E-Paper
Advertisement

Kethireddy Warns: అలా చేస్తే ఊరుకోను.. చెప్పుతో కొడతా.. వైసీపీ శ్రేణులకు కేతిరెడ్డి వార్నింగ్!

Kethireddy Warns: అలా చేస్తే ఊరుకోను.. చెప్పుతో కొడతా.. వైసీపీ శ్రేణులకు కేతిరెడ్డి వార్నింగ్!
Advertisement

Kethireddy Warns: వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి తీసుకునేదే లేదని తెగేసి చెప్పారు. బంధుప్రీతితో మళ్లీ పార్టీలోకి తీసుకొస్తామని కార్యకర్తలు అంటే బాగోదని హెచ్చరించారు. అలాంటి వారిని పార్టీ గేటు బయటే ఆపి చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ధర్మవరంలో వైసీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడారు. శత్రువునైనా పార్టీలోకి చేర్చుకుంటాము కానీ, వెన్నుపోటు దారులను మాత్రం క్షమించేది లేదన్నారు. పార్టీ అధికారంలో ఉండగా లబ్ది పొంది.. ఓడిపోగానే గేటు దూకేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వనని పేర్కొన్నారు. బంధుత్వం, స్నేహాన్ని అడ్డుపెట్టుకొని తిరిగి రావాలని ప్రయత్నం చేసినా కనికరించేది లేదన్నారు.

Advertisement

కష్టకాలంలో తనకూ, పార్టీకి అండగా నిలుస్తున్న ధర్మవరం వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని కేతిరెడ్డి హామీ ఇచ్చారు. జగన్ మరోమారు సీఎం కాగానే.. కార్యకర్తలకే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

Also Read: Pak Fake Judge: ఓరి మీ దుంపతెగ.. హైకోర్టును వదల్లేదు కదరా.. పాక్‌లో విచిత్ర ఘటన!

Advertisement

మరోవైపు తిరుమల కల్తీ నెయ్యి అంశంపైనా కేతిరెడ్డి మాట్లాడారు. సీబీఐ సిట్ ఏమి జరగలేదని రిపోర్టు ఇచ్చినా.. ఏదో ఉందంటూ చిల్లర రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం ఏడు కొండల వివాదంలోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు కొండలను రెండు కొండలు చేశారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని హిందు వ్యతిరేక పార్టీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: Maoist Leader Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి మిస్సింగ్.. భారత్‌లో ఉన్నారా? నేపాల్ పారిపోయారా?

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×