BigTV English

Android TV Under Rs 10,000: రూ.10 వేలల్లో భలే మంచి టీవీలు.. ఒక్కోదానికి లక్షల్లో రేటింగ్స్..!

Android TV Under Rs 10,000: రూ.10 వేలల్లో భలే మంచి టీవీలు.. ఒక్కోదానికి లక్షల్లో రేటింగ్స్..!

Cheap and Best Android Smart TV’s Under Rs 10,000: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. వీటితో థీయేటర్ లాంటి అనుభూతిని ఇంట్లోనే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ మీ వినోద అనుభ‌వాన్ని రెట్టింపు చేస్తాయి. ఒకప్పుడు అయితే స్మార్ట్ టీవీల ధరలు చాలా అధికంగా ఉండేవి. ప్రస్తుత కాలంలో చౌకైన స్మార్ట్ టీవీలు కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇవి రూ. 10,000 కంటే తక్కువ ధరలో లభిస్తాయి. వీటిని ఉపయోగించిన తర్వాత కస్టమర్‌లు మంచి రేటింగ్‌లు అందించారు. మీరు కూడా రూ. 10,000 కంటే తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఇవి మంచి ఆప్షన్‌గా ఉండొచ్చు. వాటి గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం


Motorola Smart LED TV
మోటరోలా అమెరికాకు చెందిన ప్రసిద్ధ టెక్ కంపెనీ. ఇది రూ.10 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో వచ్చే నంబర్ 1 స్మార్ట్ టీవీ. ఈ కంపెనీ కొన్ని నెలల క్రితం Motorola 32HDGDMBSXP HD స్మార్ట్ LED TV పేరుతో కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ టీవీలో 32 అంగుళాల LED స్క్రీన్ ఉంది. దీని స్క్రీన్ HDR10 మద్దతుతో వస్తుంది. ఈ HD TV స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768.  స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz. ఈ టీవీ Android TV (Google TV) OSలో రన్ అవుతుంది. ఇది 1.5GB RAM + 8GB స్టేరేజ్ కలిగి ఉంది. టీవీలో 2 USB, 3 HDMI పోర్ట్‌లు చూడొచ్చు. టీవీలో రెండు 20W స్పీకర్లు కూడా అందించబడ్డాయి. 4 వేల మందికి పైగా ఈ టీవీకి 4.2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ ధర రూ. 11,199లకి అందుబాటులో ఉంది. డిస్కౌంట్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీరు ఈ టీవీని రూ. 10,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Also Read: హోండా షైన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే రివ్యూ‌పై ఓ లుక్కేయండి!


Thomson Alpha HD Smart LED TV
థామ్సన్ ఆల్ఫా హెచ్‌డీ టీవీ నంబర్-2లో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 32 వేల మందికి పైగా ఈ టీవీకి 4.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ టీవీలో 32 అంగుళాల LED స్క్రీన్ ఉంది.ఈ HD TV స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz. ఈ టీవీ Linux TV (My Wall) OSలో రన్ అవుతుంది. ఇది 512MB+ 4GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ టీవీలో 2 USB, 3 HDMI పోర్ట్‌లు ఇచ్చారు. టీవీలో రెండు 30W స్పీకర్లు కూడా అందించబడ్డాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ ధర రూ. 8,499, అయితే మీరు విక్రయాలు ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా మరింత తక్కువ ధరకు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

Infinix 32Y1 HD Smart LED TV
ఈ లిస్టులో Infinix స్మార్ట్ టీవీ కూడా ఉంది. Infinix కంపెనీ కూడా సరసమైన ధరలో స్మార్ట్ టీవీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫ్లిప్‌కార్ట్‌లో 46 వేల మందికి పైగా ఈ టీవీకి 4.2 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ టీవీలో 32 అంగుళాల LED స్క్రీన్ ఉంది. ఈ HD TV స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz. ఈ టీవీ Linux TV (My Wall) OSలో రన్ అవుతుంది. ఇది 512MB RAM+ 4GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇందులో కూడా 2USB, 3 HDMI పోర్ట్‌లు ఉంటాయి. టీవీలో డాల్బీ ఆడియోతో పాటు రెండు 20W స్పీకర్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ ధర రూ. 8,999, అయితే మీరు ఆఫర్ ద్వారా మరింత తక్కువ ధరకు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

Also Read: టీవీఎస్ అపాచీ ఫుల్ రివ్యూ.. ఇదే రియాలిటీ!

Realme Smart TV 32 HD Smart LED TV
రియల్‌మీ స్మార్ట్ టీవీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 2 లక్షల మందికి పైగా ప్రజలు ఈ టీవీని కొనుగోలు చేశారు. దీనికి 4.3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ టీవీ రూ. 10,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో 32 అంగుళాల LED స్క్రీన్ ఉంది. స్క్రీన్ HDR10 సపోర్ట్‌తో వస్తుంది. HD TV స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz. టీవీ Android TV (Google TV) OSలో రన్ అవుతుంది. ఇది 1GB RAM + 8GB స్టోరేజ్ కలిగి ఉంది. టీవీలో 2 USB, 3 HDMI పోర్ట్‌లు తీసుకొచ్చారు. .TV డాల్బీ ఆడియోతో 4 24W స్పీకర్లను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ ధర రూ. 9,999, అయితే మీరుఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా ఈ టీవీని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Thomson FA Smart LED TV
స్మార్ట్ టీవీ ప్రపంచంలో థామ్సన్ ఒక పెద్ద కంపెనీ. ఈ స్మార్ట్ టీవీకి ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 1.25 లక్షల మంది కస్టమర్‌లు 4.3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ టీవీలో 32 అంగుళాల LED స్క్రీన్ ఉంది. HD TV స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768.  స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60Hz. టీవీ Android TV (Google TV) OSలో రన్ అవుతుంది. ఇది 1GB RAM + 8GB స్టోరేజ్ కలిగి ఉంది. టీవీలో 2 USB, 3 HDMI పోర్ట్‌లు ఉంటాయి. రెండు 30W స్పీకర్లు కూడా అందించబడ్డాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ ధర రూ. 10,499, అయితే డిస్కౌంట్ ఆఫర్‌ల ద్వారా తక్కువ ధరకు దక్కించుకోవచ్చు.

Tags

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×