E-Paper
Advertisement

Tecno Spark Go 2 Launch: రూ.7,499 ధరలో AI ఫీచర్లతో టెక్నో సంచలనం.. స్పార్క్ గో 2 అదిరిపోయే ఫీచర్లు ఇవే!

Tecno Spark Go 2 Launch: రూ.7,499 ధరలో AI ఫీచర్లతో టెక్నో సంచలనం.. స్పార్క్ గో 2 అదిరిపోయే ఫీచర్లు ఇవే!
Advertisement

Tecno Spark Go 2 Launch: బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లను కోరుకునేవారి కోసం ప్రముఖ టెక్నో సంస్థ Spark Go 2ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ముఖ్యంగా సామాన్యులు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్.. రూ.7,499 ప్రారంభ ధరతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లు కలిపితే ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు EMI ఆప్షన్స్‌ కూడా ఉండటంతో ఈ హ్యాండ్ సెట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.

ఈ Tecno Spark Go 2 కేవలం ధరలో మాత్రమే కాదు.. టెక్నాలజీ పరంగానూ ఆకట్టుకుంటోంది. దీనిలో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. ఇక ఈ ఫోన్ పనితీరు విషయానికొస్తే.. యూనిసాక్ T7250 చిప్‌సెట్‌తో పాటు 4GB రియల్ RAM, మరో 4GB వర్చువల్ RAM కలిపి మొత్తం 8GB RAM సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది.

Advertisement

Also Read: క్రేజీ ఆఫర్ మావా.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ.24,000 తగ్గింపు, ఎక్కడో తెలుసా?

ప్రస్తుత టెక్ యుగంలో రాజ్యమేలుతున్న AI ఫీచర్లను సైతం టెక్నో ఈ బడ్జెట్ ఫోన్‌లో ప్రవేశపెట్టింది. దీనిలో ఉన్న Ella AI అసిస్టెంట్ లోకల్ లాంగ్వేజస్‌లో కూడా కమ్యూనికేట్ చేయగలదు. ఇకపోతే ఫొటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండటం వల్ల రాత్రిపూట కూడా స్పష్టమైన ఫొటోలు వస్తాయి. మరో విశేషం ఏమిటంటే.. Tecno Spark Go 2 ఫోన్‌లో నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేసుకునే ఫ్రీ లింక్ ఫీచర్ ఉండటం.

Advertisement

5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న Tecno Spark Go 2 హ్యాండ్ సెట్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15పై పనిచేసే ఈ ఫోన్, ధూళి, నీటి నుండి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇకపోతే భద్రత కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే నాలుగేళ్ల పాటు స్లో అవ్వకుండా పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది.

Also Read: మార్కెట్లోకి Poco X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×