E-Paper
Advertisement

Tech layoffs 2024 : ఈ ఏడాదీ లేఆఫ్‌ల పర్వం!

Tech layoffs 2024 : ఈ ఏడాదీ లేఆఫ్‌ల పర్వం!
Advertisement
Tech layoffs 2024

Tech layoffs 2024 : టెక్ దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలకడం ఈ ఏడాదీ కొనసాగుతోంది. నిరుడు 2.4 లక్షల మందికిపైగా టెకీలు ఇంటిబాట పట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 50% కన్నా ఎక్కువే. ఇక కొత్త ఏడాదిలోనూ తొలగింపు పర్వం కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టెకీల తొలగింపు బాధాకరమే అంటూ గూగుల్ ఈ ఏడాది కూడా కొలువుల్లో కోత పెట్టడం గమనార్హం.

ఇలా ఉద్యోగులపై వేటు వేస్తున్న దిగ్గజ సంస్థల్లో గూగుల్‌తో పాటు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాహూ, మెటా, జూమ్ కూడా ఉన్నాయి. తొల అర్థసంవత్సరంలో వేతన భారాన్ని తగ్గించుకుంటామని వివిధ రంగాల్లోని పలు స్టార్టప్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా లేఆఫ్‌లు ముమ్మరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ఆర్థికమాంద్యం తప్పదంటూ ఆర్థిక నిపుణుల హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. టెక్ రంగం మాత్రం వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకోవడంపైనే దృష్టి సారించింది. ఇక ఈ ఏడాదిలో లేఆఫ్‌లకు సిద్ధపడుతున్న టెక్ కంపెనీల జాబితా తక్కువేం లేదు. అమెజాన్‌కు చెందిన ఆన్ లైన్ ఆడియోబుక్, పాడ్ కాస్ట్ సర్వీస్ తమ సిబ్బందిలో 5% మందిని తొలగిస్తామని ప్రకటించింది. ఇలా ఉద్వాసన పలకడం ఇది మూడోసారి. మిగిలిన కంపెనీల పరిస్థితి ఇలా ఉంది.

  • డిస్కార్డ్‌లో 170 మంది ఇంటి బాట పట్టనున్నారు.
  • గూగుల్ అనుబంధంగా ఉండే ఇంజనీరింగ్, సర్వీసెస్ విభాగాల్లోని వెయ్యి మందిపై వేటు పడనుంది.
  • ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియో సిబ్బందిలో 500 మందిని తొలగించాలని అమెజాన్ నిర్ణయించింది. అమెజాన్ ట్విచ్‌లో 500 కొలువులు ఊడనున్నాయి.
  • డ్యుయలింగోలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిలో పదిశాతం తొలగింపు.
  • ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం రెంట్ ది రన్‌వేలో 10% మేర లేఆఫ్.
  • వీడియో గేమ్ ఇంజన్ మేకర్ యూనిటీలో ఏకంగా 1800 మంది తొలగింపునకు నిర్ణయం. నిరుడు మూడు దఫాలు ఉద్యోగులను ఫైర్ చేసింది.
  • జర్మన్ స్టార్టప్ పిచ్ కొలువుల్లో మూడింట రెండు వంతుల మేర తగ్గింపునకు నిర్ణయం.
  • సిబ్బందిలో 38% మేర తొలగించింది ఆన్ లైన్ రిటైల్ లాజిస్టిక్స్ కంపెనీ ఫ్లెక్స్.
  • ట్రెజర్ ఫైనాన్షియల్, బెంచ్ సై, న్యూస్కేల్, ట్రిగో, ఇన్ విజన్, వీడియోయాంప్, ఆర్కా సెక్యూరిటీ, ఫ్రంట్ డెస్క్ తదితర సంస్థలు కూడా లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నాయి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×