E-Paper
Advertisement

Smartphones Launching in Jan 2026: జనవరి 2026లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ ధరతో మైండ్-బ్లోయింగ్ ఫీచర్లు

Smartphones Launching in Jan 2026: జనవరి 2026లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ ధరతో మైండ్-బ్లోయింగ్ ఫీచర్లు
Advertisement

Smartphones Launching in Jan 2026: జనవరి 2026లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ బాగా హీట్ ఎక్కబోతోంది. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ నుంచి మిడ్ రేంజ్ వరకు పెద్ద బ్రాండ్స్ కొత్త ఫోన్ల‌లను తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్, రెడ్‌మి నోట్ 15 సిరీస్, ఒప్పో రెనో 15 ప్రో లాంటి మోడల్స్ ముందే భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి ఫీచర్స్ మాత్రమే కాదు, అంచనా ధరలు కూడా చూస్తే కొనాలా వద్దా అనే డిసిషన్ స్పష్టంగా తీసుకోవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్ (Samsung Galaxy S26 series)

Advertisement

ముందుగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో ఎస్ 26, ఎస్ 26 ప్లస్, ఎస్ 26 అల్ట్రా అనే 3 మోడల్స్ వస్తాయని సమాచారం. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 మోడల్ 6.3 అంగుళాల ఓఎల్ఈడి డిస్‌ప్లే‌తో రావచ్చని అంటున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 లేదా ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ ఈ ఫోన్‌కు పవర్ ఇస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వరకు ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు 12 ఎంపి సెల్ఫీ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చు. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయితే అంచనా ధర 75,000 నుండి 80,000 రూపాయల మధ్య ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ (Samsung Galaxy S26 Plus)

Advertisement

ఇక శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ మోడల్ విషయానికి వస్తే, ఇది పెద్ద డిస్‌ప్లే‌తో పాటు ప్రీమియం యూజర్లకు టార్గెట్ చేసిన ఫోన్. 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ ఓఎల్ఈడి డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 లేదా ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ ఇందులో ఉండవచ్చు. ర్యామ్ 12 జీబీ, స్టోరేజ్ 512 జీబీ వరకు వస్తుందని టాక్. ఈ మోడల్ ఇండియాలో లాంచ్ అయితే అంచనా ధర 90,000 నుండి 95,000 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా (Samsung Galaxy S26 Ultra)

ఇక అసలు ఫ్లాగ్‌షిప్ మాన్‌స్టర్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా గురించి చెప్పాలంటే, ఇది మార్కెట్‌లో ప్రీమియం ఎలైట్ సెగ్మెంట్‌ను పూర్తిగా టార్గెట్ చేస్తుంది. 6.9 అంగుళాల భారీ ఓఎల్ఈడి డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. 16 జీబీ ర్యామ్, 1 టిబీ స్టోరేజ్ వరకు ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే 200ఎంపి మెయిన్ కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్‌తో రానుందని టాక్. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయితే అంచనా ధర 1,25,000 నుండి 1,35,000 రూపాయల మధ్య ఉండే ఛాన్స్ ఉంది.

Also Read: Google AI Smart Glasses: గూగుల్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. మెటాకు పోటీగా 2026లో ఎంట్రీ..

రెడ్‌మి నోట్ 15 సిరీస్ (Redmi Note 15 series)

ఇప్పుడు మిడ్ రేంజ్ కింగ్‌గా చెప్పుకునే రెడ్‌మి నోట్ 15 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 15, రెడ్‌మి నోట్ 15 ప్రో, రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ మోడల్స్ రావచ్చని సమాచారం. రెడ్‌మి నోట్ 15 మోడల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రావచ్చు. వెనుక 108ఎంపి మెయిన్ కెమెరా, 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, ఫోన్‌కి ముందు భాగంలో 20 ఎంపి సెల్ఫీ కెమెరా ఇచ్చే అవకాశం ఉంది. 5520mah బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్‌లో మొయిన్ అల్ట్రాక్షన్ కాబోతున్నాయి. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయితే అంచనా ధర 22,000 నుండి 25,000 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మి నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro)

రెడ్‌మి నోట్ 15 ప్రో మోడల్ కొంచెం అప్‌గ్రేడ్‌గా వస్తుంది. ఇందులో మంచి ప్రాసెసర్, 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 120Hz అమోలెడ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ అంచనా ధర 28,000 నుండి 32,000 రూపాయల మధ్య ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.

రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ (Redmi Note 15 Pro Plus)

ఇక రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ మోడల్ ఈ సిరీస్‌లో టాప్ వేరియంట్‌గా నిలవచ్చు. 200 ఎంపి కెమెరా, పెద్ద అమోలెడ్ డిస్‌ప్లే, స్టేబుల్ స్పీడ్, మెరుగైన ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తుందని అంచనా. దీని అంచనా ధర 35,000 నుండి 38,000 రూపాయల మధ్య ఉండవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఒప్పో రెనో 15 ప్రో (Oppo Reno 15 Pro)

ఇక ఒప్పో రెనో 15 ప్రో విషయానికి వస్తే, ఇది ప్రీమియం డిజైన్‌తో పాటు ఫోటోగ్రఫీపై ఎక్కువ ఫోకస్ చేసిన ఫోన్‌గా కనిపిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. వెనుకవైపు 200 ఎంపి మెయిన్ కెమెరా ఉండబోతోందని సమాచారం. అంతేకాదు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో పెద్ద హైలైట్. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయితే అంచనా ధర 62,000 నుండి 68,000 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది.

జనవరి 2026 అసలైన గోల్డెన్ టైమ్

మొత్తానికి జనవరి 2026లో లాంచ్ అవబోయే ఈ ఫోన్‌లు ప్రతి బడ్జెట్ యూజర్‌ని కవర్ చేస్తున్నాయి. 20,000 రూపాయల దగ్గర నుంచి 1,30,000 రూపాయల వరకు ఆప్షన్‌లు ఉండబోతున్నాయి. కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు జనవరి 2026 అసలైన గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. బ్యాటరీ, కెమెరా, స్పీడ్, అప్‌డేటెడ్ లుక్ అన్నింటిలోనూ ఈ లాంచ్‌లు మంచి హైప్ కలిగిస్తున్నాయి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×