E-Paper
Advertisement

Best Power Banks Feb 2026: ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే టెన్షనా? రూ.2వేల లోపే బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవిగో!

Best Power Banks Feb 2026: ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే టెన్షనా? రూ.2వేల లోపే బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవిగో!
Advertisement

Best Power Banks Feb 2026: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలావరకు మన వ్యక్తిగత విషయాలు, ఫైల్స్, ముఖ్యమైన పాస్‌వర్డ్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఫోన్‌లోనే భద్రపరుచుకుంటున్నాం. అయితే, రోజంతా ఫోన్ వాడాలంటే. .అందులో ఛార్జింగ్ ఉండాలి అన్నది అంతకంటే ముఖ్యమైన విషయం. లాంగ్ జర్నీలు చేసేవాళ్లు.. ఎక్కువగా మూవీస్, క్రికెట్, గేమ్స్ ఆడేవాళ్ల చేతిలో ఓ మంచి పవర్ బ్యాంక్ ఉండాల్సిందే. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ట్రెండింగ్‌లో ఉన్న బెస్ట్ వపర్ బ్యాంకులేవో ఇప్పుడు చూద్దాం.

Mi Power Bank 3i 

20000mAh భారీ కెపాసిటీతో వచ్చే ఈ పవర్ బ్యాంక్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. లాంగ్ జర్నీలు చేస్తున్నప్పుడు ఫోన్‌ను 4 సార్లు ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలోని ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్ట్స్ వల్ల ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది.

Ambrane Stylo 20K

Advertisement

అంబ్రేన్ స్వదేశీ బ్రాండ్ కాబట్టి.. చాలామంది దీన్ని నమ్మకంగా వాడుతారు. ముఖ్యంగా స్టైలో 20K మోడల్ బడ్జెట్ ధరలో లభిస్తూనే 22.5W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తోంది. స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ఇది మెటాలిక్ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీని ధర కూడా తక్కువే.

Also Read:

URBN Premium Nano

Advertisement

భారీ పవర్ బ్యాంకులు పట్టుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఈ పవర్ బ్యాంక్ మీ కోసమే. ఇది చాలా చిన్నగా, మన అరచేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. అయినప్పటికీ ఇది 20000mAh కెపాసిటీని కలిగి ఉంటుంది. దీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ వల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. జేబులో పెట్టుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

Spigen 3-in-1 Wireless Power Bank

వైర్ల గొడవ లేకుండా ఫోన్‌ను ఛార్జ్ చేయాలనుకునే వారికి స్పిగెన్ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. 10000mAh కెపాసిటీ కలిగి ఉన్న ఇది వైర్లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ ఫోన్లు లేదా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్లు వాడేవారికి ఇది బెస్ట్ టెక్ గ్యాడ్జెట్.

Portronics Luxcell Uno

పోర్ట్రోనిక్స్ బ్రాండ్ ఎప్పుడూ వినూత్నమైన డిజైన్లతోనే వస్తుంది. ఈ మోడల్ చూడటానికి చాలా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఉండి, లోపలి సర్క్యూట్లు కనిపిస్తూ చాలా కూల్‌గా ఉంటుంది. ఇది 10000mAh సామర్థ్యంతో వస్తుంది. చూడగానే అందరినీ ఆకట్టుకునే డిజైన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

boAt EnergyShroom PB300

బోట్ బ్రాండ్ ఇప్పుడు చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. ఈ పవర్ బ్యాంక్ 10000mAh కెపాసిటీతో స్లిమ్‌గా ఉంటుంది. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ చేసే ఈ గ్యాడ్జెట్‌ ట్రావెలింగ్ సమయంలో బ్యాగులో ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు. మీకు బిగ్ బ్యాటరీ కావాలనుకుంటే.. షావోమీ లేదా అంబ్రేన్ ఎంచుకోవడం ఉత్తమం.

Also Read: వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో తిరిగి పొందండిలా!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×