E-Paper
Advertisement

Air Coolers Launch Mar 2026: ఏసీలు ఎందుకు దండగా.. ఈ కూలర్లు ఉండగా.. మార్చిలో క్రేజీ కూలర్లు లాంచ్!

Air Coolers Launch Mar 2026: ఏసీలు ఎందుకు దండగా.. ఈ కూలర్లు ఉండగా.. మార్చిలో క్రేజీ కూలర్లు లాంచ్!
Advertisement

Air Coolers Launch Mar 2026: దేశవ్యాప్తంగా భానుడి భగ భగలు మెుదలయ్యాయి. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని 2026 ఏడాదికి గానూ అడ్వాన్స్డ్ కూలర్లను ప్రముఖ కంపెనీ లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 మార్చి నాటికి అందుబాటులో ఉండబోయే టాప్ – 5 అధునాతన కూలర్ల గురించి ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Symphony Diet 3D 55i+ (Tower Cooler)

ఇది స్లిమ్ టవర్ డిజైన్ ను కలిగి ఉంది. బెడ్ రూమ్స్, చిన్నపాటి గదులకు సరిగ్గా సరిపోతుంది. 55 లీటర్ల సామర్థ్యం, ఆటోమేటిక్ Pop-up టచ్ స్క్రీన్, మాగ్నెటిక్ రిమోట్, i-Pure టెక్నాలజీ (గాలిని శుద్ధి చేస్తుంది), తక్కువ విద్యుత్ వినియోగం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Bajaj DMH90 Neo (Desert Cooler)

Advertisement

90 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కూలర్.. పెద్ద హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో వినియోగం కోసం అనువైనదిగా ఉంటుంది. హెక్సాకూల్ టెక్నాలజీ (Hexacool), 90 అడుగుల దూరం వరకు గాలిని ప్రసారం చేయగల సామర్థ్యం, ఐస్ ఛాంబర్, టర్బో ఫ్యాన్ టెక్నాలజీ, యాంటీ బ్యాక్టీరియల్ హనీకోంబ్ ప్యాడ్లను ఇది కలిగి ఉంది.

Crompton Optimus 65 IoT (Smart Cooler)

ఏసీ తరహాల్లో అత్యాధునిక స్మార్ట్ కూలర్ ను కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. 65 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కూలర్.. వైఫై, అలెక్సా – గూగుల్ హోమ్ వాయిస్ కంట్రోల్, తేమను తగ్గించే హ్యుమిడిటీ కంట్రోలర్ (Humidity Controller), ఉప్పునీటిలోనూ పాడవని ఎవర్లాస్ట్ పంప్, డస్ట్ ఫిల్టర్లను కలిగి ఉంది.

Havells Koolflo 48 (Personal Cooler)

Advertisement

తక్కువ బడ్జెట్ లో మంచి బ్రాండ్, లేటెస్ట్ కూలర్ ను కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. 48 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ వ్యక్తిగత కూలర్.. డ్యూయల్ ఫ్లో టెక్నాలజీతో రూపొందింది. బ్యాక్టీరియా షీల్డ్ ప్యాడ్లు, దుమ్ములోపలికి ప్రవేశించకుండే చేసే కొలాప్సిబులు లూవర్స్ ఇందులో ఉన్నాయి. అలాగే డస్ట్ ఫిల్టర్, షాక్ ప్రూఫ్ బాడీ, ఇన్వర్టర్ సపోర్ట్ టెక్నాలజీతో ఇది పనిచేయనుంది.

Also Read: Kethireddy Warns: అలా చేస్తే ఊరుకోను.. చెప్పుతో కొడతా.. వైసీపీ శ్రేణులకు కేతిరెడ్డి వార్నింగ్!

Usha Striker Electronic (Desert Cooler)

సాధారణ కూలర్లతో పోలిస్తే ఇది ఎత్తుగా ఉండి.. ఎక్కువ హైట్ వరకూ చల్లటిగాలిని ప్రసారం చేస్తుంది. LCD డిస్ప్లేతో కూడిన టచ్ ప్యానెల్, రిమోట్ కంట్రోల్, 5 క్యాస్టర్ వీల్స్ ను ఇది కలిగి ఉంది. థర్మల్ ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, ఆటో ఫిల్ సదుపాయం, మూడు వైపులా హనీకోంబ్ ప్యాడ్స్ ఈ కూలర్ లో ఉన్నాయి.

Also Read:Oppo Enco Air 5 Pro: మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో ఒప్పో కొత్త బడ్స్ లాంచ్!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×