
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సినిమాల్లో నటించి ఆ తర్వాత సొంత ప్రాంతీయ చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రద్ధ.

తెలుగు చిత్ర పరిశ్రమను మాత్రం వదల్లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా పూర్తి స్థాయిలో నటిస్తూనే ప్రత్యేక గీతాల్లో నటిస్తూ కెరియర్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది.

2008లో విడుదలైన సిద్దూ ఫ్రమ్ సికాకుళం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

2010లో లాహోర్ లో సినిమాలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

అల్లు అర్జన్ హీరోగా తెరకెక్కిన ఆర్య-2 సినిమాల్లో నటించి తన గ్లామర్ తో కుర్రకారును కునుకు లేకుండా చేసింది.

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

శ్రద్ధాదాస్ తెలుగులోనే కాకుండ హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించింది.

ఇక ఈ బ్యూటీ ఓవైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ముత్యాల చీరలో ముత్యంలా మెరుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.