BigTV English
Advertisement

4K QLED Google Tv @ Rs 15,999: ఆఫర్ అదరహో.. 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే 4K క్యూఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ!

4K QLED Google Tv @ Rs 15,999: ఆఫర్ అదరహో.. 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే 4K క్యూఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ!

Buy Thomson Phoenix @ Rs 15,999: తక్కువ ధరలో మంచి టీవీని కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎప్పుడైనా భారీ డిస్కౌంట్ ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు అని ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ రానే వచ్చింది. అతి తక్కవ ధరలో మంచి ఫీచర్లు కలిగిన 4k స్మార్ట్ టీవీని కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ పోనెక్స్ 43 ఇంచుల క్యూఎల్‌ఈడీ హెచ్‌డీ 4కె స్మార్ట్ గూగుల్ టీవీ (Thomson Phoenix 108 cm (43 inch) QLED Ultra HD (4K) Smart Google TV Dolby Vision & Atmos (Q43H1110)ని మంచి ధరలో కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.31,999గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 34 శాతం డిస్కౌంట్‌తో రూ. 20,999లకే లిస్ట్ అయింది.

అంతేకాకుండా దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.1000 వరకు ఎంపిక చేసిన క్రెడిట్ / డెబిట్ కార్డు, యూపీఐ అండ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ 4కె క్యూఎల్‌ఈడీ టీవీని సొంతం చేసుకోవచ్చు.


దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. రూ.3,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో దీనిని రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు. ఒకరకంగా దీనిని 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత టీవీ మంచి కండీషన్‌లో ఉండాలి. డ్యామేజ్ ఉండకూడదు. మోడల్ కూడా కొత్తదై ఉండాలి. మీ పిన్‌కోడ్ బట్టి కూడా ధర మారే అవకాశం ఉంది.

Also Read: రూ.10 వేలల్లో భలే మంచి టీవీలు.. ఒక్కోదానికి లక్షల్లో రేటింగ్స్..!

ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లకు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అల్ట్రా హెచ్‌డీ (4k) 3840 × 2160 పిక్సెల్ రెజుల్యూషన్‌తో వస్తుంది. అలాగే 40 వాట్స్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 60 Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించబడిన అనేక స్ట్రీమింగ్ అప్లికేషన్‌ల నుండి 7,00,000 కంటే ఎక్కువ సినిమాలు, టీవీ ఎపిసోడ్‌ల ఆకట్టుకునే లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తోంది.

Tags

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×