E-Paper
Advertisement

Turbo Stove: టర్బో స్టవ్.. దీనికి గ్యాస్ అవసరం లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?

Turbo Stove: టర్బో స్టవ్.. దీనికి గ్యాస్ అవసరం లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

Turbo Stove: కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ సిలిండర్ కొరత, పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీల్లో రూమ్స్ తీసుకుని ఉండే స్టూడెంట్స్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ల పరిస్థితి అయితే మరీ దారుణం. గ్యాస్ ధరలు అమాంతం పెరగడమే కాకుండా.. సిలిండర్ దొరకడమే కష్టంగా మారిపోయింది. దీంతో చాలా చోట్ల హాస్టళ్లు, మెస్‌లు నిర్వహించలేక యజమానులు చేతులు ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్‌తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా వంట చేసుకునే ‘టర్బో స్టవ్’ గురించి జనాలు తెగ వెతికేస్తున్నారు. దీనికి సంబంధించిన రీల్ కూడా ఒకటి ఇన్‌స్టా వేదికగా వైరల్ అవుతోంది.

అసలేంటి ఈ టర్బో స్టవ్?

సాధారణంగా కట్టెల పొయ్యిలో మంట కంటే పొగే ఎక్కువగా వస్తుంటుంది. దీంతో కళ్లు మండుతాయి, గిన్నెలన్నీ నల్లగా అయిపోతాయి. కానీ ఈ టర్బో స్టవ్ కథ వేరు. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఓ యంత్రంలా పనిచేస్తుంది. దీనికి గ్యాస్ కనెక్షన్ అసలు అక్కర్లేదు. మన చుట్టు పక్కల దొరికే చిన్న చిన్న కట్టె ముక్కలు, బొగ్గులు లేదా ఎండుటాకులు వేసినా సరే.. అద్భుతంగా మండుతుంది. ఇది చాలా లైట్ వెయిట్ కాబట్టి.. మనం ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లొచ్చు.

Advertisement

Also Read: వావ్.. ఈ కూలర్ ఉంటే ఏసీతో పనే ఉండదట, అంత చల్లదనం ఎలా?

ఇదెలా పనిచేస్తుంది?

ఈ స్టవ్ వెనుక ఉన్న మెయిన్ కిటుకు ‘బ్లోయర్’ టెక్నాలజీ. దీనిలో ఒక చిన్న ఫ్యాన్ లాంటిది ఉంటుంది. దీనికి కరెంటు కావాలి కదా అని కంగారు పడక్కర్లేదు. మన మొబైల్ ఛార్జర్ లేదా ఒక పవర్ బ్యాంక్ పెడితే చాలు, ఆ ఫ్యాన్ తిరుగుతుంది. ఈ ఫ్యాన్ గాలిని లోపలికి వేగంగా పంపడం వల్ల, మనం వేసిన కట్టె ముక్కలు చాలా స్పీడ్‌గా మండుతాయి. ఆ గాలి ఒత్తిడికి మంట నీలి రంగులో, అచ్చం గ్యాస్ స్టవ్ మంటలాగే ఫోర్స్‌గా వస్తుంది. తక్కువ కట్టెలతోనే ఎక్కువ వేడి పుట్టించడం దీని స్పెషాలిటీ.

పొగ రాదు.. రూపాయి ఖర్చు లేదు:

Advertisement

ఈ స్టవ్ వాడితే పాతకాలం పొయ్యిలా పొగ రాదు. ఎందుకంటే.. ఫ్యాన్ గాలి వల్ల కట్టెలు పూర్తిగా కాలిపోతాయి కాబట్టి.. మంట క్లీన్‌గా వస్తుంది. దీనివల్ల వంట గిన్నెలు కూడా అస్సలు నల్లబడవు. నెలకు వేల రూపాయల గ్యాస్ బిల్లును ఇది ఒక్క దెబ్బతో తగ్గించేస్తుంది. చిన్న చిన్న కట్టె ముక్కలతోనే గంటల కొద్దీ వంట చేసేయొచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్లకు, హాస్టల్ నడిపే వారికి ఈ టర్బో స్టవ్ మంచి ప్రత్మామ్నాయం. పర్యావరణానికి మేలు చేస్తూనే, డబ్బులు ఖర్చు చేయకుండా వంట పూర్తి చేసుకోవడానికి ఇంత కంటే మరో మార్గం లేదనే చెప్పాలి.

Also Read: రూ.15వేల నుంచే 4K స్మార్ట్ టీవీలు.. అమెజాన్‌ సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు!

ఆ వీడియో మీరు చూసేయండి..

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×