E-Paper
Advertisement

స్క్రీన్‌పై ప్రాబ్లమ్ రాస్తే చాలు.. క్షణాల్లో సాల్వ్ చేసే ఏఐ.. సరికొత్త వ్యూసోనిక్ 4K బోర్డులు లాంచ్!

స్క్రీన్‌పై ప్రాబ్లమ్ రాస్తే చాలు.. క్షణాల్లో సాల్వ్ చేసే ఏఐ.. సరికొత్త వ్యూసోనిక్ 4K బోర్డులు లాంచ్!
Advertisement

ViewSonic IN05 Series: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ ViewSonic భారతదేశంలో సరికొత్త ‘IN05 సిరీస్ వ్యూబోర్డ్ 4K’ ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలను విడుదల చేసింది. ప్రత్యేకంగా తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వీటిని రూపొందించింది. ఈ సరికొత్త సిరీస్‌లో మొత్తం మూడు స్క్రీన్ సైజులు అందుబాటులోకి వచ్చాయి. అవి 65 అంగుళాలు, 75 అంగుళాలు, 86 అంగుళాల వేరియంట్లలో లభిస్తాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ డిస్‌ప్లేలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఏఐ ఫీచర్లను అందించారు.

క్లాస్‌రూమ్ లర్నింగ్‌కు బెస్ట్:

ఈ వ్యూబోర్డ్ డిస్‌ప్లేలు 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తాయి. తరగతి గదిలో వెలుతురు ఎక్కువగా ఉన్నా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా దీనికి యాంటీ-గ్లేర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కళ్లపై ఒత్తిడి పడకుండా లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ కూడా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, 128GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. దీనివల్ల ఎలాంటి లాగ్ లేకుండా యాప్స్ చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. అలాగే డిస్‌ప్లేకు ఇరువైపులా అమర్చిన 20 వాట్ల డ్యూయల్ స్పీకర్లు క్లాస్‌రూమ్ అంతటా మంచి ఆడియోను అందిస్తాయి.

పాఠాలను ఈజీగా మార్చే ఏఐ టూల్స్:

Advertisement

ఈ వ్యూబోర్డ్‌లో అందించిన ఏఐ ఫీచర్లు చదువును మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. దీనిలో ఉండే ‘ఆస్క్ ఏఐ’ వాయిస్ కమాండ్స్ ద్వారా క్లాస్‌రూమ్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ‘వీడియో పైలట్’ ఫీచర్ సహాయంతో ఏదైనా వీడియోలోని ముఖ్యమైన అంశాలను సులభంగా సమ్మరైజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇచ్చే కీవర్డ్స్ లేదా ఇమేజ్‌ల ఆధారంగా ‘ఏఐ మైండ్ మ్యాప్’ ఫీచర్ క్షణాల్లో ఒక స్ట్రక్చర్డ్ మ్యాప్‌ను క్రియేట్ చేసి ఇస్తుంది. దీంతోపాటు డ్రాయింగ్స్ వేయడానికి ఇష్టపడే వారి కోసం వాయిస్ లేదా పెన్ ద్వారా సాయపడే ‘ఏఐ పెయింటర్’ కూడా ఉంది.

Also Read: రూ.5 వేల బడ్జెట్‌లో శాంసంగ్ నెక్ట్స్ జనరేషన్ ఫిట్‌నెస్ ట్రాకర్.. లీకైన వివరాలు!

లెక్కల సమస్యలకు స్మార్ట్ సొల్యూషన్స్:

Advertisement

గణిత సమస్యలను పరిష్కరించడం కోసం దీనిలో ప్రత్యేకమైన ఫీచర్లను జోడించారు. స్క్రీన్‌పై ఉన్న ఏదైనా ప్రశ్న లేదా కాన్సెప్ట్‌ను సర్కిల్ చేయడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరణను అందించే ‘సర్కిల్ గో’ ఫీచర్ ఇందులో ఆకట్టుకుంటుంది. వీటితో పాటు చేతిరాతతో రాసే ఈక్వేషన్లను గుర్తించి, జియోమెట్రీ సమస్యలను సాల్వ్ చేసే ‘కాల్‌కులేటర్ ప్రో’ కూడా ఉంది. ఒక భాష నుంచి మరో భాషలోకి రియల్ టైమ్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తూ సబ్‌టైటిల్స్ ఇచ్చే లైవ్ సబ్‌టైటిల్ ఫీచర్ కూడా దీని సొంతం.

అందుబాటులోకి ఎప్పుడంటే?

వ్యూసోనిక్ కంపెనీ ఈ సరికొత్త వ్యూబోర్డ్ 4K డిస్‌ప్లేలను తమ అధికారిక విద్యా విక్రయదారులు, భాగస్వాముల ద్వారా త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, ఈ వేరియంట్ల ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల రూపురేఖలను మార్చడంలో ఈ డిస్‌ప్లేలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.

Also Read: అదిరిపోయే లుక్స్.. అల్టిమేట్ ఫీచర్స్.. Huawei Nova 16 Pro వచ్చేసింది.. ధర ఎంతంటే?

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×