Best Gaming Consoles: గేమింగ్ ప్రపంచం ఇప్పుడు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు గేమ్ అంటే కేవలం టైమ్ పాస్‌గా భావించేవారు, కానీ నేటి AAA గేమ్స్ విజువల్ క్వాలిటీ, గ్రాఫిక్స్, సౌండ్, స్టోరీటెల్లింగ్ అన్నీ కలిపి ఒక సినిమా స్థాయి అనుభవం ఇస్తున్నాయి. ఇలాంటి గేమ్స్‌ని ఫుల్ సెట్టింగ్స్‌లో, లాగ్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడాలంటే గేమింగ్ కన్సోల్‌నే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. కారణం సింపుల్, సిస్టమ్‌లు స్పెషల్‌గా ఆప్టిమైజ్ చేసిన హార్డ్‌వేర్‌పై రన్ అవుతాయి కాబట్టి, గేమ్ ఏ డివైస్‌కు ఎలా పర్‌ఫార్మ్ అవుతుందో గేమ్ రూపొందించే టీమ్ ముందే ప్లాన్ చేస్తారు. దీంతో స్మూత్ గేమ్‌ప్లే, స్టెబిలిటీ, హై గ్రాఫిక్స్ అన్నీ పర్‌ఫెక్ట్ అవుతాయి. ఇంకా ఇన్‌స్టాలేషన్ సింపుల్, అప్‌డేట్స్ ఆటోమేటిక్, గేమ్ ఓపెన్ చేసిన క్షణంలోనే ఫన్ మొదలైపోతుంది. ఇండియాలో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ గేమింగ్ గేమింగ్ డివైస్‌ల వివరాలు చూద్దాం.
సోనీ ప్లే స్టేషన్ 5 – (Sony PlayStation 5)
ఇండియాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న టాప్ 10 గేమింగ్ కన్సోల్‌ల జాబితాలో సోనీ ప్లే స్టేషన్ 5 (Sony PlayStation 5) ముందు వరుసలో ఉంది. ఇది అత్యంత శక్తివంతమైన కొత్తతరం గ్రాఫిక్స్, వేగవంతమైన ఎస్ఎస్‌డి స్టోరేజ్, 4కె సపోర్ట్‌తో అద్భుతమైన గేమింగ్ అనుభూతిని ఇస్తుంది. డిజిటల్ ఎడిషన్ ధర సుమారు రూ.43500, స్లిమ్ వెర్షన్ సుమారు రూ.49990 అందుబాటులో ఉంది
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ (Microsoft Xbox Series X)
సోనీ ప్లే స్టేషన్ తరువాత మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ (Microsoft Xbox Series X) నిలుస్తుంది. ఇది అధిక ఎఫ్‌పిఎస్, 4కె గ్రాఫిక్స్, సమర్థవంతమైన కూలింగ్ వ్యవస్థ, నిశ్శబ్ద ఆపరేషన్, ఇంకా పెద్ద ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ లైబ్రరీతో ఆకట్టుకుంటుంది. ఈ కన్సోల్ పాత ఎక్స్‌బాక్స్ గేమ్‌లను కూడా ప్లే చేస్తుంది.దీని ధర సుమారు రూ. 55990తో అందుబాటులో ఉంది.
ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ (Xbox Series S)
బడ్జెట్‌కు సరిపోయే ఎంపిక కోసం చూస్తున్న వారికి, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ (Xbox Series S) ఒక మంచి డిజిటల్ సిస్టమ్. ఇది కాంపాక్ట్ డిజైన్‌లో వచ్చి, సాధారణ గేమింగ్‌కు కూడా సరిపోతుంది. అలాగే, సోనీ ప్లేస్టేషన్ 4 స్లిమ్ (PS4 Slim) పాతదైనప్పటికీ, తక్కువ ధరలో పెద్ద గేమ్‌ల కలెక్షన్‌ను, స్థిరమైన పనితీరును అందిస్తుంది. దీని ధర సుమారు రూ.35990.
నింటెండో స్విచ్ (Nintendo Switch Standard)
పోర్టబుల్ గేమింగ్ అంటే నింటెండో స్విచ్ (Nintendo Switch Standard) ఓఎల్‌ఈడీని తప్పక చెప్పాలి. దీని ధర సుమారు రూ.30000. ఓఎల్‌ఈడీ స్క్రీన్ కారణంగా కలర్స్, అనిమేషన్స్ అద్భుతంగా కనిపిస్తాయి. అదే బ్రాండ్‌లోని నింటెండో స్విచ్ లైట్ సుమారు రూ.18000 ధరలో లభిస్తుంది, ఇది పూర్తిగా హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కోసం రూపొందించబడింది. మరింత అడ్వాన్స్‌డ్ హ్యాండ్ హెల్డ్ ఆప్షన్‌గా వాల్వ్ స్టీమ్ డెక్ (Valve Steam Deck) ఉంది. దీనిలో పిసి AAA గేమ్స్‌ని సులభంగా రన్ చేయవచ్చు. ధర సుమారు రూ.39990.
ట్రిముయ్ స్మార్ట్ ప్రో కన్సోల్ (Trimui Smart Pro)
చివరగా, చాలా తక్కువ ధరలో సాధారణ గేమింగ్ కోసం, ట్రిముయ్ స్మార్ట్ ప్రో కన్సోల్ (Trimui Smart Pro), వంటి చిన్న సిస్టమ్‌లు కూడా మంచి ఎంపిక. వీటి ధర సుమారు రూ.5000 లోపే ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీ ఫన్ కోసం వైర్‌లెస్ హెచ్‌డిఎంఐ ప్లగ్-అండ్-ప్లే (Wireless Plug-and-Play Console) కన్సోల్‌లు రూ.1000 నుంచి రూ.5000 మధ్య దొరుకుతాయి. క్లాసిక్ ఆర్కేడ్ గేమ్స్ కోసం ఇవి చాలా సరదాగా ఉంటాయి. గేమింగ్ సిస్టమ్స్‌లు తక్కువ ధరలో స్మూత్ పర్‌ఫార్మెన్స్, ఈజీ సెటప్, స్టేబుల్ గేమ్‌ప్లేతో పిసి కంటే మంచి అనుభవం ఇస్తాయి. మీ బడ్జెట్‌కు, మీ గేమ్ స్టైల్‌కు ఏది సరిపోతుందో ఎంచుకుంటే చాలు గేమింగ్ ప్రపంచం మీ చేతుల్లోకి వస్తుంది.