E-Paper
Advertisement

Tecno Pop X: 120Hz డిస్‌ప్లే, నెట్‌వర్క్ లేకున్నా కాలింగ్.. రూ.10000 కంటే తక్కువ ధరలో టెక్నో కొత్త ఫోన్

Tecno Pop X: 120Hz డిస్‌ప్లే, నెట్‌వర్క్ లేకున్నా కాలింగ్.. రూ.10000 కంటే తక్కువ ధరలో టెక్నో కొత్త ఫోన్
Advertisement

Tecno Pop X| టెక్నో కంపెనీ భారత్‌లో కొత్త బడ్జెట్ ఫోన్ టెక్నో పాప్ X లాంచ్ చేసింది. ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో అద్భుత ఫీచర్లు ఇస్తుంది. ధర పరంగా ఎంట్రీ-లెవల్ కస్టమర్ల కోసమే ఈ ఫోన్ రూపొందించారు. పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, నెట్‌వర్క్ లేకుండా వాకీ-టాకీ కాలింగ్ లాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో ధర

టెక్నో పాప్ X ధర కేవలం రూ.8,499 మాత్రమే. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఉంటుంది. టెక్నో అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. వైట్, గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

పాప్ X డిస్‌ప్లే, డిజైన్

Advertisement

ఈ బడ్జెట్ ఫోన్‌లో 6.75 ఇంచ్ LCD డిస్‌ప్లే ఉంది. HD+ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా స్మూత్‌గా ఉంటాయి. వీడియోలు చూడటం, బ్రౌజింగ్ చేయడం సౌకర్యంగా ఉంటుంది. IP64 రేటింగ్ ఉంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి ప్రొటెక్షన్ ఫీచర్ ఇస్తుంది.

నెట్‌వర్క్ లేకున్నా కాలింగ్: వాకీ-టాకీ కాలింగ్ ఫీచర్

ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన వాకీ-టాకీ కాలింగ్ ఫీచర్ ఉంది. మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే పనిచేస్తుంది. సాధారణ వాకీ-టాకీ లాగా మాట్లాడవచ్చు. ఇతర టెక్నో ఫోన్లతో 1.5 కిలోమీటర్ల దూరంలో కనెక్ట్ అవుతుంది. ఎమర్జెన్సీ సమయాల్లో, సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది.

సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు

Advertisement

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. టెక్నో HiOS కస్టమ్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. ఇందులో ఎల్లా AI అసిస్టెంట్ ఉంది. భారతీయ భాషలు సపోర్ట్ చేస్తుంది. ఇందులోని రోజువారీ పనులకు AI టూల్స్ ఉపయోగపడతాయి.

ప్రాసెసర్, స్టోరేజ్

Unisoc T7250 ప్రాసెసర్ చిప్‌సెట్ ఉంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోSD కార్డ్‌తో స్టోరేజ్ పెంచుకోవచ్చు. రోజువారీ పనులకు స్మూత్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది.

కెమెరా సెటప్

టెక్నో పాప్ X 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. డ్యూయల్ LED ఫ్లాష్ సపోర్ట్ చేస్తుంది. మంచి లైటింగ్‌లో క్లియర్ ఫోటోలు తీయవచ్చు. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బాగుంటుంది. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో కంపాటిబుల్ హోమ్ అప్లయన్స్‌లను రిమోట్ కంట్రోల్ చేయవచ్చు.

బ్యాటరీ, చార్జింగ్

5,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒక రోజు పూర్తిగా ఉపయోగించవచ్చు. స్ట్రీమింగ్, బ్రౌజింగ్ సౌకర్యంగా ఉంటాయి.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా ఆఫ్ చేయండి

కనెక్టివిటీ ఆప్షన్లు

డ్యూయల్ 4G LTE సపోర్ట్ ఉంది. Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS ఉన్నాయి. USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.

టెక్నో పాప్ X చాలా తక్కువ ధరలో అవసరమైన ఫీచర్లు ఇస్తుంది. 120Hz డిస్‌ప్లే స్మూత్‌నెస్ ఇస్తుంది. వాకీ-టాకీ ఫీచర్ ప్రత్యేకంగా ఉంది. పెద్ద బ్యాటరీ, ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉన్నాయి. బడ్జెట్ కస్టమర్లకు ఉపయోగకరమైన, ప్రాక్టికల్ ఫోన్.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×