E-Paper
Advertisement

Upcoming Air Coolers March 2026: ఆఫీసులో కూర్చొనే ఇంట్లో కూలర్‌ను ఆపరేట్ చేయొచ్చు.. ధర కూడా తక్కువే!

Upcoming Air Coolers March 2026: ఆఫీసులో కూర్చొనే ఇంట్లో కూలర్‌ను ఆపరేట్ చేయొచ్చు.. ధర కూడా తక్కువే!
Advertisement

Upcoming Air Coolers march 2026 మార్చి నెల ఇంకా మొదలవ్వకముందే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అప్పుడే చెమటలు పట్టేస్తున్నాయి. రాబోయే ఏప్రిల్, మే నెలల పరిస్థితి తలచుకుంటేనే భయం వేస్తోంది కదూ! మరి ఈ ఉక్కపోతను తట్టుకోవాలంటే ఇంటిని చల్లగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం.

ఈ నేపథ్యంలో చాలామందికి ఏసీ కొనాలని ఆశ ఉంటుంది, కానీ దాని ధర.. ఆ తర్వాత వచ్చే కరెంట్ బిల్లు చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మార్కెట్లోకి ఏసీ రేంజ్ చల్లదనాన్నిచ్చే స్మార్ట్ ఎయిర్ కూలర్లు వచ్చేస్తున్నాయి. ఇవి కేవలం కూలింగ్‌ను ఇవ్వడమే కాదు, మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా ఉంటూ అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి.

Bajaj Shield Connect

Advertisement

ఈ బజాజ్ షీల్డ్ కనెక్ట్ కూలర్ స్పెషాలిటీ ఏంటంటే.. దీనిలో వై-ఫై సపోర్ట్ ఉంటుంది. మీరు ఆఫీసులో ఉన్నప్పుడే మీ ఫోన్ ద్వారా కూలర్‌ను ఆన్ చేసుకోవచ్చు. మీరు ఇంటికి వచ్చేసరికి రూమ్ చల్లగా ఉంటుంది. బడ్జెట్‌లో స్మార్ట్ కూలర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Symphony Diamond i-Series

సింఫనీ బ్రాండ్‌ను చాలామంది నమ్మకంగా కొంటుంటారు. ఇప్పుడొచ్చిన కొత్త మోడల్‌లో గాలిని శుద్ధి చేసే i-Pure టెక్నాలజీ ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు ఇది మంచిది. ఈ కూలర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాదు.. తక్కువ కరెంట్‌ను ఖర్చు చేస్తుంది.

Advertisement

Also Read: వీడెవడండి బాబు.. ఇంట్లో కూర్చొని 7వేల రోబోట్ వాక్యూమ్ క్లీనర్లను హ్యాక్ చేసేశాడు, ఎలాగంటే?

Crompton Optimus Neo

పెద్దగా ఉన్న హాల్‌ను కూడా త్వరగా కూల్ చేయగల సామర్థ్యం ఈ క్రాంప్టన్ ఆప్టిమస్ కూలర్‌‌కు ఉంది. ఇది చాలా వేగంగా గాలిని విసురుతుంది. దీనిలో ఆటో ఫిల్ ఫీచర్ ఉండటంతో.. నీళ్లు అయిపోగానే దానంతట అదే నింపుకుంటుంది. పదే పదే నీళ్లు పోసే తలనొప్పి ఉండదు.

Orient Electric Cloud 3

ఈ ఓరియంట్ ఎలక్ట్రిక్ క్లౌడ్ 3 కూలర్ ఒక రకమైన క్లౌడ్ చిల్లింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే.. గాలిలో తేమను తగ్గించి, ఉక్కపోత లేకుండా చల్లగా ఉంచుతుంది. ఈ కూలర్లను బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే చిన్న సౌండ్ కూడా రాదు.

Havells Celia i

ప్రీమియం లుక్ కావాలనుకునే వారికి హెవెల్స్ సెలియా కరెక్ట్. ఇది ఇన్వర్టర్ మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పవర్ పోయినా మీ కూలింగ్ మాత్రం ఆగదు. దీనికి ఉన్న స్మార్ట్ రిమోట్ ఫీచర్ మెరుగైన పనితీరు అందిస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కూలర్లన్నీ బడ్జెట్ ధరలోనే ఉంటూ, ఏసీ ఇచ్చే చల్లదనాన్ని అందించడం విశేషం అనే చెప్పాలి.

Also Read: థియేటర్ ఫీల్ కలిగించే 5 అద్భుతమైన హెడ్ ఫోన్స్.. వీటి ధర ఎంతో తెలుసా?

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×