E-Paper
Advertisement

Whatsapp Chat: వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో తిరిగి పొందండిలా!

Whatsapp Chat: వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో తిరిగి పొందండిలా!
Advertisement

Whatsapp Chat: నిజం చెప్పాలంటే.. ఈ రోజుల్లో వాట్సాప్ లేనిదే మన రోజు పూర్తవ్వదు. ఎందుకంటే వాట్సప్ అనేది కేవలం మెసేజ్‌లు పంపుకునే యాప్ మాత్రమే కాదు.. మన పర్సనల్ విషయాలు, ఆఫీస్ ఫైల్స్, ఇంపార్టెంట్ డేటా అంతా దాచుకునే ఒక డిజిటల్ లాకర్ అయిపోయింది. అలాంటి వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా ఇంపార్టెంట్ చాట్ డిలీట్ అయిందంటే.. గుండె ఆగినంత పనవుతుంది. అయితే, కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కాస్త ఓపికగా కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఆ మెసేజ్‌లను తిరిగి తెచ్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

క్లౌడ్ బ్యాకప్ ద్వారా రికవరీ:

మీ వాట్సప్‌లో Auto Backup ఆప్షన్ ముందే ఆన్ చేసి ఉంటే.. మీ చాట్ 100% రికవరీ అయినట్టే. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లు గూగుల్ డ్రైవ్‌లో, ఐఫోన్ వాడేవాళ్లు ఐక్లౌడ్‌లో డేటాను సేవ్ చేసుకోవచ్చు. మీ మెసేజ్‌లు పోయాయని తెలిసినప్పుడు.. ముందుగా ఫోన్ నుండి వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. మళ్లీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసి, మీ ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. ఆ ప్రాసెస్‌లో మీకు Restore అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు, కొద్ది నిమిషాల్లోనే మీ పాత చాట్స్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి.. చాట్ డిలీట్ అయిన తర్వాత మళ్లీ కొత్తగా బ్యాకప్ క్రియేట్ అయితే మాత్రం పాత మెసేజ్‌లు తిరిగి రావు.

Advertisement

Also Read: రూ.12,600కే 50MP కెమెరా, భారీ బ్యాటరీ.. హానర్ నుంచి కొత్త 5G ఫోన్ విడుదల!

లోకల్ బ్యాకప్ పద్ధతి:

చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోయినా మన ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రతిరోజూ లోకల్ బ్యాకప్‌ను క్రియేట్ చేసుకుంటాయి. గూగుల్ డ్రైవ్‌లో డేటా లేనప్పుడు ఈ ప్రాసెస్ మనల్ని కాపాడుతుంది. దీనికోసం మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌కి వెళ్లి WhatsApp > Databases ఫోల్డర్‌ను ఓపెన్ చేయండి. అక్కడ డేట్స్‌తో ఉన్న ఫైల్స్ కనిపిస్తాయి. మీకు ఏ రోజు మెసేజ్‌లు కావాలో ఆ ఫైల్‌ను msgstore.db.crypt14 అని రీనేమ్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయితే, లోకల్ స్టోరేజ్ నుండి మెసేజ్‌లు రీస్టోర్ అవుతాయి.

థర్డ్ పార్టీ టూల్స్:

Advertisement

ఒకవేళ పైన చెప్పిన ఏ పద్ధతి పనిచేయకపోతే.. Dr.Fone లేదా Tenorshare వంటి సాఫ్ట్‌వేర్‌లు ట్రై చేయొచ్చు. మీ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తే, ఈ టూల్స్ ఫోన్‌ను స్కాన్ చేసి డిలీట్ అయిన డేటాను వెతికి పెడతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక.. వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం అఫీషియల్ వెబ్‌సైట్ల నుండే డౌన్‌లోడ్ చేయండి. ఎందుకంటే మన పర్సనల్ డేటా భద్రత మనకు ముఖ్యం కదా.. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Also Read: లావా సరికొత్త యాడ్.. మొబైల్ సర్వీస్ సెంటర్లపై అదిరిపోయే సెటైర్, నవ్వకుండా ఉండలేరు

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×