E-Paper
Advertisement

Data Theft Danger: మీ సోషల్ మీడియా, బ్యాంక్ డేటా చోరీ అయ్యే ప్రమాదం.. వెంటనే ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్చండి

Data Theft Danger: మీ సోషల్ మీడియా, బ్యాంక్ డేటా చోరీ అయ్యే ప్రమాదం.. వెంటనే ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్చండి
Advertisement

Data Theft Danger App Permissions| సైబర్ దొంగలు మీ మొబైల్ ఫోన్‌ల ద్వారా మీ మీ సోషల్ మీడియా, బ్యాంక్ డేటా, మీ కాంటాక్ట్స్ చోరీ చేస్తున్నారు. ఈ డేటా దొంగతనం జరిగినట్లు మీకు ఎప్పటికీ తెలియదు. ఇదంతా యూజర్ల నిర్లక్ష్యంతో జరుగుతోంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు యాప్‌లు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత పర్మిషన్లు అడిగితే ఆలోచించకుండా “అల్లౌ” (Allow) అని పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం మీ పర్సనల్ డేటాని సైబర్ మోసగాళ్లు ఈజీగా దొంగలిస్తారు. కొన్ని యాప్‌లు తమ పనికి అవసరం లేని పర్మిషన్లు కూడా అడుగుతాయి. ఈ విషయాల గురించి తెలుసుకుంటే మీ ఫోన్ సురక్షితంగా ఉంటుంది.

యాప్ పర్మిషన్లు అంటే ఏమిటి?

యాప్ పర్మిషన్లు అంటే యాప్‌లకు ఫోన్‌లోని కొన్ని ఫీచర్లు లేదా డేటా యాక్సెస్ ఇవ్వడం. ఉదాహరణకు కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్, స్టోరేజ్ వంటివి. కొన్ని పర్మిషన్లు యాప్ సరిగా పని చేయడానికి అవసరం. మరికొన్ని అనవసరం ఉన్నా ప్రమాదకరం కూడా.

అవసరమైన, అనవసరమైన పర్మిషన్ల ఉదాహరణలు

Advertisement

ఫోటో ఎడిటింగ్ యాప్‌కు కెమెరా, గ్యాలరీ యాక్సెస్ అవసరం. నావిగేషన్ యాప్‌కు లొకేషన్ పర్మిషన్ కావాలి. కానీ ఫ్లాష్‌లైట్ యాప్ కాంటాక్ట్స్ యాక్సెస్ అడిగితే అది అనుమానాస్పదం. అలాంటి యాప్‌లు ఫోన్‌లో అసలు ఇన్‌స్టాల్ చెయెద్దు.

అనవసర పర్మిషన్లు ఎందుకు ప్రమాదకరం?

అనవసర పర్మిషన్లు ఇస్తే ఫోన్‌లో మాల్‌వేర్ రావచ్చు. కొన్ని యాప్‌లు మీ లొకేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంటాయి. ఇది ప్రైవసీకి చాలా హానికరం.

డేటా దొంగతనం, ఆర్థిక మోసాల ప్రమాదం

Advertisement

కొన్ని పర్మిషన్లు ద్వారా యాప్‌లు మీ కాంటాక్ట్స్, మెసేజెస్, ఫోటోలు, డాక్యుమెంట్స్ చూడగలవు. హ్యాకర్లు ఈ డేటాను దొంగిలించి ఐడెంటిటీ థెఫ్ట్ లేదా ఆర్థిక మోసాలకు పాల్పడతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.

కెమెరా, మైక్రోఫోన్ యాక్సెస్‌కు ప్రత్యేక జాగ్రత్త అవసరం

కెమెరా పర్మిషన్ ఇస్తే యాప్ ఫోటోలు, వీడియోలు తీయగలదు. మైక్రోఫోన్ యాక్సెస్ ఇస్తే మీ మాటలు రికార్డ్ చేయవచ్చు. చాలా సార్లు నోటిఫికేషన్ రాకుండా రికార్డింగ్ జరుగుతుంది. యాప్‌కు నిజంగా అవసరమా అని చూసి మాత్రమే ఇవ్వండి.

లొకేషన్ పర్మిషన్‌ను లిమిట్ చేయడం ఎలా?

లొకేషన్ యాక్సెస్ ఇస్తే మీ మూవ్‌మెంట్స్ ట్రాక్ అవుతాయి. అనవసర యాప్‌లకు ఎప్పుడూ ఫుల్ టైమ్ లొకేషన్ ఇవ్వొద్దు. “యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే అల్లౌ” అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇది బ్యాక్‌గ్రౌండ్ ట్రాకింగ్ తగ్గిస్తుంది.

కాంటాక్ట్స్, స్టోరేజ్ పర్మిషన్లు చాలా సున్నితమైనవి

కాంటాక్ట్స్‌లో మీ పర్సనల్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టోరేజ్ యాక్సెస్ ఇస్తే ఫైల్స్, డాక్యుమెంట్స్ చదవగలవు. నమ్మకమైన యాప్‌లకు మాత్రమే ఇవ్వండి. అపరిచిత యాప్స్‌కు ఎప్పటికీ ఇవ్వొద్దు.

పర్మిషన్లు ఇవ్వడానికి ముందు ఎలా చెక్ చేయాలి?

యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు పర్మిషన్ రిక్వెస్ట్‌లు జాగ్రత్తగా చదవండి. యాప్ ఉపయోగానికి సంబంధం లేని పర్మిషన్ అడిగితే వెంటనే డినై చేయండి. వీలైతే ఆ యాప్ ఇన్‌స్టాల్ చేయెద్దు. చాలా యాప్‌లు లిమిటెడ్ పర్మిషన్లతోనే పని చేస్తాయి.

Also Read: ఐఫోన్ ఐక్లౌడ్ స్టోరేజ్‌ ఫుల్ అయిందా? డేటా కోల్పోకుండా ఫ్రీ చేయాలంటే ఇలా చేయండి

ఇన్‌స్టాల్ తర్వాత పర్మిషన్లు రివ్యూ చేయండి.. ఇలా

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌ల సెక్షన్ ఓపెన్ చేయండి. అక్కడ పర్మిషన్లు చూసి అనవసరమైనవి ఆఫ్ చేయండి. రెగ్యులర్‌గా రివ్యూ చేస్తే ఫోన్ సెక్యూరిటీ మెరుగుపడుతుంది.

అధికారిక వెబ్‌సైట్స్ లేదా నమ్మకమైన సోర్సెస్ నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలి

అజ్ఞాత వెబ్‌సైట్లు లేదా థర్డ్ పార్టీ స్టోర్స్ నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయొద్దు. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే తీసుకోండి. రేటింగ్స్, రివ్యూలు చూసి మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి.

జాగ్రత్త చాలా అవసరం

ప్రపంచవ్యాప్తంగా డేటా దొంగతనం కేసులు పెరుగుతున్నాయి. సెక్యూరిటీ వార్నింగ్స్ పట్టించుకోని వాళ్లను సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేస్తారు. స్మార్ట్ పర్మిషన్ ఆప్షన్స్‌తో డిజిటల్ ప్రమాదాలు తగ్గుతాయి. మీ జాగ్రత్తే మొబైల్ డేటా దొంగతనం నుంచి బెస్ట్ సెక్యూరిటీ కల్పిస్తుంది.

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×