E-Paper
Advertisement

Automatic Curry Makers: ఏఐ స్మార్ట్ కుక్కర్లు.. పచ్చి కూరగాయలు వేస్తే చాలు.. మధురంగా వండేస్తాయ్!

Automatic Curry Makers: ఏఐ స్మార్ట్ కుక్కర్లు.. పచ్చి కూరగాయలు వేస్తే చాలు.. మధురంగా వండేస్తాయ్!
Advertisement

Automatic Curry Makers: భారతీయ వంటకాలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాటి రుచిని మరింత పెంచే చాలా రకాల స్మార్ట్ కుకింగ్ ఎలక్ట్రిక్ పరికరాలు మార్కెట్ లో చాలానే అందుబాటులో వచ్చాయి. అయితే వాటి మీద వంట చేయాలంటే తప్పనిసరిగా ఒక మనిషి అంటిపెట్టుకునే ఉండాల్సిందే. అయితే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కుకింగ్ పరికరాల్లోనూ అడ్వాన్స్డ్ మోడల్స్ వచ్చేశాయి. ఒకసారి వాటి లోపల కూరగాయాలు వేస్తే.. తామంతట అవే కోరుకున్న వంటను చకచకా చేసేస్తాయి. ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న టాప్ – 4 ఆటోమేటిక్ కర్రీ మేకర్ బ్రాండ్స్, వాటి ఫీచర్లు, ధర వివరాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

వండర్‌చెఫ్ షెఫ్ మ్యాజిక్ (Wonderchef Chef Magic)

ఇది కేవలం కర్రీ మేకర్ మాత్రమే కాదు. ఒక పూర్తి స్థాయి కిచెన్ రోబోగా చెప్పవచ్చు. ప్రముఖ షెఫ్ సంజీవ్ కపూర్ దీనికి రూపకల్పన చేశారు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 500 కంటే ఎక్కువ భారతీయ, అంతర్జాతీయ వంటకాల రెసిపీలు ప్రీ-లోడెడ్ అయి ఉంటాయి. ఇది కూరగాయలను వేయించడం (Sautéing), ఉడికించడం, కలపడం వంటి పనులన్నీ దానంతట అదే చేసుకుంటుంది. స్మార్ట్ టచ్ స్క్రీన్ ద్వారా మీరు కోరుకున్న ప్రీ లోడెడ్ రెసీపిని ఎంచుకోవచ్చు. దీనిని కొనుగోలు చేయడం వల్ల వంట చేసేటప్పుడు మనం పక్కనే ఉండాల్సిన అవసరం తప్పుతుంది. ఇది వంటకు సంబంధించిన ప్రతీ స్టేజ్ ను వాయిస్ రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారికి, కొత్తగా కుకింగ్ నేర్చుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. మార్కెట్ లో దీని ధర సుమారు రూ.50,000 నుంచి రూ.60,000 వరకూ ఉంది.

గీక్ రోబోకుక్ (Geek Robocook)

Advertisement

ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ విభాగంలో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. ఇది 11-ఇన్-1 మల్టీ ఫంక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో కూరలు (Curries), పప్పు, బిర్యానీ, పొంగల్ వంటి వంటకాల కోసం ప్రత్యేకమైన ప్రీ-సెట్ మెనూలు అందించారు. ‘అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామబుల్ ఇంటెలిజెంట్ కంట్రోల్’ సాంకేతికతతో ఇది ఆహారంలోని పోషకాలను కోల్పోకుండా వండుతుంది. ఇది సాధారణ ప్రెజర్ కుక్కర్ కంటే ఎంతో సురక్షితమైనది. వంట పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా ‘కీప్ వార్మ్’ (Keep Warm) మోడ్‌లోకి దానంతట అదే వెళ్తుంది. దీనివల్ల ఆహారం వేడిగానే ఉంటుంది. దీని ధర వేరియంట్ ను బట్టి రూ. 5,000 నుంచి రూ.10,000 మధ్య ఉంది.

ఫిలిప్స్ ఆల్ ఇన్ వన్ కుక్కర్ (Philips OneChef Smart Cooker)

ఫిలిప్స్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ కుక్కర్ వంటలు వండటానికి ఎంతగానో పాపులర్ అయ్యింది. కూరలు వండటానికి చాలా అనువైనది. ఇది 33 రకాల వంట పద్ధతులకు (కర్రీలు, ఉడికించడం, బేక్, స్లో కుకింగ్) సపోర్ట్ చేస్తుంది. అంబీహీట్ (AmbiHeat) టెక్నాలజీ ద్వారా వేడి సమానంగా వ్యాపించి కూరలు రుచిగా తయారవుతాయి. 6 లీటర్ల కెపాసిటీని కలిగి ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇది రూ.19,995 పలుకుతోంది.

Advertisement

Also Read: Xiaomi Book Pro 14: టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో షావోమీ కొత్త ల్యాప్‌టాప్.. పవర్‌ఫుల్ ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో ధర ఎంతంటే

ఉష కుక్-జాయ్ (Usha CookJoy Induction/Multi-Cooker)

బడ్జెట్ ధరలో మంచి కర్రీ మేకర్ కోసం చూసే వారికి ఉష బ్రాండ్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. వీరి మల్టీ-కుక్కర్లు, ఇండక్షన్ బేస్డ్ కర్రీ మేకర్లు భారతీయ వంటిళ్లకు సరిగ్గా సరిపోతాయి. ఉషా కుక్ జాయ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఇండియన్ కర్రీస్ కోసం ప్రత్యేకంగా ప్రీ-సెట్ బటన్లు అమర్చారు. ప్యాన్ సెన్సార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ వంటి భద్రతా ఫీచర్లు సైతం దీనిలో ఉన్నాయి. ఇది తక్కువ విద్యుత్తును వినియోగించడంతో పాటు వేగంగా వంట పూర్తి చేస్తుంది. పోర్టబుల్ కాబట్టి ప్రయాణాల్లో కూడా తీసుకువెళ్లవచ్చు. ఇది మార్కెట్ లో రూ.3000-6,000 మధ్యలో లభిస్తోంది.

Also Read: London: తుపుక్ తుపుక్ వ్యవహారం.. బుక్కైన ఇద్దరు భారతీయులు, ఆపై లండన్ జైలుకు

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×