E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. బంగారం కోసం ఇంటి ఓనర్‌ని చంపి, ఆ తర్వాత మృతదేహాన్ని

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. బంగారం కోసం ఇంటి ఓనర్‌ని చంపి, ఆ తర్వాత మృతదేహాన్ని
Advertisement

Hyderabad Crime: క్రైమ్ కొత్త రూపం సంతరించుకుందా? బంగారం కోసం ఇంటి ఓనర్‌ని దారుణంగా హత్య చేసే రోజులు వచ్చేశాయా? అద్దెకున్న యువకుడు అదే పని చేశాడా? మహిళ మృతదేహాన్ని కోనసీమ జిల్లాలోని గోదావరిలో పడేశాడా? సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ సిటీ పరిధిలోని నాచారం ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంతకు అసలేం జరిగింది?

హైదరాబాద్‌లో నడిబొడ్డున దారుణ హత్య

Advertisement

హైదరాబాద్ సిటీ పరిధిలోని నాచారం సమీపంలోని మల్లాపూర్ ప్రాంతంలో సూరెడ్డి సుజాత ఒంటరిగా ఉంటోంది. ఆమె వయస్సు 65 ఏళ్లు.  అనుకోకుండా ఆమె భర్త, కొడుకు మరణించారు. చివరకు ఆమె తన ఇంట్లో నివాసం ఉంటోంది. రెండు నెలల కిందట ఏపీలోని కోనసీమ జిల్లాలోని కొత్తపల్లి ప్రాంతానికి చెందిన అంజిబాబు హైదరాబాద్ సిటీకి వచ్చాడు.

డ్రైవర్‌గా పని చేస్తూ జీవితంలో సెటిల్ కావాలని డిసైడ్ అయ్యాడు. ఇదే క్రమంలో రెండు నెలల కిందట సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. సీన్ కట్ చేస్తే.. అంజిబాబు చూపు.. సుజాత మెడలో బంగారంపై పడింది. నగదు సొంతం చేసుకోవాలని ఆలోచించాడు. ఆమెని అంతమొందించి బంగారాన్ని తీసుకుని జీవితంలో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాడు.

Advertisement

బంగారం కోసం ఇంటి ఓనర్ని చంపిన అద్దెవాసి

డిసెంబర్ 19న శుక్రవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సుజాత గొంతు నులిమి హత్య చేశాడు అంజిబాబు. ఆమె మెడలోఉన్న 11 తులాల బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేశాడు. హత్య గురించి తన ఫ్రెండ్స్ యువరాజు, దుర్గారావుకు చెప్పి సొంతూరు వెళ్లిపోయాడు.

హత్య జరిగిన మరుసటి రోజు డిసెంబర్ 20న అంజిబాబుతోపాటు అతడి ఇద్దరు స్నేహితులు కారుని అద్దెకు తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు. సుజాత మృతదేహాన్ని కారులో కోనసీమ జిల్లాకి తీసుకెళ్లారు. కృష్ణలంక వద్ద గోదావరి నదిలో విసిరేశారు. తమకేమీ తెలియనట్లుగా తమ పని తాము చేసుకోవడం మొదలుపెట్టారు.

ALSO READ:  పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, స్పాట్‌లో నలుగురు మృతి

మొయినాబాద్‌లో ఉంటున్న సుజాత చెల్లెలు సువర్ణలత ఈనెల 24న సోదరి సుజాత ఇంటికి వచ్చింది. ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు ఆ ఇంట్లో అద్దెకు దిగిన అంజిబాబు జాడ కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. సుజాత ఇంటికి భారీ సూట్ కేసు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. చివరకు అంజిబాబుని  అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో సుజాత హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఈ తరహా ఘటనల్లో నేపాలీవాళ్లు నిందితులుగా ఉండేవారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×