E-Paper
Advertisement

Cheapest AI features Phone: చెమటలు పట్టిస్తున్న ఫోన్.. చీప్ ధరకే 6GB ర్యామ్, AI ఫీచర్లు, 108MP కెమెరా ఫోన్, వదలకండి!

Cheapest AI features Phone: చెమటలు పట్టిస్తున్న ఫోన్.. చీప్ ధరకే 6GB ర్యామ్, AI ఫీచర్లు, 108MP కెమెరా ఫోన్, వదలకండి!
Advertisement

Tecno Pova 6 Neo 5G Launched: అందరికీ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలని.. అందులో సినిమాలు చూడాలని, గేమ్స్ ఆడాలని ఉంటుంది. కానీ వాటి ధరలు చూసి కొంతమంది షాక్ అవుతున్నారు. అరెరే మేము సంపాదించేదే తక్కువ.. అందులో ఫోన్‌ కోసమే ఇంత భారీ మొత్తంలో డబ్బులు పెట్టాలా అని ఆలోచించి తమ ప్లాన్‌ను మార్చుకుంటుంటారు. ఎప్పుడైనా తక్కువ ధరలో ఫోన్‌ లాంచ్ అయితే అప్పుడు కొనుక్కోవచ్చులే అని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ టెక్నో సామాన్యుల బడ్జెట్‌లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Tecno భారతదేశంలో Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ AI మ్యాజిక్ ఎరేజర్, AI కటౌట్, AI వాల్‌పేపర్, ఆర్ట్‌బోర్డ్, ఆస్క్ AI వంటి అనేక AI ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో MediaTek డైమెన్షన్ 6300 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 8 GB RAMను కంపెనీ ఇందులో అందించబడింది. అలాగే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే..

Advertisement

Tecno Pova 6 Neo 5G Specifications

Tecno POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 480 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో వచ్చింది. Android 14-ఆధారిత HiOS 14.5పై నడుస్తుంది. అంతేకాకుండా 6nm MediaTek డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ ఈ ఫోన్‌లో అందించబడింది. దీనితో పాటు గరిష్టంగా 8GB RAM + గరిష్టంగా 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. అదే సమయంలో దీని ర్యామ్‌ను వర్చువల్‌గా 16GB వరకు విస్తరించవచ్చు. దీని స్టోరేజ్‌ను కూడా 1TB వరకు విస్తరించవచ్చు. ఇది ఐదేళ్లపాటు లాగ్-ఫ్రీ పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Also Read: ఏంటి మామ ఈ ఆఫర్లు.. ఏకంగా మూడు ఫోన్లపై అరాచకమైన డిస్కౌంట్లు!

ఫోన్ కెమెరా విషయానికొస్తే.. Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్ 3x ఇన్-సెన్సార్ జూమ్‌తో AI-బ్యాక్డ్ 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరా సూపర్ నైట్ మోడ్, టైమ్-లాప్స్, వ్లాగ్, డ్యూయల్ వీడియోతో సహా అనేక ఫోటోగ్రఫీ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం ఫ్లాష్‌తో ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా ఇంత చీప్ ధరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా లభించడం విశేషం అనే చెప్పాలి.

ఈ హ్యాండ్‌సెట్ AIGC పోర్ట్రెయిట్, AI మ్యాజిక్ ఎరేజర్, AI కటౌట్, AI వాల్‌పేపర్, AI ఆర్ట్‌బోర్డ్, ఆస్క్ AI వంటి అనేక AI ఫీచర్లను అందిస్తుంది. అంటే అతి తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ ఏఐ ఫీచర్లతో రావడం అదృష్టమనే చెప్పాలి. ఇక Tecno Pova 6 నియో 5G బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54-రేటెడ్ బిల్డ్‌ను పొందింది.

Tecno Pova 6 Neo 5G Price

భారతదేశంలో Tecno Pova 6 Neo 5G ధర గురించి మాట్లాడితే..ఇది రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 6GB Ram + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. అదే సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. అదే సమయంలో రూ.1000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. వీటితో మరింత తక్కువ ధరకే టెక్నో కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను అమెజాన్‌తో పాటు సమీపంలోని రిటైల్ స్టోర్ల నుండి సెప్టెంబర్ 14 నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది మిడ్‌నైట్ షాడో, అజూర్ స్కై, అరోరా క్లౌడ్ వంటి కలర్ ఆప్షన్‌లలో రిలీజ్ అయింది.

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×