E-Paper
Advertisement

Vivo T2 Pro 5G Mobile Offer: పోలా అదిరిపోలా.. కర్వ్‌డ్ డిస్‌ప్లే ఫోన్‌పై భారీ డిస్కౌంట్!

Vivo T2 Pro 5G Mobile Offer: పోలా అదిరిపోలా.. కర్వ్‌డ్ డిస్‌ప్లే ఫోన్‌పై భారీ డిస్కౌంట్!
Advertisement

Vivo T2 Pro 5G Mobile Offer: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo పవర్‌ఫుల్ కెమెరా ఫోన్‌లను ఒకదాని తర్వాత ఒకటి భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తోంది. ఈ క్రమంలో బ్రాండ్ Vivo T2 Pro 5Gని లాంచ్ చేసింది. దాని T-సిరీస్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లేతో సన్నని ఫోన్. అయితే ఇప్పుడు తాజాగా స్మార్ట్‌ఫోన్ కంపెనీ బంపర్ డిస్కౌంట్ అందిస్తోంది. కస్టమర్లు ఈ ఫోన్‌ను దాదాపు రూ.20 వేల ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని డిజైన్ మాత్రమే కాకుండా దీని ఫీచర్లు కూడా Vivo T2 Pro 5Gని చాలా స్పెషల్‌గా చేస్తాయి.

బెస్ట్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించడానికి ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో ఆరా లైట్ తీసుకొచ్చారు. అలానే 64MP కెమెరా సెటప్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ MediaTek ప్రాసెసర్‌తో మెరుగైన పర్పామెన్స్ ఇస్తుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆఫర్లు, స్పెసిఫికేషన్లు చూడండి.

Advertisement

Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కుద ధరకు కొనుగోలు చేసే అవకాశం ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ బేస్ వేరియంట్ రూ. 22,999 తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లేదా ఎస్‌బిఐ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసినట్లయితే రూ. 2,000 తక్షణ తగ్గింపు పొందుతారు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నప్పుడు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. కానీ బ్యాంక్ఎ క్స్‌ఛేంజ్ ఆఫర్‌లు ఒకేసారి అప్లై చేయలేరు. Vivo T2 Pro 5Gని డూన్ గోల్డ్,న్యూ మూన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: బంగారం లాంటి ఆఫర్.. 200 MP కెమెరా ఫోన్‌పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. ఇప్పుడు ఎలా చేయాలి!

Advertisement

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడితే స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పూర్తి HD + AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌ ఫోన్‌లో ఉంటుంది.  OIS మద్దతుతో 64MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరాను అందించే ఈ ఫోన్ 3D గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. Vivo T2 Pro 5G బ్యాటరీ విషయానికి వస్తే 4600mAh బ్యాటరీకి 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది కేవలం 22 నిమిషాల్లోనే ఫోన్ 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.

Tags

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×