E-Paper
Advertisement

Lunar Eclipse: వచ్చే మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం – ఆరోజు ఆ పనులు అసలు చేయకూడదట

Lunar Eclipse: వచ్చే మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం – ఆరోజు ఆ పనులు అసలు చేయకూడదట

Lunar Eclipse: ఈ సంవత్సరం (2026) మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్ర గ్రహణం రోజు ఏ జాతకులు ఎలా ఉండాలి ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు పండితులు వివరిస్తున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకటవ సంఖ్యా జాతకులు:  

ఏ నెలలో అయినా ఒకటి, పది, పందొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వ్యక్తులు ఒకటవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: చంద్రగ్రహణం రోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. గాయత్రి లేదా ఆదిత్య హృదయం జపం చేసుకోవాలి.

చేయకూడని పనులు: చంద్రగ్రహణం రోజు ఒకటవ నెంబర్‌ జాతకులు ఎవరితోనూ గొడవలు పడకూడదు. కోపం తెచ్చుకోకూడదు. ఆహంకారం వదిలేయాలి. మౌనంగా ఉండటం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.

రెండవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వ్యక్తులు రెండవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: వీళ్లు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేయాలి. తర్వాత ఓం చందరమసే నమః అనే మంత్రాన్ని వీలైనని సార్లు జనం చేయాలట. అలాగే ధ్యానం కూడా చేసుకోవాలట. నీరు ఎక్కువగా తాగాలని పండితులు సూచిస్తున్నారు.

చేయకూడని పనులు: కుటుంబంతో వాదనలు చేయకూడదు. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకూడదట.

మూడవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా మూడు, పన్నెండు, ఇరవై ఒకటి, ముఫ్పై తేదీలలో పుట్టిన వ్యక్తులు మూడవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: చంద్రగ్రహణం రోజు ఈ జాతకులు ఆహారం దానం చేయాలట. గురు లేదా విష్ణు దేవుడికి సంబంధించిన ప్రార్థనలు చేయాలట.

చేయకూడని పనులు: కోపం, గర్వం తగ్గించుకోవాలట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదట.

నాలుగవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా నాలుగు, పదమూడు, ఇరవై రెండు, ముప్పై ఒకటి తేదీలలో పుట్టిన వ్యక్తులు నాలుగవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: చంద్రగ్రహణం రోజు ఈ సంఖ్య జాతకులు ఎక్కువగా నీళ్లు తాగాలట. అలాగే ధ్యానం చేయాలట. లేదంటే ప్రాణాయామం చేయాలట.

చేయకూడని పనులు: చంద్రగ్రహణం రోజు ఈ జాతకులు తెల్లటి బట్టలు ధరించకూడదట. ఒత్తిడిలో ఉంటే కీలక నిర్ణయాలు తీసుకోకూడదట.

ఐదవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు తేదీలలో పుట్టిన వ్యక్తులు ఐదవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: ఈ జాతకులు చంద్రగ్రహణం రోజు పుస్తక పఠనం చేయాలట. మంత్రజపం చేసుకోవాలట, అలాగే గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం మంచిదట.

చేయకూడని పనులు: కొత్త ఒప్పందాలు చేసుకోకూడదట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదట.

ఆరవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా ఆరు, పదిహేను, ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వ్యక్తులు ఆరవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: ఈ జాతకులు చంద్రగ్రహణం రోజు ఉప్పు నీటితో స్నానం చేయాలట. అలాగే లక్ష్మీ దేవి ప్రార్థన చేయాలట.

చేయకూడని పనులు: ఈ జాతకులు గ్రహణ సమయంలో కొనుగోళ్లు చేయకూడదట. అలాగే విలాసవంతమైన ఖర్చులు మానుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ఏడవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా ఏడు, పదహారు, ఇరవై అయిదు తేదీలలో పుట్టిన వ్యక్తులు ఏడవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: ఈ జాతకులు చంద్రగ్రహణం రోజు ధ్యానం, జపం చేయాలట. లేదంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన ఏదైనా సాధన చేసుకోవచ్చట.

చేయకూడని పనులు: కఠినంగా మాట్లాడటం మానుకోవాలని.. కోపం తగ్గించుకోవాలని ఎవరి మీద కోప్పడకూడదని సూచిస్తున్నారు.

ఎనిమిదవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వ్యక్తులు ఎనిమిదవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: చంద్రగ్రహణం రోజు ఈ జాతకులు పేదలకు సాయం చేయాలట. అలాగే శని లేదా హనుమంతుడికి సంబంధించిన ప్రార్థనలు చేయాలట.

చేయకూడని పనులు: ఈ జాతకులు చంద్రగ్రహణం రోజు ఎవ్వరినీ బాధపెట్టకూడదట. అన్యాయమైన పనులు చేయకూడదట.

తొమ్మిదవ సంఖ్య జాతకులు:

ఏ నెలలో అయినా తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వ్యక్తులు తొమ్మిదవ నెంబర్‌ జాతకులు అవుతారు. వీల్లు చంద్రగ్రహణ రోజు చేయవలసిని పనులేవో చేయకూడని పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చేయవలసిన పనులు: హనుమాన్‌ చాలీసా పారాయణ చేయడం, జపం చేసుకోవడం..  ఎరుపు పువ్వులతో ప్రార్థన చేయాలట.

చేయకూడని పనులు: ఈ జాతుకులు చంద్రగ్రహణం రోజు శారీరక శ్రమ కలిగింగే పనులు చేయకూడదట. కోపం తగ్గించుకోవాలట. అలాగే ప్రమాదకరమైన పనులు మానుకోవాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Also read: ఈ అలవాట్లే మీ సకల దరిద్రాలకు కారణమట – ఏ అలవాట్లో తెలుసా..?

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×