Big Stories

Science Behind Luck:- లక్ వెనుక సైన్స్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో…

- Advertisement -

Science Behind Luck:- లక్ అనేది తరతరాలుగా మనుషులకు అంతుచిక్కని, అర్థం కాని ఒక కాన్సెప్ట్. ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి లక్ అనేది మనకు సపోర్ట్ చేయలేదు అంటూ చాలామంది చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి విషయాల్లో లక్ అనేది చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే ఆ లక్ వెనుక కూడా సైన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. లక్ అనేది అందరూ అనుకుంటున్నట్టు పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగేది కాదని బయటపెట్టారు.

- Advertisement -

అవకాశం, ఆలోచన కలిస్తేనే అది లక్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్యాంబ్లింగ్ లాంటి గేమ్స్ మనం ఎంచుకున్న కార్డ్స్ మన గెలుపు, ఓటమిలను డిసైడ్ చేస్తాయి కానీ.. ఆ కార్డ్స్‌ను ఎంపిక చేయడం వెనుక చాలా ఆలోచన ఉంటేనే లక్ కలిసొస్తుంది అంటున్నారు. అంతే కాకుండా లక్‌కు కొలమానం కూడా ఉంటుందని వారు చెప్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బెట్టింగ్ విషయంలో లక్ సహకరించాలంటే ప్లేయర్ ఆటతీరు, టీమ్ ఆటతీరు, వాతావరణ పరిస్థితులు.. ఇలా అన్ని కలిపి ఆలోచనతో ముందుకు వెళితేనే లక్ కలిసొస్తుందని తెలిపారు.

ఆలోచనతో లక్‌ను దక్కించుకోవడం అనేది మనిషి మేధస్సుకు సంబంధించిన విషయం. కానీ అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కూడా లక్‌కు సహకరిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏఐ అనేది చాలావరకు డేటాను సేకరించి, దానిని స్టడీ చేస్తుంది కాబట్టి గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటి విషయాల్లో ఏఐ అంచనా చాలావరకు కరెక్ట్‌గా ఉంటుందని చెప్తున్నారు. ఏఐ అనేది ప్రతీ రంగంలో దూసుకెళ్తున్న క్రమంలో కొందరు వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు దీనిని బెట్టింగ్‌లలో లక్‌ను పొందడం కోసం కూడా ఉపయోగిస్తున్నారని స్టడీలో తేలింది.

ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా.. ఎన్ని అంచనాలు చేసినా.. చివరికి లక్ అనేది ఎవరూ ప్లాన్ చేసి చేసేది కాదని నిపుణులు చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి టెక్నాలజీ సైతం కొంతవరకే లక్‌కు సహకరిస్తుందని అంటున్నారు. అయినా కూడా బెట్టింగ్ వంటి విషయాల్లో బెట్టింగ్ రాజాలకు సాయం చేయడానికి ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో తయారైన ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి చెడు వ్యసనాల కోసం ఏఐ ఉపయోగపడడం బాధాకరమని నిపుణులు వాపోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News