E-Paper
Advertisement

కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు.. ఫోన్‌తో కంట్రోల్ చేసే 5 బెస్ట్ 9kg వాషింగ్ మెషీన్లు!

కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు.. ఫోన్‌తో కంట్రోల్ చేసే 5 బెస్ట్ 9kg వాషింగ్ మెషీన్లు!
Advertisement

Smart Washing Machines: ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువుల ఎంపికలో వాషింగ్ మెషీన్ల పాత్ర ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబాలకు 9 కేజీల సామర్థ్యం గల వాషింగ్ మెషీన్లు చక్కగా సరిపోతాయి. టెక్నాలజీ పెరిగిన నేటి రోజుల్లో.. కేవలం బట్టలు ఉతకడమే కాకుండా.. స్మార్ట్‌ ఫోన్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా.. అలాగే కరెంట్ బిల్లును భారీగా.. తగ్గించే ఇన్వర్టర్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లోకి వచ్చాయి. అలాంటి టాప్ రేటింగ్ పొందిన ఐదు బెస్ట్ 9 కేజీల స్మార్ట్ వాషింగ్ మెషీన్ల పూర్తి వివరాలు, వాటి ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

శామ్‌సంగ్ 9 కేజీ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ ఫ్రంట్ లోడ్:
శామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ ప్రీమియం లుక్‌తో పాటు.. అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఉన్న ‘ఏఐ ఎకోబబుల్’ టెక్నాలజీ డిటర్జెంట్‌ను సులభంగా బబుల్స్‌గా మార్చి, బట్టల లోపలి వరకు వెళ్లి మొండి మరకలను కూడా తక్కువ ఉష్ణోగ్రత వద్దే తొలగిస్తుంది. దీనిని శామ్‌సంగ్ ‘SmartThings’ యాప్ ద్వారా ఫోన్ నుంచే.. ఆపరేట్ చేయవచ్చు. అలాగే ఇందులోని.. ఏఐ ఎనర్జీ మోడ్ కరెంట్ వినియోగాన్ని ట్రాక్ చేస్తూ కరెంట్ ఆదా చేస్తుంది. 1400 RPM స్పిన్ స్పీడ్ ఉండటం వల్ల బట్టలు చాలా వేగంగా ఆరిపోతాయి. దీని డిజిటల్ ఇన్వర్టర్ మోటార్‌పై కంపెనీ ఏకంగా 20 ఏళ్ల వారంటీని అందిస్తోంది.

Advertisement

ఎల్‌జీ 9 కేజీ 5 స్టార్ ఏఐ డైరెక్ట్ డ్రైవ్ ఫ్రంట్ లోడ్:
ఇండియన్ మార్కెట్లో ఎల్‌జీ హోమ్ అప్లయన్సెస్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మోడల్ ‘AI DD'(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ డ్రైవ్) టెక్నాలజీ వస్తుంది. ఇది కేవలం బట్టల బరువునే కాకుండా.. ఫ్యాబ్రిక్ రకాన్ని కూడా స్వయంగా గుర్తించి.. దానికి తగినట్లుగా డ్రమ్ మూవ్‌మెంట్స్‌ను సెట్ చేసుకుంటుంది. దీని వల్ల బట్టలు అస్సలు పాడవ్వవు. ఈ మెషీన్ ‘LG ThinQ’ యాప్ కనెక్టివిటీతో వస్తుంది కాబట్టి.. అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చు. ఇందులో ఉన్న.. ‘6 Motion DD’ టెక్నాలజీ, హైజీన్ స్టీమ్ వాష్ వల్ల బట్టల్లోని 99.9% బ్యాక్టీరియా, అలర్జీ కారకాలు నశిస్తాయి.

ఐఎఫ్‌బీ 9 కేజీ 5 స్టార్ ఏఐ పవర్డ్ ఫ్రంట్ లోడ్:
ఐఎఫ్‌బీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు నాణ్యతకు, మన్నికకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. ఈ 9 కేజీల సరి కొత్త మోడల్ పూర్తి ఏఐ న్యూరల్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తూ.. బట్టల రకాన్ని బట్టి వాష్ సైకిల్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. మై ఐఎఫ్‌బీ, యాప్ ద్వారా వైఫై కనెక్టివిటీతో.. నడిచే ఈ మెషీన్‌కు వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉంది. ముఖ్యంగా గట్టి నీరు ఉన్న ప్రాంతాల కోసం ఇందులో.. ప్రత్యేకంగా ‘ఆక్వా ఎనర్జీ’ ఫీచర్ ఇచ్చారు. ఇది నీటిని మెత్తబరిచి డిటర్జెంట్ బాగా కరిగేలా చేస్తుంది. దీనికి కంపెనీ 4 ఏళ్ల వారంటీని అందిస్తోంది.

Advertisement

హయ్యర్ 9 కేజీ 5 స్టార్ ఏఐ డైరెక్ట్ మోషన్ ఫ్రంట్ లోడ్:
బడ్జెట్ ధరలో.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి హయ్యర్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఇందులో.. డైరెక్ట్ మోషన్ మోటార్ అమర్చడం వల్ల బెల్ట్ సహాయం లేకుండా డ్రమ్ నేరుగా తిరుగుతుంది. ఫలితంగా శబ్దం, వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. వైఫై కనెక్టివిటీ , స్మార్ట్ యాప్ ద్వారా వాష్ సైకిల్స్ అప్‌డేట్లను కస్టమర్లలు నేరుగా ఫోన్‌లోనే పొందవచ్చు. ఇందులో 525mm పెద్ద డ్రమ్ ఉండటం వల్ల బట్టలు బాగా నాని, శుభ్రంగా ఉతుకబడతాయి. అలాగే.. యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ డ్రమ్‌లో ఎలాంటి ఫంగస్ లేదా దుర్వాసన చేరకుండా కాపాడుతుంది.

బాష్ 9 కేజీ 5 స్టార్ ఎకోసైలెన్స్ డ్రైవ్ ఫ్రంట్ లోడ్:
జర్మన్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో రూపొందిన బాష్ వాషింగ్ మెషీన్లు వాటి లాంగ్ లైఫ్ పర్ఫార్మెన్స్‌కు ప్రసిద్ధి చెందాయి. ఈ మోడల్‌లోని ‘EcoSilence Drive’ ఇన్వర్టర్ మోటార్ చాలా నిశ్శబ్దంగా.. తక్కువ కరెంట్ తో పని చేస్తుంది. హోమ్ కనెక్ట్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ మెషీన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. సెట్టింగ్స్ మార్చవచ్చు. ఇందులో ఉన్న యాంటీ స్టెయిన్ ఫీచర్ ద్వారా టీ, కాఫీ, రక్తం వంటి 4 రకాల కఠినమైన మరకలను సింపుల్‌గా తొలగించవచ్చు. దీని యాంటీ వైబ్రేషన్ డిజైన్ మెషీన్ హై-స్పీడ్‌లో తిరుగుతున్నప్పుడు కూడా కదలకుండా స్థిరంగా ఉంచుతుంది.

Also Read: మీ ఆరోగ్యానికి గ్యారెంటీ.. 5 బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ లిస్ట్ మీకోసం!

స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ యుగంలో యాప్ కనెక్టివిటీ.. ఏఐ ఫీచర్లు ఉన్న వాషింగ్ మెషీన్లను ఎంచుకోవడం వల్ల సమయం, నీరు ,శ్రమ చాలా వరకు ఆదా అవుతాయి. పైన పేర్కొన్న శామ్‌సంగ్, ఎల్‌జీ, ఐఎఫ్‌బీ, హయ్యర్ , బాష్ కంపెనీల 9 కేజీల మోడల్స్ అన్నీ కూడా 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తూ.. కరెంట్ బిల్లు భారం పడకుండా చూస్తాయి. మీ బడ్జెట్, వారంటీ కాలపరిమితి, బ్రాండ్ ప్రాధాన్యతను బట్టి వీటిలో ఒకదానిని మీ ఇంటి అవసరాల కోసం నిర్భయంగా ఎంచుకోవచ్చు.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×