Best window AC under 30000: మార్చి, ఏప్రిల్ నెలలు వచ్చాయంటే.. చాలు ఎండలు మండిపోతుంటాయి. ఇంట్లో ఫ్యాన్ వేసినా కూడా వేడి గాలి వస్తూ ఉక్కపోతతో.. ప్రాణం విలవిలలాడుతుంది. ఇలాంటి టైంలో ఇంట్లో ఒక ఏసీ ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. అయితే.. చాలా మంది స్ప్లిట్ ఏసీల కంటే తక్కువ బడ్జెట్‌లో వచ్చే విండో ఏసీలను కొనడానికి ఇష్టపడతారు. మీరు కూడా రూ. 30,000 లోపు మంచి బ్రాండెడ్ విండో ఏసీ కోసం చూస్తున్నట్లయితే.. మీకోసం ఒక సూపర్ లిస్ట్. మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న టాప్ 5 విండో ఏసీల వివరాలు, వాటి ఫీచర్లు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాప్ 5 విండో ఏసీల వివరాలు:
రూ. 30,000 లోపు టాప్ 5 విండో ఏసీల లిస్ట్మనం ఏసీ కొనేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది కాపర్ కాయిల్ (Copper Condenser Coil) ఉందా లేదా అని. కాపర్ కాయిల్ ఉంటే. ఏసీ ఎక్కువ కాలం మన్నుతుంది. రిపేర్లు కూడా రావు. కింద ఇచ్చిన 5 ఏసీలు కూడా 100% కాపర్ కాయిల్ తో వచ్చేవే.
1. Voltas 1.5 Ton 5 Star Window AC (185 LZH): ఇండియాలో ఏసీ అనగానే అందరికీ గుర్తొచ్చే బ్రాండ్ వోల్టాస్. టాప్ కూలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఏసీ ఇది.
ఫీచర్లు: ఇది 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది. ఇందులో టర్బో కూలింగ్ ఫీచర్ ఉంది. ఇది గదిని చాలా వేగంగా చల్లబరుస్తుంది.
ధర: దీని ధర సుమారుగా రూ. 26,890 వరకు ఉంటుంది. రూ. 30 వేల లోపు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.
2. Lloyd 1.5 Ton 5 Star Window AC (LW19B52EW):
లాయిడ్ బ్రాండ్ ఏసీలు ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యాయి. తక్కువ ధరలో ప్రీమియం లుక్, బెస్ట్ క్వాలిటీని ఇవి అందిస్తాయి. ఫీచర్లు: ఇది కూడా 5 స్టార్ రేటింగ్ ఏసీ. రాపిడ్ కూలింగ్ మోడ్ వల్ల ఆన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే గది ఐస్ లాగా అయిపోతుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది.
ధర: మార్కెట్లో దీని ధర రూ.26,350 ఉంది.
3. Blue Star 1.5 Ton 3 Star Window AC (WFD318P):ప్రీమియం కూలింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి బ్లూ స్టార్ బెస్ట్ ఛాయిస్.
ఫీచర్లు: ఇది 3 స్టార్ రేటింగ్ ఏసీ. ఇందులో యాంటీ-కరోసివ్ బ్లూ ఫిన్స్ టెక్నాలజీ ఉంది. దీని వల్ల తుప్పు పట్టకుండా ఏసీ లైఫ్ పెరుగుతుంది. హ్యుమిడిటీ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది.
ధర: ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ మార్కెట్లలో దీని ధర రూ. 28,694 గా ఉంది.
4.Godrej 1.5 Ton 3 Star Window AC: గోద్రెజ్ కంపెనీ హోమ్ అప్లయన్సెస్ లో ఎంత నమ్మకమైందో మనకు తెలిసిందే. ఫీచర్లు: ఇది 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో హైడ్రోఫిలిక్ బ్లూ ఫిన్స్, యాంటీ-ఫ్రీజ్ సెన్సింగ్ టెక్నాలజీ ఉంది. చిన్న, మీడియం సైజ్ రూమ్స్ కి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
ధర: దీని లేటెస్ట్ ధర రూ. 26,400 ఉంది.
Also Read: ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..
5. Candy 1.5 Ton 3 Star Window AC: మీకు బడ్జెట్ ఇంకా తక్కువలో అయిపోవాలి, ఫీచర్లు బాగుండాలి అనుకుంటే ‘క్యాండీ’ బ్రాండ్ వైపు చూడొచ్చు.
ఫీచర్లు: ఇది 3 స్టార్ ఎనర్జీ రేటింగ్, కాపర్ కండెన్సర్ తో వస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్ ఉంటుంది. ఇది గదిలోని గాలిని క్లీన్‌గా ఉంచుతుంది. కంపెనీ దీని కంప్రెసర్ పై మంచి వారంటీ ఇస్తోంది.
ధర: దీని ధర రూ. 26,990 ఉంటుంది.
మీ రూమ్ సైజ్ మీడియం (సుమారు 110 నుంచి 150 చదరపు అడుగులు) ఉండి, బడ్జెట్ రూ. 30వేల లోపు ఉంటే ఈ విండో ఏసీలు అద్భుతంగా పని చేస్తాయి. మీరు కరెంట్ బిల్లు ఇంకా తక్కువ రావాలి అనుకుంటే Voltas లేదా Lloyd వారి 5 స్టార్ ఏసీలను ఎంచుకోవడం చాలా మంచిది. ఆన్‌లైన్ సేల్స్ లేదా బ్యాంక్ ఆఫర్స్ ఉన్నప్పుడు కొంటే ఇవి మీకు ఇంకాస్త తక్కువ ధరకే దొరికే అవకాశం ఉంది.