Samyukta Menon : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ‘భీమ్లా నాయక్’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్, ‘బింబిసార’, ‘విరూపాక్ష’సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఈమె చేస్తున్న ప్రతి సినిమా కూడా ఆమెకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని తీసుకొచ్చాయి.. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ జనాలను ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రమైన బ్లాక్ గోల్డ్ మూవీలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇదిలా ఉండదా ఈమె సీక్రెట్ టాటూ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆ టాటూ కి అసలు అర్థం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆ టాటూ ని సంయుక్త ఎందుకు వేయించుకుందో అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం..
సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లు స్పెషల్ గా ఉండేలా టాటూ లను వేయించుకుంటూ వస్తున్నారు.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తో ఉన్న ప్రతి హీరోయిన్ ఏదో ఒక ప్లేస్ లో టాటూ వేయించుకుంటున్నారు.. ఈ మధ్య హీరోయిన్ల టాటూలు ట్రెండింగ్ లో ఉన్నాయన్న విషయం తెలిసిందే.. తాజాగా మరో మలయాళ ముద్దుగుమ్మ టాటూ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ సంయుక్త మీనన్ వెనకాల లెఫ్ట్ సైడ్ షోల్డర్ కి కింద టాటూ ని వేయించుకున్నారు.. అది మలయాళంలో ఉంటుంది.. దానికి అర్థం సంచారి.. సంయుక్త మీద ఒంటరిగా ట్రావెల్ చేయాలని కోరుకుంటుదట.. అందుకే ఆమె ఆ టాటును వేయించుకుంది.. దానికి మీనింగ్ కరెక్ట్ గా సెట్ చేయాలని ఈ అమ్ముడు ఒంటరిగా ట్రావెల్ చేస్తూ వస్తుంది.. ఈమె కాదు ఇలా చాలామంది డిఫరెంట్ మీనింగ్ వచ్చేలా టాటూ లను వేయించుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.. సంయుక్త మీనన్ టాటూ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
2016లో మలయాళ చిత్రమైన ‘పాప్‌కార్న్’ ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ తర్వాత 2018 లో కలరి అనే మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం 2022లో పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ ద్వారా జరిగింది… ఆ తర్వాత తెలుగులో వరుసగా హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది.. ఈమె ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు అరుడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వరుసగా హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ మలయాళం ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బ్లాక్ గోల్డ్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది..