E-Paper
Advertisement

స్మోక్-ఫ్రీ కిచెన్ కావాలా? 2026లో మీరు కొనాల్సిన టాప్ 10 చిమ్నీ బ్రాండ్లు ఇవే!

స్మోక్-ఫ్రీ కిచెన్ కావాలా? 2026లో మీరు కొనాల్సిన టాప్ 10 చిమ్నీ బ్రాండ్లు ఇవే!
Advertisement

Top 10 Chimney Brands In India: ఈ రోజుల్లో మోడ్యులర్ కిచెన్ అంటే కేవలం స్టైల్ మాత్రమే కాదు.. అదొక అవసరం. ముఖ్యంగా మనం రోజూ తయారు చేసే వంటల్లో నూనె, మసాలాలు ఎక్కువే. వీటి వల్ల వచ్చే  జిడ్డు, పొగ గోడలకు పట్టేస్తుందా? మీ వంటగది చిరాగ్గా కనిపిస్తోందా? అయితే మీకు కావాల్సింది ఒక పవర్‌ఫుల్ కిచెన్ చిమ్నీ. ప్రస్తుతం జనం కేవలం అందమైన లుక్ ఉంటే సరిపోదు అంటున్నారు. శ్రమ తగ్గించే ‘ఆటో-క్లీన్’ ,మెయింటెనెన్స్ లేని ‘ఫిల్టర్-లెస్’ టెక్నాలజీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి మీ బడ్జెట్‌కు సరిపోయేలా, తక్కువ శబ్దంతో పనిచేసే టాప్ 10 చిమ్నీ బ్రాండ్లు ఏవి? వాటి ధరలు ఎంత? మీ ఇంటికి ఏది పర్ఫెక్ట్? వంటి విషయాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. Faber (ఫేబర్):
ప్రస్తుతం మార్కెట్లో ఫేబర్ చిమ్నీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి 3D సక్షన్ టెక్నాలజీ, తక్కువ సౌండ్2తో పనిచేసే మోటార్లు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటాయి.

Advertisement

2. Elica (ఎలికా):
స్టైలిష్ డిజైన్, గెస్టర్ కంట్రోల్ (చేతి కదలికలతో పనిచేసే) ఫీచర్లలో.. ఎలికా దిట్ట. వీటి మోడల్స్ కూడా చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటాయి.

3. Hindware (హింద్‌వేర్):
బడ్జెట్ ధరలోనే  మంచి క్వాలిటీ కోరుకునే వారికి హింద్‌వేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం వీరి ‘Nadia’ సిరీస్ చిమ్నీలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

Advertisement

4. Glen (గ్లెన్):
గ్లెన్ బ్రాండ్ చిమ్నీలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఈజీగా శుభ్రం చేసుకోగలిగే ఫిల్టర్-లెస్ టెక్నాలజీని కలిగి ఉంటాయి.

5. Kaff (కాఫ్):
ప్రీమియం కిచెన్ లుక్ కోరుకునే వారు కాఫ్ బ్రాండ్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో ఉండే అడ్వాన్స్‌డ్ ఆటో-క్లీన్ ఫీచర్ మెయింటెనెన్స్‌ను తగ్గిస్తుంది.

6. Prestige (ప్రెస్టీజ్):
నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ కలిగిన బ్రాండ్ ఇది. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో వివిధ ప్రెస్టీజ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

7. Sunflame (సన్‌ఫ్లేమ్):
దశాబ్దాలుగా నమ్మకానికి మారు పేరుగా ఉన్న సన్‌ఫ్లేమ్, ఇప్పుడు లేటెస్ట్ టచ్ కంట్రోల్ ఫీచర్లతో కొత్త మోడల్స్ విడుదల చేస్తోంది.

8. Bosch (బాష్):
జర్మన్ టెక్నాలజీతో రూపొందే బాష్ చిమ్నీలు చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.

9. Kutchina (కుచ్చినా):
ఆటో-క్లీన్ టెక్నాలజీని ఇండియాకు పరిచయం చేసిన ఘనత వీరిదే. ఈ బ్రాండ్ సౌత్ ఇండియాలో అత్యంత పాపులర్.

10. Whirlpool (వర్ల్‌పూల్):
వీటి 6th Sense టెక్నాలజీ వంటలోని పొగను బట్టి సక్షన్ పవర్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది.

Also Read: ఏసీల జాతర! ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై 45% పైగా డిస్కౌంట్, వెంటనే కొనేయండి

చిమ్నీ కొనేటప్పుడు గమనించాల్సిన 3 ముఖ్య విషయాలు:
పవర్: కనీసం 1200 m³/hr సక్షన్ పవర్ ఉండాలి.

ఆటో-క్లీన్: మాన్యువల్ క్లీనింగ్ శ్రమ లేకుండా ఉండేందుకు థర్మల్ ఆటో-క్లీన్ ఫీచర్ ఉంటే బెటర్.

సైజ్: మీ స్టవ్ 2-3 బర్నర్లు ఉంటే.. 60 సెం.మీ, 4 అంతకంటే ఎక్కువ ఉంటే.. 90 సెం.మీ చిమ్నీ తీసుకోండి.

గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×