస్తుంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×