E-Paper
Advertisement

Solar Energy System: సోలార్‌తో ఇండక్షన్ స్టవ్ నడపాలంటే ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా?

Solar Energy System: సోలార్‌తో ఇండక్షన్ స్టవ్ నడపాలంటే ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా?
Advertisement

Solar Energy System: ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా పెరిగాయో మనందరికీ తెలిసిందే. అందుకే హైదరాబాద్ లాంటి సిటీల్లోనే కాదు, పల్లెల్లో కూడా చాలామంది ఇండక్షన్ స్టవ్‌లను వాడుతున్నారు. కానీ గ్యాస్ సిలిండర్ లేకుంటే ఏంటి? ఇండక్షన్  స్టవ్ ఉంది కదాని వాడితే.. నెలాఖరుకు కరెంట్ బిల్లు చూసి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది.. అదే సోలార్ ఎనర్జీ.

ఈ నేపథ్యంలో సూర్యరశ్మిని వాడుకుని ఇండక్షన్ స్టవ్‌లను ఎలా నడపవచ్చు? దానివల్ల కలిగే లాభాలేంటి? సోలార్ ద్వారా రెండు ఇండక్షన్ స్టవ్‌లను ఆన్ టైం వాడితే కరెంట్ ఎంత ఖర్చవుతుంది.. వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం రండి..

ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్లు ఎంతొస్తుంది?

Advertisement

సాధారణంగా ఒక ఇండక్షన్ స్టవ్ 1,500 నుండి 2,000 వాట్ల వరకు పవర్ లాగుతుంది. మనం రోజుకు రెండు పూటలా కలిపి ఒక 3 గంటల పాటు రెండు స్టవ్‌లు వాడామనుకోండి.. రోజుకు 4 నుండి 6 యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది. అంటే నెలకు దాదాపు 120 నుండి 180 యూనిట్లు కేవలం వంట కోసమే వాడతాం. దీనివల్ల మీ కరెంట్ బిల్లు మీద అదనంగా రూ.1000 భారం పడటం ఖాయం.

ఎంత కెపాసిటీ ఉన్న సోలార్ పెట్టుకోవాలి?

వంటతో పాటు ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు, టీవీ, ఫ్రిడ్జ్ వంటివి కూడా సోలార్‌పైనే నడవాలి అనుకుంటే.. 3 కిలోవాట్ల (3KW) సిస్టమ్ సరిపోతుంది. ఇది రోజుకు 12 నుండి 15 యూనిట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

Also Read: రూ.12 వేలకే 32 ఇంచుల TCL స్మార్ట్ టీవీ.. ఆఫర్ అయ్యేలోపే కొనేయండి భయ్యా!

కరెంట్ బిల్లు క్రమంగా తగ్గాలంటే?

సిటీల్లో ఉండేవారికి ఆన్‌గ్రిడ్ పద్ధతి చాలా బెస్ట్. అంటే.. పగలు తయారైన కరెంట్‌ను మీరు వాడుకుని, మిగిలిన దాన్ని ప్రభుత్వానికి పంపించవచ్చు. రాత్రిపూట ప్రభుత్వం ఇచ్చే కరెంట్‌ను వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నెల తిరిగేసరికి మీ బిల్లు దాదాపు సున్నాకి వచ్చే అవకాశం ఉంటుంది.

సోలార్ ఏర్పాటుకు ఎంత  ఖర్చవుతుంది?

ఇది అందరూ అడిగే ప్రశ్న. ప్రస్తుతం మార్కెట్ రేట్ల ప్రకారం 3 కిలోవాట్ల ప్లాంట్ పెట్టాలంటే రూ.1.8 లక్షల నుండి రూ.2.2 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ‘పీఎమ్ సూర్య ఘర్’ పథకం కింద దాదాపు రూ.78,000 సబ్సిడీ ఇస్తోంది. కాబట్టి.. మీరు పెట్టాల్సిన ఖర్చు రూ.1.1 లక్షల నుండి రూ.1.4 లక్షల లోపే ఉంటుంది. మీరు కట్టే కరెంట్ బిల్లులను లెక్కేసుకుంటే, 3 నుండి 5 ఏళ్లలోనే మీ పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మరో 20 ఏళ్ల పాటు కరెంట్ ఉచితంగా వాడుకోవచ్చు.

బయోగ్యాస్ కంటే సోలార్ ఎందుకు మేలు?

చాలామంది చెత్తతో గ్యాస్ తయారు చేసే బయోగ్యాస్ గురించి అడుగుతుంటారు. అది మంచిదే కానీ, సిటీల్లో ఉండేవారికి అది కొంచెం కష్టమే. ఎందుకంటే దానికి చోటు ఎక్కువ కావాలి, రోజూ పేడ లేదా వ్యర్థాలు వేయాలి, వాసన వస్తుంది. కానీ సోలార్ అలా కాదు. మీ ఇంటి డాబా మీద చిన్న ఖాళీ ప్లేస్ ఉంటే పెట్టేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అసలే ఉండదు. ఇది కేవలం వంటకు మాత్రమే కాకుండా మిగతా అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.

Also Read: బ్యాటరీతో పనిచేసే ఇండెక్షన్ స్టవ్.. జస్ట్ రీఛార్జ్ చేస్తే చాలట, ఎక్కడైనా వండేసుకోవచ్చు!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×