E-Paper
Advertisement

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
Advertisement

Selling Old Phone Tips: ప్రస్తుత టెక్ యుగంలో కొత్త ఫోన్ మార్కెట్లోకి రాగానే పాత ఫోన్ అమ్మేసి, అప్‌గ్రేడ్ అవ్వడం చాలా మామూలైపోయింది. అయితే, ఫోన్ అమ్మేసే ముందు కేవలం ఫొటోలు, వీడియోలు డిలీట్ చేస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది అస్సలు సేఫ్ కాదు. మన ఫోన్లలో బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఈ-మెయిల్స్ వంటి ఎంతో సున్నితమైన సమాచారం ఉంటుంది. పొరపాటున ఈ డేటా వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్తే సైబర్ మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి పెద్ద ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది. అందుకే ఫోన్ అమ్మే ముందు కొన్ని ముఖ్యమైన పనులు కచ్చితంగా చేయాలి. అవేంటంటే..

డేటాను సేఫ్‌గా దాచడమెలా?

ఫోన్‌ను క్లీన్ చేసే ముందు.. అందులో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరుచుకోవడం మొదటి స్టెప్. దీనిలో భాగంగా ఫఒటోలు, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, అవసరమైన డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ లేదా వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్‌లలో బ్యాకప్ తీసుకోవాలి. లేదా సింపుల్‌గా కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లోకి కాపీ చేసుకోండి. దీనివల్ల మీ పాత ఫోన్ ఖాళీ అయినా, డేటా మాత్రం మీ దగ్గరే సురక్షితంగా ఉంటుంది.

అన్ని అకౌంట్స్ లాకౌట్ అవ్వడం:

Advertisement

చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఫైల్స్ డిలీట్ చేస్తారు కానీ మెయిన్ అకౌంట్ల నుంచి లాగ్ అవుట్ అవ్వడం మర్చిపోతారు. మీరు గనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే.. గూగుల్ అకౌంట్ లాగ్ అవుట్ చేసి, Find my device ఆప్షన్‌ను ఆపేయాలి. అలాగే ఐఫోన్ వినియోగదారులు తమ యాపిల్ ఐడీని సైన్ అవుట్ చేసి, ఐక్లౌడ్ లింక్‌ను తీసేయాలి. ఇలా చేయకపోతే ఫోన్ కొన్న కొత్త వ్యక్తికి యాక్టివేషన్ లాక్ సమస్యలు వస్తాయి.

Also Read: రూ.5 వేల బడ్జెట్‌లో శాంసంగ్ నెక్ట్స్ జనరేషన్ ఫిట్‌నెస్ ట్రాకర్.. లీకైన వివరాలు!

ఆ యాప్స్ విషయంలో జాగ్రత్త:

Advertisement

మనకు అత్యంత నష్టం కలిగించేది బ్యాంకింగ్ సమాచారమే. ఫోన్ అమ్మే ముందు కేవలం బ్యాంకింగ్, UPI, డిజిటల్ వాలెట్ యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తే సరిపోదు. యాప్స్ లోపలికి వెళ్లి పూర్తిగా లాగ్ అవుట్ అవ్వాలి. లేదంటే ఆ యాప్స్ లోని లాగిన్ వివరాలు, పాత లావాదేవీల డేటా రికవర్ అయ్యే ప్రమాదం ఉంది. పూర్తిగా లాగ్ అవుట్ చేయడం వల్ల మీ డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు.

ఫ్యాక్టరీ రీసెట్ తప్పనిసరి:

పైన చెప్పిన పనులన్నీ పూర్తయ్యాక, చివరగా ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఇది మీ ఫోన్లోని యాప్స్, మెసేజ్‌లు, అకౌంట్ సమాచారాన్ని పూర్తిగా తుడిచేసి, ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో అలా మారుస్తుంది. మరింత నమ్మకం కోసం కొందరు రెండు సార్లు కూడా రీసెట్ చేస్తుంటారు. కొద్ది నిమిషాలు కేటాయించి ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మన వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లు కూడా సురక్షితంగా ఉంటాయి.

Also Read: స్క్రీన్‌పై ప్రాబ్లమ్ రాస్తే చాలు.. క్షణాల్లో సాల్వ్ చేసే ఏఐ.. సరికొత్త వ్యూసోనిక్ 4K బోర్డులు లాంచ్!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×