E-Paper
Advertisement

Rangareddy Districtc: రంగారెడ్డి జిల్లాలో జనసేన పార్టీ దూకుడు.. మున్సిపల్ బరిలో 22 మంది అభ్యర్థులు

Rangareddy Districtc: రంగారెడ్డి జిల్లాలో జనసేన పార్టీ దూకుడు.. మున్సిపల్ బరిలో 22 మంది అభ్యర్థులు
Advertisement

Rangareddy District: ప్రజల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిందని పార్టీ రాష్ట్ర ఇంచార్జి నెమూరి శంకర్ గౌడ్(Nemuri Shankar Goud) స్పష్టం చేశారు. అధికార పార్టీల వైఫల్యాలకు ప్రత్యామ్నాయంగా జనసేన ప్రజల తరఫున గళం విప్పుతోందన్నారు. సోమవారం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో మేడ్చల్ జనసేన పార్టీ ఇంచార్జి పెద్ది రాజు(Peddi Raju) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నెమూరి శంకర్ గౌడ్ అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు అందజేశారు.

అలియాబాద్ మున్సిపాలిటీ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన రాజకీయాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందని, మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు ప్రజల మద్దతు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలియాబాద్, ముడిచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా పోటీ చేస్తోందని తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏడుగురు, ముడిచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒకరు జనసేన అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో బరిలో ఉన్నారని చెప్పారు.

Advertisement

Also Read: IND vs PAK: పాకిస్తాన్ బాయ్ కాట్..అయినా శ్రీలంక‌కు టీమిండియా వెళ్లాల్సిందే? ఐసీసీ త‌ల‌తిక్క రూల్స్‌

పోరాడే పార్టీ జనసేన

అలాగే ఉమ్మడి రంగారెడ్డి(Rangareddy) జిల్లా వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ తరఫున మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం, పార్టీ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీ లేకుండా పోరాడే పార్టీ జనసేన ఒక్కటేనని, ఈ ఎన్నికలు రాజకీయాల్లో మార్పుకు నాంది అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కోఆర్డినేటర్ రామ్ మోహన్, లలిత రాణి, మల్లికార్జున్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు బిగ్ జీరో..  ముఖ్యమంత్రి కోరినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? పార్లమెంటులో గళమెత్తిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×