Upcoming Phones 2026: స్మార్ట్ ఫోన్ ప్రపంచానికి 2026 చాలా కీలకమైన సంవత్సరం. ఇప్పటివరకు చూసిన ఫోన్ల కంటే అప్‌డేటెడ్ లుక్, ఎక్కువ స్పీడ్, పవర్‌ఫుల్ చిప్‌సెట్, కెమెరాలో స్పష్టమైన మార్పులు ఈ ఏడాదిలో కనిపించబోతున్నాయి. బ్యాటరీ బ్యాక్‌అప్ పెరగడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు సాధారణం కావడం, ఫోల్డబుల్ ఫోన్ల వినియోగం పెరగడం 2026 లో ప్రధాన ట్రెండ్ గా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఈ ఏడాది రాబోతున్న ముఖ్యమైన ఫోన్లు, వాటి అంచనా ధరలు చూద్దాం.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ (Samsung Galaxy S26 Series)
2026 ప్రారంభంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్, ఎస్26 ప్లస్, ఎస్26 అల్ట్రా ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ ఎస్26 అల్ట్రాలో కెమెరా సెక్షన్ చాలా బలంగా ఉండబోతోంది. కొత్త తరం సెన్సార్ వల్ల నైట్ ఫోటోలు స్పష్టంగా రావడం, వీడియో రికార్డింగ్ లో స్టెబిలిటీ మెరుగవడం కనిపించొచ్చు. బ్యాటరీ సుమారు 5500 mAh వరకు ఉండే ఛాన్స్ ఉంది. ధర విషయానికి వస్తే గెలాక్సీ ఎస్26 దాదాపు రూ.80,000 నుంచి ప్రారంభం కావచ్చు, గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధర సుమారు ర.1,20,000 వరకు ఉండే అవకాశం ఉంది.
ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ (Apple iPhone 18 Series)
ఆపిల్ 2026లో ఐఫోన్ 18 సిరీస్ ను తీసుకురానుంది. ఇందులో ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18, iPhone 18 Pro, iPhone 18 Pro Max) మోడళ్లు ఉంటాయి. డిజైన్ పెద్దగా మారకపోయినా, డిస్‌ప్లే మరింత క్లీన్గా ఉండే అవకాశం ఉంది. కొత్త ఏ20 చిప్ వల్ల స్పీడ్ స్పష్టంగా పెరుగుతుంది. కెమెరాలో AI ఆధారిత ఎడిటింగ్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా మారతాయి. భారత్‌లో ఐఫోన్ 18 ప్రారంభ ధర సుమారు రూ85,000 ఉండొచ్చని అంచనా.
Also Read: Amazon Offer: లగ్జరీ డిజైన్.. అదిరిపోయే డిస్కౌంట్.. అమెజాన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఉమెన్స్ వాచ్ సెట్
వన్ ప్లస్ 14 సిరీస్ (OnePlus 14 Series)
వన్ ప్లస్ 14 సిరీస్ 2026 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో ఫ్లాట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ మీద కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. బ్యాటరీ సుమారు 6000 mAh వరకు ఉండే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే వన్‌ప్లస్14 దాదాపు రూ.65,000 నుంచి ప్రారంభం కావచ్చు. ఫ్లాగ్‌షిప్ అనుభవం తక్కువ ధరలో కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది.
షివోమి 16 సిరీస్ (Xiaomi 16 Series)
షివోమి 16 సిరీస్‌లో కెమెరా ప్రధాన హైలైట్ గా ఉండబోతోంది. కొత్త లెన్స్ టెక్నాలజీ వల్ల జూమ్ ఫోటోగ్రఫీ స్పష్టంగా మారే అవకాశం ఉంది. చైనాలో ముందుగా లాంచ్ అయ్యి తర్వాత భారత్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. షివోమి 16 ధర భారత మార్కెట్ లో సుమారు రూ.55,000 నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ (Google Pixel 11 Series)
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌లో కెమెరా క్వాలిటీ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కొత్త టెన్సర్ చిప్, పూర్తిగా ఏఐ ఆధారిత ఫోటో వీడియో ఫీచర్లు ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. బ్యాటరీ బ్యాక్‌అప్ కూడా గత పిక్సెల్ ఫోన్లతో పోలిస్తే మెరుగవుతుంది. పిక్సెల్ 11 ధర సుమారు రూ.70,000 నుంచి ప్రారంభం కావచ్చు.
ధరలో, ఫీచర్లులో ఏ ఫోన్ బెస్ట్?
2026 లో రాబోతున్న ఫోన్లన్నిటిని పోల్చి చూస్తే మొత్తం ప్యాకేజీగా శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా ముందుండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే, స్పీడ్ అన్నీ కలిపి ఇది ఆల్ రౌండర్ ఫోన్‌గా నిలుస్తుంది. కెమెరా మీద ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి పిక్సెల్ 11 బెస్ట్ ఎంపిక అవుతుంది. స్టేబుల్ అనుభవం, బ్రాండ్ విలువ కోరుకునే వారికి ఐఫోన్ 18 సరైన ఫోన్. చివరికి మీ బడ్జెట్, మీ అవసరాల్ని బట్టి 2026 లో మీకు సరిపోయే బెస్ట్ ఫోన్ ఎంచుకోవడమే అసలు ముఖ్యమైన విషయం.