Apple Valentine’s Day Offers: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రియమైన వారికి ఖరీదైన , స్టైలిష్ గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారి కోసం యాపిల్ ఇండియా అద్భుతమైన వాలెంటైన్స్ డే ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ సారి కేవలం ఐఫోన్ల మీదనే కాకుండా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్‌పాడ్స్‌పై కూడా భారీగా క్యాష్‌బ్యాక్ డీల్స్ ప్రకటించింది. నేరుగా ధర తగ్గించకపోయినా.. ప్రముఖ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా వేల రూపాయల ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పండగ సీజన్‌లో ఏ యాపిల్ ప్రోడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
యాపిల్ వాలంటైన్స్ డే సేల్ 2026 పూర్తి వివరాలు:
యాపిల్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక సేల్‌ను స్టార్ట్ చేసింది. ఇందులో ఐఫోన్ 17 సిరీస్ నుంచి లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ వరకు అన్నింటిపైనా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.
మ్యాక్‌బుక్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు:
ల్యాప్‌టాప్ యూజర్ల కోసం యాపిల్ బంపర్ ఆఫర్లు ఇచ్చింది. ముఖ్యంగా లేటెస్ట్ MacBook Air M4 మోడల్‌పై రూ. 10వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.
MacBook Air M4 (13-inch): దీని అసలు ధర రూ. 99,900 కాగా, క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 89,900 కే లభిస్తుంది.
MacBook Pro M4 (14-inch): దీనిపై కూడా రూ. 10వేల క్యాష్‌బ్యాక్ ఉంది. ఫలితంగా రూ. 1,69,900 ఫోన్ రూ. 1,59,900 కి వస్తుంది.
MacBook Pro M4 Pro (16-inch): హై-ఎండ్ మోడల్‌పై కూడా రూ. 10వేలు ఆదా చేసుకోవచ్చు.
మీరు ఇంకా తక్కువకు కొనాలనుకుంటే Vijay Sales వంటి రిటైలర్ల వద్ద చూడవచ్చు. అక్కడ ICICI లేదా Axis కార్డ్ వాడితే మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర దాదాపు రూ. 84,990 వరకు తగ్గే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 , 16 సిరీస్ ఆఫర్లు:
స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం లేటెస్ట్ iPhone 17 సిరీస్‌పై రూ. 5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. రూ. 82,900 విలువైన స్టాండర్డ్ ఐఫోన్ 17ను రూ. 77,900 కే సొంతం చేసుకోవచ్చు. పాత మోడల్స్ అయిన iPhone 16,16 Plus లపై రూ. 4,000 వరకు కూడా క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ ఆఫర్లు ICICI, Axis, American Express కార్డ్ హోల్డర్లకు మాత్రమే వర్తిస్తాయి.
Also Read: ఫార్మల్ అయినా క్యాజువల్ అయినా ఈ అనలాగ్ వాచీలతో.. మీ లుక్ అదిరిపోవడం గ్యారెంటీ బాస్!
యాపిల్ వాచ్ , ఐప్యాడ్స్:
Apple Watch Series 11: దీనిపై రూ. 4వేల బ్యాంక్ డిస్కౌంట్ ఉంది.
Apple Watch SE 3: బడ్జెట్ వాచ్‌పై రూ. 2వేల ఆఫర్ ఇచ్చారు.
iPad Air: కొత్త మోడల్స్‌పై రూ. 4 వేల క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.
AirPods: ఎయిర్‌పాడ్స్ ప్రో (3rd Gen) , ఎయిర్‌పాడ్స్ 4 మోడల్స్‌పై రూ. 1,000 వరకు డిస్కౌంట్ ఉంది.
మీరు యాపిల్ అఫీషియల్ స్టోర్‌లో కొంటే గిఫ్ట్ ప్యాకింగ్ పై పేరు, గ్రీటింగ్ తో లభిస్తుంది. అయితే.. కేవలం తక్కువ ధరకే కావాలనుకుంటే అకడమిక్ డిస్కౌంట్లు లేదా విజయ్ సేల్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లతో పోల్చి చూసి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ వాలెంటైన్స్ డేని యాపిల్ గ్యాడ్జెట్స్‌తో మరింత స్పెషల్‌గా మార్చుకోండి.