BigTV English
Advertisement

Samsung Galaxy S23 Ultra Discount: ఇప్పుడే కొనండి.. రూ. 44 వేల డిస్కౌంట్.. సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్!

Samsung Galaxy S23 Ultra Discount: ఇప్పుడే కొనండి.. రూ. 44 వేల డిస్కౌంట్.. సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్!

Samsung Galaxy S23 Ultra Discount: అమోజాన్‌లో ప్రైమ్ డే సేల్ జరుగుతోంది. జులై 21 వరకు జరిగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అలానే ఈ సేల్‌లో సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S23 అల్ట్రాని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.1,14,990గా ఉండేది. అయితే ఇప్పుడు అమోజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఫోన్‌పై రూ.44,491 తగ్గింపు లభిస్తుంది. దీని తర్వాత ఫోన్‌ను రూ.79,999కి కొనుగోలు చేయవచ్చు.


మీరు ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ICICI లేదా HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు అదనంగా రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.55,900 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.4 వేల వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. మీరు ఈ సామ్‌సంగ్ ఫోన్‌ని ఆకర్షణీయమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో కంపెనీ 6.8 అంగుళాల డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలో మీరు 1200 నిట్‌ల పీక్ బ్రైట్నెస్ అందిస్తోంది. ఫోన్ గరిష్టంగా 12 GB RAM+ 1 TB ఇంటర్నల్ స్టోరేజ్‌లో వస్తుంది. ఇందులో ప్రాసెసర్‌గా  Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన నాలుగు కెమెరాలను తీసుకొచ్చింది.


Also Read: Prime Day Sale Cheapest Mobiles: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 5 ఫోన్లు తక్కువ ధరకే.. మరికొన్ని గంటలే ఛాన్స్!

సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా కెమెరా విషయానికి వస్తే దీనిలో 10-మెగాపిక్సెల్ టెలిఫోటోతో కూడిన 200-మెగాపిక్సెల్ OIS మెయిన్ లెన్స్, 10-మెగాపిక్సెల్ పెరిస్కోప్, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అదే సమయంలో,కంపెనీ ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5000mAh. ఈ బ్యాటరీ 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా మీరు 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా దక్కించుకుంటారు.

Related News

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Big Stories

×