E-Paper
Advertisement

TDP Controversies: చంద్రబాబుకు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్న ఆ నేతలు ఎవరు? టీడీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది?

TDP Controversies: చంద్రబాబుకు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్న ఆ నేతలు ఎవరు?  టీడీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది?
Advertisement

TDP Controversies:  తెలుగుదేశం పార్టీ లో కొంతమంది నేతల వ్యవహారం .. ఆ పార్టీకి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒక సమస్య ముగిసింది. అనుకునే లోపే మరొక సమస్యను ఎంపీలు, ఎమ్మెల్యేలే తీసుకొస్తుండడంతో ఏం చేయాలనే దానిపై పార్టీ అధిష్టానం తర్జనభర్జనలు పడుతుందట. చంద్రబాబు పదే పదే చెప్పినా నేతల తీరు మారకపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. వివాదాలకు దూరంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న చంద్రబాబుకు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్న ఆ నేతలు ఎవరు? వెలుగు చూస్తున్న వారి భాగోతాలపై టీడీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది?

తెలుగుదేశం నాయకుల వరుస వివాదాలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే రాసలీలల వీడియోలతో అడ్డంగా దొరికిపోతే.. తాజాగా మరో ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోవడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారిందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపే.. ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వీడియోలు బయటికి వచ్చాయి. దీనిపై వెంటనే స్పందించిన టీడీపీ అధిష్టానం, అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోవడంతో టీడీపీ డిఫెన్స్‌లో పడిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో పని కట్టుకుని మరీ పదేపదే కొంతమంది ఎమ్మెల్యే లు. మంత్రులు, ఎంపీలను వ్యక్తిగతంగా పిలుపించుకుని మరీ.. తీరు మార్చుకోవాలని చెబుతూనే ఉన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తన రాజకీయ శైలికి భిన్నంగా… పార్టీకి టైం కేటాయిస్తూ నాయకులకు పదేపదే దిశానిర్ధేశం చేస్తున్నారు… అనవసరమైన విషయాలు జోలికి వెళ్లి పార్టీ పరువును తీయొద్దంటూ చాలా సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు .. అయినా ఎక్కడో చోట ఏదో రూపంలో వివాదాలు చుట్టుముడుతుండటంతో.. చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.

Advertisement

Also Read:Vivekananda Reddy Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్టులు… అసలు నిజం దాచిపెట్టారా?

ప్రభుత్వానికి మొదట్లోనే బ్రేక్ వేసేలా ఎమ్మెల్యే

వాస్తవంగా సాఫీగా సాగుతుందనుకున్న కూటమి ప్రభుత్వానికి మొదట్లోనే బ్రేక్ వేసేలా ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం బయటికి రావడం తీవ్ర దుమారాన్ని రేపింది..సీఎం చంద్రబాబుకు ఆదిమూలం తో మొదలైన తలనొప్పి ప్రస్తుతం ఎంపీ పుట్టా వరకు వచ్చి ప్రస్తుతానికి ఆగింది. కొంతమంది ఎమ్మెల్యేల రాసలీలలు, అవినీతి ఇలా.. వరుస వివాదాలు చంద్రబాబుకు తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయట. తాజాగా పుట్టా మహేష్ ఎంపీగా ఉండి కూడా డ్రగ్స్ వాడి పట్టుబడ్డారు. దీంతో పార్టీ లో, ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది అనే అంశం పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడడం, లేని పోనీ విమర్శలు చెయ్యడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని తెలుగుదేశం లోనే చర్చ సాగుతుందట. ఆదిమూలం వేరే మహిళ తో ఉన్న వీడియోలు బయటకు రావడం తో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత మరి కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం తో సీఎం చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.. ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న సరైంది కాదని, పద్దతి మార్చుకోవాలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఎంపీ పుట్టా మహేష్ అడ్డంగా బుక్

Advertisement

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అడ్డంగా బుక్ అవ్వడంతో పార్టీ పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారిందదనే చర్చ సాగుతుందట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టాను అధిష్టానం ఆదేశించింది. పుట్టా విషయలో తీవ్ర విమర్శలు ఎదురౌతున్న నేపథ్యంలో ఎంపీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై పార్టీ హైకమాండ్ తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రితో జరిగిన సమావేశంలో పుట్టా మహేశ్ అంశంపై చంద్రబాబు సీరియస్‌గా మాట్లాడారు. యువకుడని.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టాకు అవకాశమిచ్చామని…కానీ ఈ విధంగా వ్యవహరించడం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. అసలు అలాంటి పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది..? పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా..? అని విధంగా చంద్రబాబు సీరియస్ అయ్యారంట.

పుట్టాని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని ప్రచారం

గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నామని… క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని స్పష్టంగా చెప్పారంట. పుట్టాని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని ప్రచారం సాగుతున్నా….పార్టీ అధ్యక్షుడు పల్లా జారీ చేసిన నోటీసుకు ఎంపీ నుంచి ఎలాంటి వివరణ వస్తుందో చూసి చర్యలు తీసుకుంటారనే టాక్ పార్టీలో నడుస్తుందట. అయితే పుట్టా వ్యవహారాన్ని వైసీపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంటోంది. రాసలీలలతో బయటపడ్డ ఎమ్మెల్యే ఆదిమలంను.. ఆగమేఘాల మీద సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం… పుట్టా మహేష్ విషయంలో .. ఎందుకు దోబూచులాడుతుందో? అంటూ బహిరంగ విమర్శలు చేస్తున్నారు వైసిపి నాయకులు .. ఆదిమూలం ఎస్సీ కాబట్టి.. వెంటనే చర్యలు తీసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేశారని, పుట్టా మహేష్ బీసీ అయినప్పటికీ… అతనికి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో టీడీపీ చర్యలు తీసుకోవడానికి భయపడుతోందని ట్రోల్ చేస్తున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా?

తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా?అని సెటైర్లు విసురుతున్నారు. ఇక అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు సంగతి పక్కన పెడితే.. కనీసం రెండేళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే ఈ రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వివాదాల్లో చిక్కుకోవడం , పార్టీ పరువుని బజారుకీడుస్తునారని అనే చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది. మరోవైపు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో సుమారు40 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని, తీరు మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని టీడీపీ అధినేత వారికి వార్నింగులు ఇచ్చారు. అంతేకాదు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ తయారు అయిందని, వారికి తరచు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా, పరిస్థితి మారకపోవడంతో…కఠిన నిర్ణయాల వైపు చంద్రబాబు అడుగులు వేస్తారనే టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా.. పరస వివాదాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో… పుట్టా మహేష్ యాదవ్ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయం… ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారబోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 Story By Big  Apparao, Big Tv

Also Read: WhatsApp Calls: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ఫీచర్‌తో మీ బీపీ అమాంతం తగ్గిపోతుంది..

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×