E-Paper
Advertisement

TV Price Hike: టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జనవరిలో ధరలు పెరగబోతున్నాయ్.. త్వరపడండి

TV Price Hike: టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జనవరిలో ధరలు పెరగబోతున్నాయ్.. త్వరపడండి
Advertisement

TV Price Hike January 2026| టెలివిజన్ (టివి) అనేది భారతదేశంలోని ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉండే అత్యంత సాధారణ గృహోపకరణాలలో ఒకటి. అయితే, మరో నెల రోజుల్లో అంటే జనవరి 2026 నుంచి దేశంలో టీవీ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలలో ఎలాంటి పెరుగుదల వచ్చినా అది నేరుగా మధ్యతరగతి కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుంది. ఈ ధరల పెంపునకు రెండు ప్రధాన కారణాల ఉన్నాయి. మెమరీ చిప్‌ల కొరత పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుండగా, భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రోజురోజుకీ క్షీణిస్తోంది. ఈ రెండు సమస్యలు మీ జేబుపై నేరుగా భారం మోపనున్నాయి.

చిప్‌, కరెన్సీ: ఈ రెండు సమస్యలే కారణం

ఎలెక్ట్సానిక్స్ తయారీదారులు ప్రస్తుతం తీవ్రమైన రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెమరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో.. భారత రూపాయి విలువ కూడా తగ్గిపోతోంది. టీవీ తయారీ సంస్థలు ముఖ్యమైన భాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాయి. రూపాయి విలువ తగ్గడం తయారీ కంపెనీలు ఇప్పుడు టివిల విడి భాగాల కోసం విదేశీ కంపెనీలకు మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. ఆ భారం చివరికి వినియోగదారులపై మోపుతున్నారు.

Advertisement

Also Read: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ధరల పెంపు.. మరికొన్ని రోజుల్లో.. ఎంతంటే

ధర ఎంత పెరగవచ్చు?

నిపుణుల అంచనా ప్రకారం ధరలు స్పష్టంగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల మూడు శాతం నుండి పది శాతం వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని బ్రాండ్లు ఏడు శాతం పెరుగుదలను హెచ్చరిస్తుండగా, మరికొన్ని పది శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అయితే, సగటు పెరుగుదల మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అందుకే టీవి కొనాలనుకుంటే డిసెంబర్ 2025లోనే కొనేయండి. ఎందుకంటే జనవరిలో అదే టీవి ధర ఎక్కువ గా ఉంటుంది.

ప్రధాన సమస్య: ప్రపంచ చిప్‌ల కొరత

Advertisement

ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత తీవ్రంగా ఉంది. కృత్రిమ మేధస్సు (AI) సర్వర్‌లకు డిమాండ్ పెరగడం దీనికి ముఖ్య కారణం. ఈ సర్వర్‌లకు ప్రత్యేక హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్‌లు అవసరం. చిప్‌లను తయారుచేసే సంస్థలు ఇప్పుడు ఈ లాభదాయకమైన మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. దీని వల్ల వారు సాంప్రదాయ ఉపకరణాల కోసం చిప్‌ల సరఫరాను పట్టించుకోవడం లేదు. దీనితో, టీవీ తయారీదారులు ఇప్పుడు చిప్‌లను పొందడానికి కష్టపడుతున్నారు.

ధరల పెరుగుదల కచ్చితంగా జరుగుతుంది.. తయారీ కంపెనీలు

పరిశ్రమలోని అగ్రశ్రేణి కంపెనీ నిర్వహకులు ఈ సమస్య గురించి బహిరంగంగానే చెప్పారు. హాయర్ అప్లయన్సెస్ ఇండియా (Haier Appliances India ) ప్రెసిడెంట్ అయిన ఎన్ ఎస్ సతీష్, టీవీ ధరలలో మూడు శాతం పెరుగుదలను ధృవీకరించారు. ఈ పెరుగుదలకు చిప్ కొరత, బలహీనమైన రూపాయి విలువ కారణమని ఆయన స్పష్టం చేశారు. తయారీదారులు ఇప్పటికే తమ డీలర్ నెట్‌వర్క్‌లకు ఈ ధరల పెరుగుదల గురించి సమాచారం ఇస్తున్నారు.

మరొక కంపెనీ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ CEO అయిన అవ్నీత్ సింగ్.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరించారు. ఆయన ఏడు నుండి పది శాతం ధరల పెరుగుదలను అంచనా వేశారు. ఈ పెరుగుదల జనవరి 2026 నుంచే ప్రారంభం కావచ్చు.

మీరు చేయవలసింది ఇదే

మీరు త్వరలో టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది. జనవరిలో ధరలు కచ్చితంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్‌లో వచ్చే స్పెషల్ సేల్స్ లో మీకు ఉత్తమ డీల్స్ లభించవచ్చు. ఇప్పుడు మీరు కొనుగోలును వాయిదా వేస్తే, మీరు మూడు నుండి పది శాతం అదనపు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి త్వరగా నిర్ణయించుకోండి.

 

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×